
Kaviya Maran IPL 2023: సీజన్ మారినా.. సన్ రైజర్స్ ఆట తీరులో ఎటువంటి మార్పు రాలేదు. ఐపీఎల్ 2023 16వ ఎడిషన్ లో భాగంగా ఉప్పల్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన తొలి మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు 72 పరుగుల తేడాతో దారుణమైన ఓటమిని మూటగట్టుకుంది.. అయితే ఈ మ్యాచ్ ను చూసేందుకు హైదరాబాద్ యజమాని కావ్య మారన్ హాజరైంది. డ గౌట్ లో వైట్ డ్రెస్ లో దేవకన్య లాగా మెరిసిపోయింది. కళ్ళకి సన్ గ్లాసెస్ తో బాలీవుడ్ హీరోయిన్లను మరిపించింది. అంతేకాదు తమ జట్టు ఆటగాళ్లు ఆడినప్పుడు ఎగిరి గంతేసింది. అవుట్ అయిపోయినప్పుడు బాధపడింది. మొత్తానికి మైదానంలో నిజమైన క్రికెట్ ప్రేమికురాలిగా కనిపించింది. తమ యజమాని వచ్చింది, ఆట చూస్తోంది అనే సోయి లేకుండా హైదరాబాద్ ఆటగాళ్లు దారుణమైన ప్రదర్శన కనబరిచారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న కావ్య.. హైదరాబాద్ ఆటగాళ్ల ఆట తీరు చూసి డీలా పడిపోయింది. కావ్య అలా అప్ సెట్ అవడం చూసి చాలామంది డిసప్పాయింట్ అవుతున్నారు..” ఏం కాదులే కావ్య పాప.. బెటర్ లక్ నెక్స్ట్ టైం అంటూ” ఆమెలో ధైర్యం నూరి పోస్తున్నారు.
కావ్య మారన్ కోసమైనా హైదరాబాద్ జట్టు మెరుగైన ప్రదర్శన చేసి ఉండాల్సిందని ట్విట్టర్ వేదికగా ఆమె అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు. కావ్య బాధపడుతుంటే చూడలేకుండా ఉన్నామని నెటిజన్లు అంటున్నారు.. భువనేశ్వర్ కుమార్ ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. వాస్తవానికి కావ్య పాప సామాజిక మాధ్యమాల్లో అంత చురుకుగా ఉండదు. కానీ ఆమెకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. దక్కన్ క్రానికల్ నుంచి హైదరాబాద్ జట్టును కళానిధి మారన్ కొనుగోలు చేయడం వెనుక కావ్య పాప ఉన్నది. తన తండ్రిని ఒప్పించి మరీ జట్టును కొనుగోలు చేసింది.. జట్టు ఆటగాళ్ళలో స్ఫూర్తి నింపేందుకు ఆమె చేయని ప్రయత్నం అంటూ లేదు. కానీ ఎందుకో హైదరాబాద్ ఆటగాళ్లు ఆమెను మెప్పించలేకపోతున్నారు.

ఇక కావ్య పాప ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ మామూలుగా ఉండవు. ఆమె అందానికి హోట్లల్లో అభిమానులు ఉన్నారు. హైదరాబాద్ మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ ఆమెను బాగా ఇష్టపడతారు. సౌత్ ఆఫ్రికా t20 లీగ్ లోనూ ఈ విషయం స్పష్టమైంది. అంతేకాదు తనని పెళ్లి చేసుకోవాలని కావ్య మారన్ కు సౌత్ ఆఫ్రికాలో అభిమాని రిక్వెస్ట్ పెట్టడం అప్పట్లో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కావ్య పాప ఓకే అనాలి కానీ పెద్ద పెద్ద బిజినెస్ టైకూన్లు ఆమె ఇంటి ముందు వచ్చి వాలిపోతారు. అందమే అసూయపడేంత అందం కాఫీ సొంతం. కానీ అందమైన అమ్మాయిని హైదరాబాద్ ఆటగాళ్లు సంతృప్తి పరచలేకపోతున్నారు.. అందుకే కావ్య పాప డిసప్పాయింట్ అవుతున్నది. ఆదివారం జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ ఓడిపోవడంతో కావ్య నిరాశ పడింది.. ఆ బాధ ఆమె కళ్ళల్లో కనిపించింది. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
Kavya Maran in the stands. pic.twitter.com/IaIivzpIZ9
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 2, 2023