Postal Insurance : కరోనా మహమ్మారి విజృంభణ తర్వాత లైఫ్ ఇన్సూరెన్స్,హెల్త్ ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ లపై ప్రజల్లో అవగాహన పెరిగింది. ఇన్సురెన్స్ తీసుకునేందుకు ఎక్కువ మంది ముందుకు వస్తున్నారు. కుటుంబంలో సంపాదించే వ్యక్తి అనుకోని సంఘటనలతో దూరం అయితే ఇన్సూరెన్స్ పాలసీలు ఆ కుటుంబానికి ఆర్థిక భరోసాను కల్పిస్తాయి. ఇప్పటికే చాలా మంది ఇన్సూరెన్స్ తీసుకునేందుకు ఎందుకోగానీ వెనకడుగు వేస్తున్నారు. అందుకు గల కారణాల్లో అధిక మొత్తంలో ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది.. అయితే, తక్కువ ప్రీమియంతోనే పోస్టల్ డిపార్ట్ మెంట్ జీవిత బీమా పాలసీలను పేదల కోసం తీసుకొచ్చింది. వాటి గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.
పోస్టల్ డిపార్ట్ మెంట్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ స్కీం తీసుకొచ్చింది. ఇన్సురెన్స్ తీసుకున్న వ్యక్తి ప్రమాదవశాత్తు చనిపోతే అతడి కుటుంబానికి రూ.15 లక్షలు చెల్లిస్తారు. నామినీకి ఈ డబ్బులు అందుతాయి. అలాగే శాశ్వత అంగ వైకల్యం ఏర్పడినా కూడా రూ.15 లక్షలు అందుతాయి. పాలసీదారు మరణిస్తే వారి పిల్లల చదువులకు రూ.లక్ష, పిల్లల పెళ్లికి మరో రూ.లక్ష అదనంగా చెల్లిస్తుంది పోస్టల్ డిపార్ట్ మెంట్. పాలసీదారు బతికి ఉంటే వైద్య ఖర్చులకు రూ.లక్ష ఇస్తారు. ఆసుపత్రిలో సాధారణ వైద్యానికి రోజుకు రూ.వెయ్యి, ఐసీయూలో చేరితే రోజుకు రూ.2 వేల నగదు చెల్లిస్తారు. చేయి లేదా కాలు విరిగితే రూ.25 వేలు అందుతాయి.
రూ.599 ప్రీమియంతో రూ. పది లక్షలు, రూ.799 ప్రీమియంతో రూ. 15 లక్షలు ఇన్సురెన్స్ పాలసీలను అందుబాటులోకి తెచ్చింది. పాలసీ తీసుకున్న నాటి నుంచే కవరేజీ లభిస్తుంది. 18 నుంచి 65 ఏళ్ల వయసులో వారికి మాత్రమే ఇవి వర్తిస్తాయి. 2022 ఏప్రిల్ లో తపాలాశాఖ ఈ స్కీంలను ప్రవేశ పెట్టింది. రూ.799, రూ.599 చెల్లిస్తే ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.15 లక్షలు, రూ.10 లక్షలు, శాశ్వత, పాక్షిక వైకల్యం అయితే రూ.15 లక్షలు, రూ.10 లక్షలు స్టార్ ఇన్సూరెన్స్ సంస్థ ద్వారా లభిస్తుంది.
హాస్పిటల్ నగదు వెయ్యి నుంచి రూ. 6 వేల వరకు, మందులు రవాణా ఖర్చులకు రూ. 14 వేలు వర్తిస్తుంది. చనిపోతే అంబులెన్స్, మృతదేహాన్ని తరలించేందుకు రవాణా ఖర్చులు రూ. 11 వేలు, రూ.9 వేలు ఇస్తారు. అంత్యక్రియల ఖర్చులు రూ. 9 వేలు ప్రమాదం ఏ విధంగా జరిగినా పాలసీ కచ్చితంగా వర్తించేలా నిబంధనలు రూపొందించారు. ఈ పాలసీలు తీసుకోవాలంటే ముందుగా పోస్టల్ బ్యాంకు ఖాతా ఉండాలి. ఖాతా లేనివారు రూ.200లో కొత్తగా తెరవాలి. బీమా పాలసీకి ప్రీమియంగా రూ.599 గానీ, రూ.799 గానీ చెల్లించాలి. దీర్ఘకాలిక పక్షవాతం ఉన్నవారికి ఈ పాలసీ వర్తించదు. పాలసీదారులకు బాండ్ కూడా ఇస్తారు.