https://oktelugu.com/

బోయినపల్లి కిడ్నాప్‌ వ్యవహారం సెటిల్ చేసుకున్నారా?

గత నెలలో ఇరు రాష్ట్రాల్లోనూ సంచలనం సృష్టించిన బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసు ఇప్పుడు ఎందుకు సైలెంట్‌ అయింది..? ఈ కేసులో ఇరువర్గాలు ఏమైనా రాజీకి వచ్చాయా..? ఒకానొక సందర్భంలో ఏకంగా మాజీ మంత్రిని అరెస్టు చేసిన జైలులో పెట్టిన పోలీసులు ఇప్పుడు ఎందుకు పట్టించుకోవడం లేదు..? అంతేకాదు.. మాజీ మంత్రి అఖిలప్రియ భర్త భార్గవరామ్‌ను ఇంకా ఎందుకు అదుపులోకి తీసుకోవడంలేదు..? ఈ కేసును ఎందుకింత నిర్లక్ష్యం చేస్తున్నారు..? అనేది అర్థం కాకుండా ఉంది. Also Read: నేనే […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 10, 2021 2:38 pm
    Follow us on

    Boyanapalli kidnaping case
    గత నెలలో ఇరు రాష్ట్రాల్లోనూ సంచలనం సృష్టించిన బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసు ఇప్పుడు ఎందుకు సైలెంట్‌ అయింది..? ఈ కేసులో ఇరువర్గాలు ఏమైనా రాజీకి వచ్చాయా..? ఒకానొక సందర్భంలో ఏకంగా మాజీ మంత్రిని అరెస్టు చేసిన జైలులో పెట్టిన పోలీసులు ఇప్పుడు ఎందుకు పట్టించుకోవడం లేదు..? అంతేకాదు.. మాజీ మంత్రి అఖిలప్రియ భర్త భార్గవరామ్‌ను ఇంకా ఎందుకు అదుపులోకి తీసుకోవడంలేదు..? ఈ కేసును ఎందుకింత నిర్లక్ష్యం చేస్తున్నారు..? అనేది అర్థం కాకుండా ఉంది.

    Also Read: నేనే కనుక సీఎం అయితే.. పెద్దిరెడ్డి వ్యాఖ్యలతో వైసీపీలో అలజడి

    సీఎం కేసీఆర్ బంధువులు ప్రవీణ్ రావు సోదరుల కిడ్నాప్ కేసు మెల్లగా తేలిపోతోంది. మొదట్లో ఏ-2గా చెప్పి.. ఆ తర్వాతి రోజే ఏ-1గా మార్చి భూమా అఖిలప్రియను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత.. పాత్రధారులంటూ మరికొంత మందిని అరెస్ట్ చూపించారు. అయితే.. ఈ మొత్తం వ్యవహారంలో అత్యంత కీలకమైన వారుగా పోలీసులు చెబుతూ వస్తున్న అఖిలప్రియ భర్త భార్గవరామ్, ఆయన సోదరుడు.. అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డితో పాటు కిడ్నాప్‌లో ప్రత్యక్షంగా పాల్గొన్నారని ప్రచారం జరిగిన గుంటూరు శ్రీనును కూడా పట్టుకోలేకపోయారు.

    అంతేకాదు.. వీరందరూ ఏకంగా దిగువ కోర్టులో ముందస్తు బెయిల్ కోసం అప్లయ్ చేశారు. అక్కడ నిరాశ ఎదురవడంతో హైకోర్టుకు వెళ్లారు. వారందరికీ హైకోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ముందస్తు బెయిల్‌ రాకుండా చేయడానికి తెలంగాణ పోలీసులు పెద్దగా ప్రయత్నించలేదు. నిజానికి ఇలా తప్పించుకుని తిరుగుతున్న వారిని అరెస్ట్ చేయలేకపోవడం పోలీసుల వైఫల్యం. కేసు బయటపడినప్పుడు హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ దాదాపుగా ప్రతీ రోజు ప్రెస్ మీట్ పెట్టి కిడ్నాప్ వ్యవహారాన్ని కథలు కథలుగా చెప్పేవారు.

    Also Read: బీజేపీ వ్యూహంలో జనసేనాని.. స్టీల్‌ ఉద్యమంలో పాల్గొనంది అందుకేనా..!

    మ్యాప్‌లు కూడా ప్రదర్శించారు. గుంటూరు శ్రీను, భార్గవరామ్, జగత్ విఖ్యాత్ రెడ్డి వంటి వారిని పట్టుకోవడం.. పది టీములు.. ఇరవై టీముల్ని పెట్టామని చెబుతూ ఉండేవారు. ఫలానా చోట ఉన్నారని వెళ్తే జస్ట్ మిస్ అయ్యారని మీడియాకు లీకులు ఇచ్చేవారు. ఎన్ని చేసినా చివరికి ఎవరినీ పట్టుకోలేకపోయారు. ఈ నిర్లక్ష్యంతోనే వారికి బెయిల్ రావడానికి మార్గం ఏర్పడింది. అయితే.. పోలీసులే కావాలని నిర్లక్ష్యం చేశారన్న అభిప్రాయాన్ని కొంత మంది వ్యక్తం చేస్తున్నారు. ప్రవీణ్ రావు, అఖిలప్రియ మధ్య ఉన్నది భూ వివాదం.. ఆ విషయంలో పెద్దలు జోక్యం చేసుకుని సెటిల్ చేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే పోలీసులు కూడా ఎలాంటి ఆసక్తి చూపడం లేదని అంటున్నారు.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్