https://oktelugu.com/

ట్రంప్ ఓడిపోతే భారత్ కు ఇబ్బందులు తప్పవా?

అమెరికాలో త్వరలోనే అధక్ష్య ఎన్నికల జరుగనున్నాయి. నవంబర్ లో కొత్త అధక్ష్యుడి ఎన్నిక ఉండనుంది. దీంతో ఇప్పటి నుంచి అమెరికా ఎన్నికల కోలాహాలం మొదలైంది. ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటినుంచే ఎన్నికల తాయిలాలను ప్రకటిస్తున్నారు. అమెరికాలో కరోనా ఎఫెక్ట్ నేపథ్యంలో ప్రతీఒక్క అమెరికా పౌరుడి అకౌంట్లో భారీమొత్తంలో నగదువేసి ఆదుకున్నారు. అమెరికన్లను ఆకట్టుకునే భాగంగానే హెచ్1బీ వీసాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై తీవ్ర వ్యతిరేకతలు వచ్చి ట్రంప్ వెనక్కి […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 29, 2020 / 07:32 PM IST
    Follow us on


    అమెరికాలో త్వరలోనే అధక్ష్య ఎన్నికల జరుగనున్నాయి. నవంబర్ లో కొత్త అధక్ష్యుడి ఎన్నిక ఉండనుంది. దీంతో ఇప్పటి నుంచి అమెరికా ఎన్నికల కోలాహాలం మొదలైంది. ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటినుంచే ఎన్నికల తాయిలాలను ప్రకటిస్తున్నారు. అమెరికాలో కరోనా ఎఫెక్ట్ నేపథ్యంలో ప్రతీఒక్క అమెరికా పౌరుడి అకౌంట్లో భారీమొత్తంలో నగదువేసి ఆదుకున్నారు. అమెరికన్లను ఆకట్టుకునే భాగంగానే హెచ్1బీ వీసాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై తీవ్ర వ్యతిరేకతలు వచ్చి ట్రంప్ వెనక్కి తగ్గలేదు. అయితే కరోనా విషయంలో ట్రంప్ ఫెయిల్ అయ్యారని అమెరికన్లు భావిస్తున్నారు. ఈనేపథ్యంలో ఆయనకు మరోసారి అధ్యక్ష పదవీ దక్కకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది.

    వరుస లాకప్ డెత్ లతో తమిళనాడులో కలకలం!

    అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ట్రంప్ పై ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కరోనా విషయంలో ట్రంప్ నిర్లక్ష్యంగా వ్యహరించారనే భావన అమెరికన్లలో ఉంది. అంతేకాకుండా నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ ను పోలీసులు అత్యంతదారుణంగా హత్య చేసిన విషయంలో ట్రంప్ వ్యవహరించిన తీరు విమర్శలకు తావునిచ్చింది. దీంతో నల్లజాతీయులుంతా వీధుల్లోకి వచ్చి ట్రంప్ కు వ్యతిరేకంగా నిరసన తెలిపిన సంగతి తెల్సిందే. ట్రంప్ నల్లజాతీయులను అణచివేసేందుకు యత్నించడంతో ఆయనపై అమెరికన్లలో వ్యతిరేకలు వ్యక్తమయ్యారు. ఈనేపథ్యంలో అమెరికన్ అధ్యక్ష పదవీకి రెండోసారి పోటీచేస్తున్న ట్రంప్ గెలిచే అవకాశం లేదనే ప్రచారం స్థానికంగా జరుగుతోంది.

    మరోవైపు అధ్యక్ష బరిలో ఉన్న జో బిడెన్ కు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒకరకంగా భారత్ కు ప్రతికూల అంశమే. జో బిడెన్ తొలి నుంచి భారత్ పట్ల వ్యతిరేకంగానే వ్యవహరిస్తున్నారు. కశ్మీర్ అంశంలో ఆయన పాకిస్థాన్ కు మద్దతుకు ప్రకటించాడు. మోడీ సర్కార్ చేపట్టిన సీఏఏపై వ్యతిరేకంగా మాట్లాడి భారత్ పై ద్వేషాన్ని వెళ్లగక్కారు. జో బిడెన్ క్రానికల్ కమ్యూనిస్టు ఐడియాలజీని అనుసరిస్తుంటారు. ఈయన వ్యవహర శైలితో పొలిస్తే ఒకరకంగా ట్రంప్ చాలా బెటరని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

    మోడీపై రాహుల్ నిప్పుల వెనుక అసలు కారణం ఇదీ

    ఒకవేళ అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోయి జో బిడెన్ గెలిస్తే భారత్ కు ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది. ఇప్పటివరకు భారత్-అమెరికాకు ఉన్న మంచి సంబంధాలు దెబ్బతిసే అవకాశాలు ఉందనే వాదనలు విన్పిస్తున్నారు. పాకిస్థాన్ సైతం జో బిడెన్ అమెరికా అధ్యక్షుడి అయితే రెచ్చిపోవడం ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో అమెరికా ఎన్నికలపై కేంద్రంలోని బీజేపీ సర్కార్ నజర్ వేసినట్లు తెలుస్తోంది. రానున్న అమెరికా ఎన్నికల్లో ఏం జరుగుతుందో వేచిచూడాల్సిందే..!