వరుస లాకప్ డెత్ లతో తమిళనాడులో కలకలం!

వరుస లాకప్ డెత్ లు తమిళనాడులో వేడి పుట్టిస్తున్నాయి. మొన్న టుటికోరన్ లో తండ్రి కొడుకులు, జయరాజ్, బెనిక్స్ మృతి మరువకముందే నేడు మరో లాకప్ డెత్ వెలుగులోకి వచ్చింది. ఓ ఆటో డ్రైవర్ పోలీసు కస్టడీలో మృతి చెందిన ఘటన రాష్ట్రంలో కలకలం సృష్టిస్తోంది. తిరునల్వేలికి చెందిన ఎన్.కుమరేశన్ అనే ఆటో డ్రైవర్ పోలీసు కస్టడీలో తీవ్రంగా గాయాలపాలయ్యాడు. దీంతో పదిహేను రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఓ భూ వివాదం కేసులో అతడిని […]

Written By: Neelambaram, Updated On : June 29, 2020 6:50 pm
Follow us on

వరుస లాకప్ డెత్ లు తమిళనాడులో వేడి పుట్టిస్తున్నాయి. మొన్న టుటికోరన్ లో తండ్రి కొడుకులు, జయరాజ్, బెనిక్స్ మృతి మరువకముందే నేడు మరో లాకప్ డెత్ వెలుగులోకి వచ్చింది. ఓ ఆటో డ్రైవర్ పోలీసు కస్టడీలో మృతి చెందిన ఘటన రాష్ట్రంలో కలకలం సృష్టిస్తోంది. తిరునల్వేలికి చెందిన ఎన్.కుమరేశన్ అనే ఆటో డ్రైవర్ పోలీసు కస్టడీలో తీవ్రంగా గాయాలపాలయ్యాడు. దీంతో పదిహేను రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఓ భూ వివాదం కేసులో అతడిని పోలీసులు తీసుకువెళ్లారు. లాకప్ లో అతడిని తీవ్రంగా హింసించారు. దీంతో అతడు ఇంటికి వచ్చిన తర్వాత రక్తపు వాంతులతో బాధపడటంతో కుమరేశన్ ని మొదట స్థానిక ఆసుపత్రిలో చికిత్స చేయించారు. చివరకు పరిస్థితి మరింత విషమించడంతో , తిరునల్వేలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అతని కిడ్నీ, ఇతర అవయవాలు తీవ్రంగా దెబ్బ తిడంతో, అంతర్గత స్రావం విపరీతం అవ్వడంతో వైటల్ ఆర్గన్స్ పనిచేయడం లేదని డాక్టర్లు తెలిపారు. అయితే శనివారం సాయంత్రం కుమరేశన్ తీవ్ర అస్వస్థతతో మరణించాడు. ఈ ఘటనతో పోలీసుల అకృత్యాలపై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తడంతో, ఈ కేసుకు సంబంధించి ఇద్దరు పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఇదిలా ఉంటే తమిళనాడులోనే ట్యుటికోరన్ లాకప్ డెత్ లో తండ్రీకొడుకుల జయరాజ్, బెనిక్స్ ల మృతి కేసును సీబీఐకి లప్పగిస్తామని ఆ రాష్ట్ర సీఎం పళనిసామి ప్రకటించారు. ప్రస్తుతం ఆ కేసును మద్రాసు హైకోర్టు మధురై బెంచ్ సొంతంగా దర్యాప్తు చేస్తోందని, కోర్టు అనుమతితో సీబీఐకి ఇస్తామని తెలిపారు.

తండ్రి కొడుకుల లాకప్ డెత్

జయరాజ్ , అతని కొడుకు బెనిక్స్ తమిళనాడులోని తూత్తుకుడిలో సెల్ ఫోన్ షాపును నడిపిస్తున్నా రు. లాక్ డౌన్ టైమ్ లో షాపును కరెక్టు సమయంలో మూసేయ లేదంటూ పోలీసులతో జరిగిన వాగ్వాదంతో అరెస్టయ్ యారు. తర్వాత ఇద్దరూ కోవిల్ పట్టి హాస్పిటల్ లో చనిపోయారు. అయితే లాకప్ లో తండ్రీ కొడుకులు మృతి చెందడంపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఘటనకు కారణమైన వాళ్లపై మర్డర్ కేసు పెట్టాలని జయరాజ్ కుటుంబీకులు డిమాండ్ చేశారు. ఈ ఘటనలో ఇప్పటికే ఇద్దరు ఎస్సైలు సహా నలుగురు పోలీసులను అధికారులు సస్పెండ్ చేశారు. కాగా, కేసు విషయంలో మేజిస్ట్రేట్ బాగా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారని జయరాజ్ అల్లుడు పొన్షెకర్ చెప్పారు.