Virat Kohli: ఈ శతాబ్దంలోనే అత్యుత్తమ షాట్ కోహ్లీదే.. అది పాక్ పై కొట్టిందే.. ఐసీసీ వీడియో వైరల్…

అతను కొట్టే ఒక్కో షాట్ ఒక్కో బుల్లెట్ల దూసుకు పోతుంటే ఆ బ్యాటింగ్ స్టైల్ చూసిన ప్రతి అభిమాని కూడా ఆనందంతో కేరింతలు కొడతాడు. బ్యాట్ పట్టుకునే చేతిలో పవర్ ఉన్నప్పుడు, కొట్టే షాట్ లో క్లారిటీ ఉన్నప్పుడు, బౌండరీ వెళ్ళడానికి బాల్ మాత్రం ఎందుకు తడపడుతుంది.

Written By: Gopi, Updated On : November 8, 2023 9:34 am

Virat Kohli

Follow us on

Virat Kohli: కొంత మంది ప్లేయర్ల కి ప్రపంచ క్రికెట్ లో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అప్పటి వరకు ఒక మూస ధోరణిలో ఆడుతున్న ఆట తీరని బ్రేక్ చేస్తూ గ్రౌండ్ లో ఒక ప్రత్యేకమైన బౌలర్ ని ఎదుర్కోవడానికి ఏం కావాలి అనేదాని మీద ఫోకస్ పెట్టీ, ప్రపంచ దేశాల అభిమానులను తమ వైపు తిప్పుకొని ,ప్రపంచ పటంలో తమ దేశం గుర్తింపును అగ్రస్థానం లో నిలిపే బ్యాట్స్ మెన్స్ కొందరు మాత్రమే ఉంటారు. అతనికి వీరుడు అనే మాట చాలా చిన్నది అవుతుంది. వీరత్వంతో సాగే అతని పోరాటం ముందు బలైపోయే బౌలర్లు బోరున విలపించడం ఒక్కటే తక్కువవుతుంది. గ్రౌండ్ కి తెలుసు ఆ ప్లేయర్ బరి లోకి వస్తే పరుగుల వరద పారుతుందని,సెంచరీలతో సునామి సృష్టిస్తాడని, ఆ ప్లేయర్ రాక కోసం వేయి కన్నులతో ఎదురుచూసిన గ్రౌండ్ల కి సైతం అతని ఆట ఆనందాన్ని కలిగిస్తుంది…

అతను కొట్టే ఒక్కో షాట్ ఒక్కో బుల్లెట్ల దూసుకు పోతుంటే ఆ బ్యాటింగ్ స్టైల్ చూసిన ప్రతి అభిమాని కూడా ఆనందంతో కేరింతలు కొడతాడు. బ్యాట్ పట్టుకునే చేతిలో పవర్ ఉన్నప్పుడు, కొట్టే షాట్ లో క్లారిటీ ఉన్నప్పుడు, బౌండరీ వెళ్ళడానికి బాల్ మాత్రం ఎందుకు తడపడుతుంది. ఇక బౌలర్లు సైతం తన చేతిలో ఓడిపోయి తనకు దాసోహం అవ్వడానికి రెడీగా ఉన్నారు అంటే ఆ వ్యక్తి ఆడే క్రికెట్ లో ఎంత క్వాలిటీ ఉందొ అలాగే ఆ వ్యక్తి పోరాడే పోరాటంలో కూడా ఒక జీవితానికి సంభందించిన తెగింపు అయితే ఉంది అనేది చూసే ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది. గ్రౌండ్ లో తనదైన రీతిలో షాట్స్ కొడుతూ ఇండియా కి అద్భుతమైన విజయాలను అందించడం లో ఇప్పటికీ పోరాటం చేస్తునే ఉన్న ఒకే ఒక్కడు విరాట్ కోహ్లీ…

ఆయన కొట్టిన ఒక షాట్ ఈ శతాబ్దంలోనే అద్భుతమైన షాట్ గా నిలిచింది అంటే ఆయన ఆడే మ్యాచ్ మీదగాని, ఆయన కొట్టే షాట్ల మీద గాని,ఆయన ఎంత ఎఫర్ట్ పెట్టి ఆడతాడో ఈ ఒక్క విషయాన్ని అర్థం చేసుకుంటే మనకు పూర్తిగా అర్థమవుతుంది… గతేడాది టి 20 వరల్డ్ కప్ పాకిస్థాన్ తో ఆడిన మ్యాచ్ లో పాకిస్థాన్ బౌలర్ అయిన రావూస్ బౌలింగ్ లో కొట్టిన ఒక సిక్సర్ ఈ శతాబ్దంలోనే అత్యంత అద్భుతమైన షాట్ గా ఐసీసీ గుర్తించింది. ఇక ఈ మ్యాచ్ లో విరోచత పోరాటం చేసిన కోహ్లీ ప్రత్యర్థి జట్టు అయిన పాకిస్తాన్ మీద 82 పరుగులు చేసి ఇండియన్ టీమ్ కి ఒక ఘన విజయాన్ని అందించి పెట్టాడు… గెలవాలనే ఆశ ముందు ఓటమి ఎంత చిన్నదో చేసి చూపించిన విరాట్ అనే వీరుడు అందుకున్న ఒక చిరు సత్కారం ఇది…