https://oktelugu.com/

ఎన్నాళ్లో వేచిన ఉదయం.. ఏపీకి శ్రీలక్ష్మి!

అక్రమాస్తుల కేసులో ఇరుక్కొని తీవ్రంగా ఇబ్బందులు పడ్డ ఐఏఎస్ లలో శ్రీలక్ష్మి ఒకరు. రాష్ట్ర విభజన క్రమంలో కేంద్రం ఆమెను తెలంగాణకు కేటాయించింది. ఏపీలో చంద్రబాబు అధికారంలో ఉన్నంతవరకు సైలెంట్ గా ఉన్న ఆమె.. జగన్ సీఎం అయిన దగ్గర్నుంచి ఏపీకి వెళ్లడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇన్నాళ్లూ పైరవీలు సాగించి.. ఎట్టకేలకు ఏపీలో విధులు నిర్వహించాలనే తన లక్ష్యాన్ని సాధించుకున్నారు. Also Read: ఫోర్జరీ కేసులో మాజీ జడ్జి అరెస్టు..! 20 నెలల ప్రయత్నం… ఒకటీ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 12, 2020 / 12:41 PM IST
    Follow us on


    అక్రమాస్తుల కేసులో ఇరుక్కొని తీవ్రంగా ఇబ్బందులు పడ్డ ఐఏఎస్ లలో శ్రీలక్ష్మి ఒకరు. రాష్ట్ర విభజన క్రమంలో కేంద్రం ఆమెను తెలంగాణకు కేటాయించింది. ఏపీలో చంద్రబాబు అధికారంలో ఉన్నంతవరకు సైలెంట్ గా ఉన్న ఆమె.. జగన్ సీఎం అయిన దగ్గర్నుంచి ఏపీకి వెళ్లడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇన్నాళ్లూ పైరవీలు సాగించి.. ఎట్టకేలకు ఏపీలో విధులు నిర్వహించాలనే తన లక్ష్యాన్ని సాధించుకున్నారు.

    Also Read: ఫోర్జరీ కేసులో మాజీ జడ్జి అరెస్టు..!

    20 నెలల ప్రయత్నం…
    ఒకటీ రెండు కాదు.. దాదపు ఇరవై నెలలు అత్యున్నత స్థాయి ప్రయత్నాలు చేసి ఏపీ కేడర్ లో చేరారు శ్రీలక్ష్మి. ఎన్నికల పలితాలు వచ్చాక ముఖ్యమంత్రి జగన్‌ శ్రీలక్ష్మిని తెలంగాణ నుంచి ఏపీకి డిప్యూటేషన్ మీద తీసుకురావాలని ప్రయత్నించారు. మొదటిసారి తెలంగాణ సీఎం కేసీఆర్‌తో భేటీ అయినప్పుడే జగన్ ఈ ప్రతిపాదన చేశారు. కేసీఆర్ కూడా అంగీకరించారు. కానీ.. ఢిల్లీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. విజయసాయిరెడ్డి.. తాను ఢిల్లీలో ఉన్నంత కాలం శ్రీలక్ష్మిని ఏపీకి తీసుకు రావడానికి చాలా ప్రయత్నాలు చేశారు. తెలంగాణలో ఉద్యోగానికి సెలవు పెట్టిన ఆమె.. ఢిల్లీలోనే ఉండటం ప్రారంభించారు. ఒకటి రెండు సందర్భాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో కలిసి ఢిల్లీలో అమిత్ షా, ప్రధాని మోదీతోనూ భేటీల్లో కూడా శ్రీలక్ష్మి పాల్గొన్నారు. అయినా కానీ.. ఆమెను తెలంగాణ నుంచి డిప్యూటేషన్ పై ఏపీకి పంపే చాన్స్ మాత్రం సాధించలేకపోయారు.

    సొంత రాష్ట్రానికి పంపాలని..
    శ్రీలక్ష్మితో పాటు స్టీఫెన్ రవీంద్ర అనే మరో ఐపీఎస్‌ను కూడా.. ఏపీకి డిప్యూటేషన్ మీద తీసుకు రావాలని సీఎం జగన్ ప్రయత్నించారు. కానీ.. ఏపీకి రావడానికి స్టీఫెన్ నిరాకరించారు. శ్రీలక్ష్మి మాత్రం ఇక ఐఏఎస్ ఉద్యోగం చేస్తే ఏపీలోనే చేయాలన్నట్లుగా ప్రయత్నాలు చేశారు. చివరికి క్యాడర్ మార్చుకునేందుకు క్యాట్‌ను ఆశ్రయించారు. తనది ఏపీ అని క్యాట్‌లో పిటిషన్ వేసి శ్రీలక్ష్మి.. తనకు సొంత రాష్ట్రాన్ని కేటాయించాలని కోరారు.

    Also Read: ఆ మంత్రి ఇలాఖాలో ఇష్టారాజ్యమా?!

    కీలక పోస్టు..?
    అక్రమాస్తుల కేసుల్లో ఇరుక్కోకపోతే.. చీఫ్ సెక్రటరీగా అత్యధిక కాలం పని చేసే అధికారిగా రికార్డు సృష్టించేవారు. ఈ కేసుల్లో ఇరుక్కోవడంతో ఉద్యోగోన్నతులు ఆగిపోయాయి. అయితే.. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆమెకు అత్యంత కీలకమైన పదవి ఇస్తారని ప్రచారం సాగుతోంది. సీఎంవోలో చక్రం తిప్పే అవకాశం ఆమెకే లభించవచ్చని సమాచారం.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్