Homeజాతీయ వార్తలుఒప్పందాలకు మేం కట్టుబడే ఉన్నాం.. ఉల్లంఘిస్తున్నది చైనాయే : భారత్

ఒప్పందాలకు మేం కట్టుబడే ఉన్నాం.. ఉల్లంఘిస్తున్నది చైనాయే : భారత్

India-China Clash Again
ఇండియా-చైనా ఒప్పందాలకు తాము కట్టుబడే ఉన్నామని భారత విదేశాంగ శాఖ మరోసారి స్పష్టం చేసింది. ఇరు దేశాల సంయుక్త స్మారక స్టాంపుల విడుదల.. భారత్ కారణంగా రద్దయిందని చైనా ఆరోపించడాన్ని భారత్ ఖండించింది. భారత్-చైనా దౌత్య సంబంధాలు 70వ వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సంయుక్త స్మారక స్టాంపులను విడుదల చేయాలని ఇరు దేశాలూ భావించాయి. అయితే.. ఈ విషయమై భారత్ నుంచి ఎలాంటి స్పందనా లేకపోవడంతో ఆ కార్యక్రమం రద్దయినట్లు చైనా ఏకపక్షంగా ప్రకటించింది.

Also Read: భారత్ లో కరోనా కేసులు తగ్గడానికి కారణమిదే..?

చైనా వల్లే సరిహద్దు వివాదం..
తూర్పు లదాఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి వివాదం నెలకొనడానికి చైనా చర్యలే కారణమని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ అన్నారు. ఏకపక్షంగా స్టేటస్ కోను మార్చేసేందుకు చైనా చేసిన చర్యల ఫలితంగానే.. గత ఆర్నెల్లుగా సరిహద్దులో ప్రతిష్ఠంభన నెలకొందని అన్నారు. సరిహద్దులో శాంతి, ప్రశాంతతను నెలకొల్పాలన్న ద్వైపాక్షిక ఒప్పందాలకు చైనా తూట్లు పొడిచిందన్న శ్రీ వాస్తవ.. ఇరు దేశాలూ 1993, 1996 నాటి ద్వైపాక్షిక ఒప్పందాలు, ప్రొటోకాల్‌ను తప్పనిసరిగా పాటించాల్సిందేనని అన్నారు.

వారివి మాటలే..
‘ద్వైపాక్షిక ఒప్పందాల పరిరక్షణకు, శాంతియుత చర్చలకు కట్టుబడి ఉన్నామన్న చైనా ప్రకటనలను తాము గమనిస్తున్నామని, అయితే ఆ మాటలు ఆచరణలోకి ఎంతవరకూ వస్తాయో చూడాలని అన్నారు. రాబోయే రోజుల్లో జరగబోయే చర్చల ద్వారా సరిహద్దు ప్రతిష్ఠంభనకు పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నామని అన్నారు. పరస్పర అంగీకారంతో వీలైనంత త్వరగా ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి సైన్యం ఉపసంహరణతో పాటు సరిహద్దులో శాంతిని నెలకొల్పేందుకు చర్చలు ఉపయోగపడుతాయని భావిస్తున్నామని శ్రీవాస్తవ తెలిపారు.

Also Read:టీపీసీసీ చీఫ్ ఎవరో ముందే ఫిక్స్ అయిందా.. మరీ అభిప్రాయ సేకరణ సంగతెంటీ?

సంబరాలు మొదలు కాలేదు..
భారత్-చైనా దౌత్య సంబంధాలు 70వ వార్షికోత్సవాలు ఇంకా మొదలు కాలేదన్న విషయాన్ని గమనించాలని.. అందువల్ల రెండు దేశాలూ ఉమ్మడి కార్యాచరణతో ముందుకెళ్లేందుకు పెద్దగా అడ్డంకులు ఏమీ ఉండకపోవచ్చని శ్రీవాస్తవ అన్నారు. సంయుక్త స్మారక స్టాంపుల విడుదల కార్యక్రమం భారత్ కారణంగా రద్దయిందని ప్రకటించడం సరికాదన్నారు.

రష్యా ఆరోపణలు..
భారత్-చైనా సరిహద్దు ప్రతిష్ఠంభనపై ఈ శుక్రవారం రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ స్పందిస్తూ.. ‘భారత్ పాశ్చాత్య దేశాల దూకుడు, వంచక విధానానికి ఒక వస్తువుగా మారిందని ఆరోపించారు. క్వాడ్ అని పిలవబడే ఇండో-పసిఫిక్ వ్యూహాలను ప్రోత్సహించడం ద్వారా చైనా వ్యతిరేక గేమ్‌లో పాల్గొనడానికి భారత్ ప్రయత్నిస్తోందని విమర్శలు గుప్పించారు.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

1 COMMENT

Comments are closed.

Exit mobile version