https://oktelugu.com/

ఇకపై ఆ రాష్ట్రంలో ఉద్యోగులకు డ్రెస్ కోడ్..!

కొన్ని ప్రత్యేకమైన డిపార్టెంట్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు డ్రెస్ కోడ్ పాటిస్తుండటం చూస్తూనే ఉన్నాం. ఉదాహరణకు డాక్టర్.. లాయర్.. పోలీస్.. అగ్నిమాపక సిబ్బంది. ఇక మిగతా శాఖల్లో పని చేసే ప్రభుత్వ ఉద్యోగులు.. ప్రభుత్వం నియమించబడిన కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఎలాంటి డ్రెస్ కోడ్ లేదు. అయితే ఇకపై వారి కూడా డ్రెస్ కోడ్ తప్పనిసరి చేస్తూ మహారాష్ట్ర సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. Also Read: ఒప్పందాలకు మేం కట్టుబడే ఉన్నాం.. ఉల్లంఘిస్తున్నది చైనాయే : భారత్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 12, 2020 / 12:43 PM IST
    Follow us on

    కొన్ని ప్రత్యేకమైన డిపార్టెంట్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు డ్రెస్ కోడ్ పాటిస్తుండటం చూస్తూనే ఉన్నాం. ఉదాహరణకు డాక్టర్.. లాయర్.. పోలీస్.. అగ్నిమాపక సిబ్బంది. ఇక మిగతా శాఖల్లో పని చేసే ప్రభుత్వ ఉద్యోగులు.. ప్రభుత్వం నియమించబడిన కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఎలాంటి డ్రెస్ కోడ్ లేదు. అయితే ఇకపై వారి కూడా డ్రెస్ కోడ్ తప్పనిసరి చేస్తూ మహారాష్ట్ర సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది.

    Also Read: ఒప్పందాలకు మేం కట్టుబడే ఉన్నాం.. ఉల్లంఘిస్తున్నది చైనాయే : భారత్

    ప్రభుత్వ ఉద్యోగులు ఇష్టరీతిలో దుస్తులు ధరించడం వల్ల ప్రజల్లో చులకన భావం కలిగే ప్రమాదం ఉందని ప్రభుత్వం పేర్కొంది. ఇది ఉద్యోగుల పనితీరుపై పరోక్ష ప్రభావం చూపుతుందని తెలిపింది. అలాగే ఖాదీ దుస్తులను ప్రోత్సాహించే లక్ష్యంతో ప్రతీ శుక్రవారం ఉద్యోగులంతా ఖాధీ వస్త్రాలను ధరించాలని సూచించింది.

    ఇకపై ప్రభుత్వ కార్యాయాల్లో విధులు నిర్వహించే సిబ్బంది జీన్స్.. టీ-షర్ట్స్.. స్లిప్పర్స్‌ను ధరించొద్దని సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. మహిళ ఉద్యోగులు చీర.. సల్వార్.. చుడిదార్-కుర్తా.. లేదా చొక్కా.. ప్యాంట్.. అవసరమైతే దుపట్టా ధరించి కార్యాలయాలకు రావొచ్చని తెలిపింది

    Also Read: జగన్ పై కేంద్రానికి కేసీఆర్ ఫిర్యాదు: సానుకూలం తెలిపిన జలశక్తి మంత్రి..!

    మగవాళ్లు ప్యాంట్.. చొక్కాలు ధరించాలని సూచించింది. మహిళా ఉద్యోగులు చెప్పులు లేదా బూట్లు.. మగవాళ్లు షూ లేదా చెప్పులు ధరించాలని.. ఉద్యోగుల స్లిప్పర్స్ ధరించి విధులకు హాజరుకావడం స్పష్టంగా పేర్కొంది. అలాగే ప్రతీ శుక్రవారం ఉద్యోగులు ఖాదీ వస్త్రాలను ధరించాల్సిన అవసరం ఉందని మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాకరే తెలిపారు.

    దీంతో ఇకపై ఉద్యోగులు ఇష్టారీతిలో డ్రెస్సులు ధరించి ఆఫీసులకు వెళ్లేవారికి కాలం చెల్లినట్లే కన్పిస్తోంది. సర్కారు నిర్ణయాన్ని కొందరు స్వాగతిస్తుండగా మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం ఉద్యోగులకు డ్రెస్ కోడ్ విధించడంపై పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. మహారాష్ట్ర సర్కార్ నిర్ణయంపై దేశవ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతోన్నాయి.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్