Homeజాతీయ వార్తలువారి వల్లే పార్టీకి హైప్‌.. వారి వల్లే పతనం

వారి వల్లే పార్టీకి హైప్‌.. వారి వల్లే పతనం

Modi Amit Shah
మోడీ, అమిత్‌ షా.. వీరిది సక్సెస్‌ఫుల్‌ కాంబినేషన్‌. అందులో ఎవరికి ఎలాంటి అపోహలు అవసరం లేదు. ఈ రోజు బీజేపీకి అంత పేరు వచ్చిందన్నా.. బీజేపీ రెండుసార్లు అధికారంలో ఉందన్నా వీరి కృషి వల్లే. అసలు బీజేపీకి జవసత్వాలు అందించిన వాజ్ పేయి, అద్వానీలను పార్టీ ఏనాడో మరిచిపోయింది. అద్వానీ రథయాత్ర ద్వారా, వాజ్ పేయి పాలన ద్వారా బీజేపీకి దేశంలోని అనేక రాష్ట్రాల్లో బీజం వేశారు. దాని ఫలితం 2014లో దక్కింది. అప్పటికే పదేళ్లపాటు కాంగ్రెస్ పాలనను చూసి విసిగిపోయిన ప్రజలు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోడీ ప్రధానిగా వస్తారంటే చప్పట్లతో స్వాగతం చెప్పారు.

Also Read: కంచుకోటకు బీటలు.. చంద్రబాబుకు ఏం మిగిలింది?

ఇక అప్పటి నుంచి బీజేపీ వెనుతిరిగి చూసుకోలేదు. 2014 నుంచి ఎన్నో రాష్ట్రాలను తన ఖాతాలో వేసుకుంది బీజేపీ. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ను రెండు, మూడు రాష్ట్రాలకే పరిమితం చేయగలిగింది. ప్రతీ రాష్ట్రంలోనూ కాషాయ జెండా రెపరెపలాడటంతో ఇదంతా మోడీ, షా చలవ వల్లనే అన్నది క్యాడర్ బలమైన నమ్మకం. వారి వల్లనే పార్టీని దేశ వ్యాప్తంగా విస్తృతం చేయగలిగామని సంఘ్ పరివార్ సైతం నమ్ముతోంది. ఇంకా చాలా రాష్ట్రాలపై కన్నేసింది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలను టార్గెట్‌ చేశారు.

ఇదిలా ఉండగా.. రానురాను ఈ ఇద్దరి కారణంగానే పార్టీ అన్ని రాష్ట్రాల్లోనూ అధికారాన్ని కోల్పోవడమూ ఖాయమన్న కామెంట్స్ బలంగా వినిపిస్తున్నాయి. ఈ ఏడాది జరగనున్న ఐదు రాష్ట్రాల్లో బీజేపీ జెండా ఎక్కడా ఎగరకపోవచ్చనేది స్పష్టం అవుతోంది. అలాగే ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్‌లకు జరిగే ఎన్నికల్లోనూ బీజేపీ గెలుపు అంత సులువు కాదు. ఇప్పటికే గుజరాత్, యూపీల్లో అధికారంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

Also Read: ఆ ఆరు పదవులూ వైసీపీవే..

రానున్న కాలంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా మోడీ, షాలకు ఇబ్బందులు తప్పేలా లేవు. దీనికి కారణం వీరి నిర్ణయాలు ఏకపక్షంగా ఉండటమే. మిత్రులు సైతం ఒక్కొక్కరుగా దూరం అవుతూనే ఉన్నారు. అటు అగ్రి బిల్లులు తెచ్చిన క్రమంలోనూ మరికొన్ని పార్టీలు వీడిపోయాయి. ప్రజాప్రయోజనాలను పక్కన పెట్టి పారిశ్రామిక వేత్తలకు ఈ గుజరాతీ నేతలు ఉపయోగపడుతున్నారన్న విమర్శలు బాగా స్ప్రెడ్ అయ్యాయి. ఈ ఇద్దరి వల్ల ఇప్పటివరకు బీజేపీకి ఎంత వరకు హైప్‌ వచ్చిందో.. ఇప్పుడు ఆ ఇద్దరి వల్లే పార్టీ దిగజారిపోయే ప్రమాదం ఏర్పడిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Most Popular

Balakrishna Injury: బాలయ్యకు తీవ్ర గాయాలు.. జూనియర్ ఎన్టీఆర్ షాకింగ్ ట్వీట్ వైరల్..

Balakrishna Injury: నేడు కాకినాడ లో నందమూరి బాలకృష్ణ NBK111 షూటింగ్ జరుగుతుండగా , యాక్షన్ సన్నివేశం చిత్రీకరణ సమయంలో బాలయ్య కి మజిల్ టియర్ అవ్వడం తో ఆయన్ని వెంటనే హాస్పిటల్...

Tollywood Directors: బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేసే ఉద్దేశ్యం లేని తెలుగు దర్శకులు వీళ్లే…

Tollywood Directors: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లు కొందరు తెలుగు హీరోలు అవకాశం ఇవ్వకపోవడంతో బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ముఖ్యంగా వంశీ పైడిపల్లి తెలుగు స్టార్...

Vemulawada Rajanna Temple: వేములవాడకు తండ్రి 7 లక్షల విరాళం.. తిరిగివ్వాలని కూతుళ్ల పోరాటం.. ఊహించని ట్విస్ట్

Vemulawada Rajanna Temple: తెలంగాణలో ప్రముఖ శైవ క్షేత్రాలలో అత్యంత ప్రసిద్ధి చెందింది వేములవాడ రాజేశ్వర ఆలయం. ఇక్కడ స్వామి వారు లింగం రూపంలో ఉంటారు. ఈ ఆలయంలో కోడె మొక్కులను చెల్లించడం...

Football Legends Retirement: దిగ్గజాల నిష్క్రమణ.. పుట్ బాల్ చరిత్రలో ముగిసిన స్వర్ణయుగం

Football Legends Retirement: ప్రపంచంలో అత్యధిక ఆదరణ పొందిన క్రీడ ఫుట్బాల్. అందుకే ఫిఫా ప్రపంచ కప్ కు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. పైగా ఇది క్రీడల్లోకెల్లా అత్యధిక స్థాయిలో వీక్షణలు సొంతం...

US Iran Conflict: అమెరికా డేటా సెంటర్ పై దాడి.. ముదిరిన యుద్ధం

US Iran Conflict: గల్ఫ్‌ ప్రాంతంలో అమెరికా, ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా మారాయి. రెండు దేశాలు పరస్పరం దాడులు, ప్రతీకార చర్యలతో పశ్చిమాసియా మొత్తం అగ్నిగుండంలా మారింది. వాణిజ్య నౌకల రాకపోకలకు...
Oktelugu Epaper
Exit mobile version