ఈ మధ్య కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా స్త్రీ, పురుషులిద్దరినీ వేధిస్తున్న సమస్యలలో చుండ్రు సమస్య ఒకటి. అయితే కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా చుండ్రు సమస్యకు సులభంగా చెక్ పెట్టవచ్చు. వేపాకు చుండ్రును తగ్గించడంలో సహాయపడుతుంది. వేపాకు దురదను తగ్గించడంతో పాటు డాండ్రఫ్ పెరుగుదలకు కారణమయ్యే ఫంగస్ పెరుగుదలకు సులభంగా చెక్ పెడుతుంది.
Also Read: సపోటాలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..?
ఆపిల్ సీడర్ వెనిగర్ కూడా చుండ్రుకు చెక్ పెట్టడంలో అద్భుతంగా పని చేస్తుంది. వెనిగర్, నీళ్లు సమపాళ్లలో కలిపి షాంపూగా తయారు చేసుకుని వినియోగిస్తే చుండ్రు సమస్య దూరమవుతుంది. తక్కువ గాఢత ఉన్న షాంపూతో తలను శుభ్రం చేసుకున్నా కూడా చుండ్రు సమస్య దూరమవుతుంది. డాండ్రఫ్ సమస్యకు చెక్ పెట్టడంలో ఆస్పిరిన్ ట్యాబ్లెట్లు కూడా సహాయపడతాయి. ఆస్పిరిన్ ట్యాబ్లెట్లను న్యాప్ కిన్ లో ఉంచి షాంప్ కు ఆ పొడిని కొద్దిగా కలిపితే చుండ్రు సమస్య దూరమవుతుంది.
Also Read: జీడిపప్పు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే..?
కొబ్బరినూనెకు టీ ట్రీ ఆయిల్ ను కలిపి మాడుకు పట్టిస్తే కూడా చుండ్రు సమస్య తొలగిపోతుంది. నిమ్మరసంలో ఉండే యాసిడ్లు సైతం చుండ్రుకు చెక్ పెట్టడంలో సహాయపడతాయి. పులిసిన పెరుగును మాస్క్ లా వేసుకున్నా డాండ్రఫ్ తగ్గుతుంది. ఇలా మాస్క్ లా వేసుకుంటే జుట్టు మృదువుగా ఉంటుంది. చుండ్రు బారిన పడకుండా ఉండాలంటే ఇంట్లో ఎవరి కోసం వాళ్లు ప్రత్యేకంగా దువ్వెనలను వినియోగించాలి.
మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం
ప్రాసెస్ చేయబడిన ఆహార పదార్థాలు, జంక్ ఫుడ్, చక్కెర ఎక్కువగా ఉండే తీపి పదార్థాలకు వీలైనంత దూరంగా ఉండాలి. నిత్యం ధ్యానం, యోగా చేయడం ద్వారా చుండ్రు బారిన పడే అవకాశాలు తగ్గుతాయి. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉండే చేపలు, అవిసె విత్తనాలు, వాల్‌నట్స్ జుట్టు సమస్యలు ఎక్కువగా వేధించవు.