మళ్లీ తెరపైకి హైదరాబాద్ ‘యూటీ’

విశ్వనగరం హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటిస్తారని ఉద్యమ సమయంలో జోరుగా చర్చ జరిగింది. తెలంగాణ, ఏపీ విడిపోయిన తరువాత హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతంగా మారుతుందని అంతా భావించారు. అయితే అది ఉత్త కల్పితమే అని తరువాత తెలిసింది. అయినా.. కొందరు రాజకీయ నాయకులు దీన్ని క్యాష్ చేసుకుంటున్నారు. అవకాశం దొరికినప్పుడు హైదరాబాద్ ‘‘యూటీ’’ అంశాన్నే అస్ర్తంగా చేసుకుని ప్రసంగాలు చేస్తున్నారు. Also Read: బ్రేకింగ్: ఏపీలో మోగిన మున్సిపల్ ఎన్నికల నగారా జమ్ము కశ్మీర్ […]

Written By: Srinivas, Updated On : February 15, 2021 12:55 pm
Follow us on


విశ్వనగరం హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటిస్తారని ఉద్యమ సమయంలో జోరుగా చర్చ జరిగింది. తెలంగాణ, ఏపీ విడిపోయిన తరువాత హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతంగా మారుతుందని అంతా భావించారు. అయితే అది ఉత్త కల్పితమే అని తరువాత తెలిసింది. అయినా.. కొందరు రాజకీయ నాయకులు దీన్ని క్యాష్ చేసుకుంటున్నారు. అవకాశం దొరికినప్పుడు హైదరాబాద్ ‘‘యూటీ’’ అంశాన్నే అస్ర్తంగా చేసుకుని ప్రసంగాలు చేస్తున్నారు.

Also Read: బ్రేకింగ్: ఏపీలో మోగిన మున్సిపల్ ఎన్నికల నగారా

జమ్ము కశ్మీర్ ను రెండుగా విడదీసి.. యూటీగా చేయడంపై పార్లమెంటులో జరిగిన చర్చలో అసదుద్దీన్ ఓవైసీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని మోదీ ప్రభుత్వం రాష్ట్రాల సార్వభౌమధికారలను లాగేసుకునేందుకు భిన్నమైన వ్యూహాలతో ముందుకు సాగుతోందని చెప్పేందుకు యూటీ పదాన్ని వాడుకున్నారు. ఒక్క కశ్మీర్ విషయంలోనే కాదు.. కేంద్రం త్వరలో హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్ కతా వంటి పెద్ద నగరాలన్నింటిని కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తుందని వ్యాఖ్యానించారు.

ఈ అంశంపై పార్లమెంటులో కేంద్ర మంత్రులెవ్వరూ.. అధికారికంగా స్పందించలేదు. కానీ.. హైదరాబాద్ కు వచ్చి కేంద్రహోంశాఖ సహాయక మంత్రి కిషన్ రెడ్డి లాంటివారు మాత్రం ఓవైసీపై విరుచుకుపడుతున్నారు. ఓవైసీ గాలి కబుర్లు చెబుతున్నారని.. కేంద్రానికి అలాంటి ఉద్దేశం లేదని.. కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండి పడ్డారు.

Also Read: కేసీఆర్ బడ్జెట్ కత్తిమీద సామేనా.?

ఈ వివాదం ఏదో బాగుందని అనుకున్నారో ఏమో.. కొంతమంది దీనిపై సోషల్ మీడియాలో చర్చ పెడుతున్నారు. హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసే ఉద్దేశం ఉందని.. అందుకే పార్లమెంటులో సైలెంట్ గా ఉన్నారనే వాదన తీసుకొచ్చారు. నిజానికి హైదరాబాద్ యూటీ అనే మాట ఇదే మొదటిదిసారి కాదు.. రాష్ట్ర విభజనకు ముందు.. తరువాత చాలా సార్లు ప్రస్తావన వచ్చింది. కొన్నిసార్లు హైదరాబాద్ ను దేశానికి రెండో రాజధాని చేస్తారని అలాచేస్తే.. యూటీ చేయడం ఖాయమని చెప్పుకున్నారు.

నిప్పులేనిదే పొగ రాదన్నట్లు.. కేంద్రం దృష్టిలో అలాంటి ఆలోచన లేకపోతే.. బయటకు వచ్చే అవకాశం లేదు. అయితే ఇప్పటికైతే.. కేంద్రం అలాంటి ఆలోచన చేయకపోవచ్చు. మరోసారి తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి వస్తే.. దేశాన్ని తాము అనుకున్న విధంగా మార్చడంలో బీజేపీకి ఎలాంటి ఇబ్బంది ఎదురుకాదు. అప్పుడు హైదరాబాద్ యూటీ అవుతుందా..? దేశానికి రెండో రాజధాని అవుతుందా..? అని అంచనా వేయడం కష్టమే…

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్