https://oktelugu.com/

విశాఖ సాక్షిగా.. రాజీ‘డ్రామా’ల పర్వం..?

విశాఖ స్టీల్ ప్లాంటును ప్రయివేటీకరణ చేస్తామని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఏపీ ప్రజలు, రాజకీయ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. స్టీల్ ప్లాంటు ఉద్యోగులు, కార్మికుల్లోనే కాదు విశాఖ ప్రజల్లోనూ ఇప్పడీ ముచ్చట చర్చనీయంశంగా మారింది. విశాఖలో అన్ని పార్టీలు నిరసనలు ప్రారంభించాయి. చివరికి వైసీపీ నేతలు కూడా.. అవసరం అయితే రాజీనామాలు చేస్తాంటూ.. ప్రకటనలు సైతం చేశారు. అయితే గంటా శ్రీనివాస్ రావు ఏకంగా రాజీనామా ఇచ్చేసి.. స్టీల్ ప్లాంటు ఉద్యమానికి రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి రేపేలా చేశారు. Also […]

Written By:
  • Srinivas
  • , Updated On : February 15, 2021 / 01:15 PM IST
    Follow us on


    విశాఖ స్టీల్ ప్లాంటును ప్రయివేటీకరణ చేస్తామని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఏపీ ప్రజలు, రాజకీయ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. స్టీల్ ప్లాంటు ఉద్యోగులు, కార్మికుల్లోనే కాదు విశాఖ ప్రజల్లోనూ ఇప్పడీ ముచ్చట చర్చనీయంశంగా మారింది. విశాఖలో అన్ని పార్టీలు నిరసనలు ప్రారంభించాయి. చివరికి వైసీపీ నేతలు కూడా.. అవసరం అయితే రాజీనామాలు చేస్తాంటూ.. ప్రకటనలు సైతం చేశారు. అయితే గంటా శ్రీనివాస్ రావు ఏకంగా రాజీనామా ఇచ్చేసి.. స్టీల్ ప్లాంటు ఉద్యమానికి రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి రేపేలా చేశారు.

    Also Read: బ్రేకింగ్: ఏపీలో మోగిన మున్సిపల్ ఎన్నికల నగారా

    ఆంధ్రుల హక్కు.. విశాఖ ఉక్కు అనే నినాదం ద్వారా.. మొత్తం ఏపీ ప్రజల సెంటిమెంటుగా మారుస్తున్నారు. తన రాజీనామా ఫార్మట్ లో లేదని వచ్చిన విమర్శలను తిప్పి కొట్టేందుకు గంటా.. స్పీకర్ ఫార్మట్ లో తెలుగు, ఇంగ్లిష్ లో కూడా లేఖలు రాసి పంపారు. అదే సమయంలో తాను ప్రజాప్రతినిధిగా ఉండనని ఉద్యమంలోనే ఉంటానని స్పష్టం చేస్తున్నారు. తన రాజీనామా ద్వారా వచ్చే ఉప ఎన్నికల్లో పోటీ చేయబోనని ఆయన ప్రకటించారు. గంటాకు తోడుగా.. ఇప్పుడు ఇతర టీడీపీ ఎమ్మెల్యేలు సైతం రాజీనామాల స్వరం అందుకుంటున్నారు.

    స్టీల్ ప్లాంటుపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్నందున ఆపడానికి తీవ్రమైన ఒత్తిడి తేవాల్సి ఉందని.. అందుకే ఏపీలోని 175 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని విశాఖకు చెందిన మరో ఎమ్మెల్యే.. గణబాబు పిలుపునిచ్చారు. దీంతో వైసీపీ నేతలు ఉలిక్కి పడాల్సి వచ్చింది. విశాఖ ప్రజాప్రతినిధులే రాజీనామా గురించి తడబడుతున్నారు.. అవసరమయితే.. రాజీనామా చేస్తామని అంటున్నారు కానీ.. రాజీనామాల ద్వారా స్టీల్ ప్లాంటు ప్రయివేటీకరణ ఆగబోదని అంటన్నారు. కానీ రాజీనామాల ట్రాప్ ఏంటో వారికి సులువుగానే అర్థం అవుతోంది.

    Also Read: ఊపులేని ఉక్కు ఉద్యమం..?

    వారు రాజీనామా చేస్తే.. స్పీకర్ తప్పనిసరిగా అనుమతించాల్సి ఉంటుంది. ఎందుకంటే.. ఒకే పార్టీ కాబట్టి.. ఆమోదించకుంటే.. డ్రామా ఆడుతున్నారని విమర్శలు వస్తాయి. అదే సమయంలో ప్రజల్లో సెంటిమెంటు పెరుగుతుంది. స్టీల్ ప్లాంటు విషయంలో కేంద్ర నిర్ణయాన్ని లేఖల ద్వారా తప్పా.. నేరుగా వ్యతిరేకించే పరిస్థితి లేదని వైసీపీని గంటా రాజీనామాలతో చిక్కుల్లో పడేశాని అనుకోవాలి.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్