Good Bye WFH: గత రెండేండ్లుగా ప్రపంచాన్ని కరోనా ఎంతలా వణికించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఈ కరోనా వచ్చిన తర్వాత ఐటీ కంపెనీలు మొత్తం వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేశాయి. రెండేండ్లుగా ఉద్యోగులు అందరూ ఇంటి దగ్గరి నుంచే పనిచేస్తున్నారు. కాగా మొదటి వేవ్ కంటే రెండో వేవ్ మరింత డేంజర్ కావడంతో… గతేడాది మొత్తం ఇంటి దగ్గరి నుంచే పనిచేశారు ఐటీ ఉద్యోగులు.

ఇంతలోనే డెల్టా వేరియంట్, ఒమిక్రాన్ రూపంలో ఇండియాలో థర్డ్ వేవ్ వచ్చింది. తెలంగాణలో కూడా భారీగానే కేసులు నమోదయ్యాయి. అయితే ఇప్పుడు ఈ థర్డ్ వేవ్ మీద తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం తెలంగాణలో థర్డ్ వేవ్ తగ్గిపోయిందని తెలిపారను. దీంతో అన్ని కంపెనీలు ఓపెన్ చేసుకోవచ్చని, వర్క్ ఫ్రమ్ హోమ్‌కు స్వస్తి చెప్పాలని కోరారు. ఈ ప్రకటనలో ఐటీ కంపెనీలు అన్నీ వర్క్ ఫ్రమ్ ఎత్తేయాలనే ఆలోచన చేస్తున్నాయంట.

Also Read: జగన్ సర్కార్ కు ఫిర్యాదుల టెన్షన్.. సీన్ రివర్స్ అయ్యిందే..!
ఈ నెలాఖరులోగా కేసులు తగ్గిపోతాయని, పెద్దగా ఎఫెక్ట్ ఏమీ ఉండదని చెప్పడంతో.. ఐటీ కంపెనీలు అన్నీ మళ్లీ తెరుచుకోనున్నాయి. త్వరలోనే ఆఫీసులు ఓపెన్ కానున్నట్టు సమాచారం. ఈ నెలాఖరులోగా ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను ఆఫీసులకు పిలిచే ఛాన్స్ ఉంది. వాస్తవానికి ఈ ఏడాది మొదట్లోనే ఆఫీసులకు పిలవాల్సి ఉన్నా.. ఒమిక్రాన్ వేరియంట్ ఎఫెక్ట్ కారణంగా వాయిదా వేశాయి కంపెనీలు.
ఇక ఇప్పుడు తెలంగాణతో పాటు హైదరాబాద్ లో కూడా పెద్దగా కేసులు నమోదు కాకపోవడంతో తిరిగి ఆఫీసులు ఓపెన్ చేయాలని భావిస్తున్నాయంట ఐటీ కంపెనీలు. రాబోయే రెండు వారాల్లో మెల్లిమెల్లిగా అన్నీ తెరుచుకోనున్నట్టు తెలుస్తోంది. రెండేళ్లుగా వర్క్ ప్రమ్ హోమ్ వల్ల కొన్ని చిన్న, మధ్య తరగతి కంపెనీలు నష్టపోయాయి. అయితే ఇవన్నీ మళ్లీ స్టాఫ్ ను ఆఫీసులకు పిలిచే పనిలో పడ్డాయంట. కాగా ఇదే విషయం మీద సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు అయిన భరణి కె అరోల్ క్లారిటీ ఇచ్చారు. ఐటీ కంపెనీలు ఉద్యోగులకు మంచి సురక్షిత మైన ప్లేస్ లు అని చెప్పుకొచ్చారు.
Also Read: హిజాబ్ వివాదం వెనుక అసలు కారకులు ఎవరు?