OkTelugu Movie Time: మూవీ టైమ్ నుంచి ప్రజెంట్ టాలీవుడ్ అప్ డేట్స్ విషయానికి వస్తే… ఒకానొక సమయంలో తనకు విపరీతంగా ఆత్మహత్య ఆలోచనలు వచ్చేవని బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ వెల్లడించింది. ‘ప్రతి ఒక్కరి జీవితంలో 15-20 ఏళ్ల మధ్య వయస్సు చాలా కీలకం. మనమేంటో తెలుసుకోవడానికి ఆ సమయం బాగా ఉపయోగపడుతుంది. నేను ఆ దశలో ఉన్నప్పుడు ఆందోళన కలిగించే ఆలోచనలు వచ్చేవి. ట్రైన్‌లో వెళుతున్నప్పుడు అందులో నుంచి దూకినట్లు అనిపిస్తుండేది’ అని ఆమె చెప్పుకొచ్చింది.

అలాగే మరో అప్ డేట్ విషయానికి వస్తే.. మాలీవుడ్ బ్యూటీ సానియా అయ్యప్పన్‌కు సోషల్ మీడియాలో చేదు అనుభవం ఎదురైంది. ఆమె ఆరు బయట స్నానం చేస్తూ ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. దీనిపై స్పందించిన నెటిజన్లు.. ‘ఛీ ఛీ సిగ్గుందా? ఇలా స్నానం చేసే వీడియోలను బజారున వేస్తున్నావ్. నీలాంటి వారి వల్లే అబ్బాయిలు తప్పుదోవ పడుతున్నారు’ అని మండిపడుతున్నారు. దీనిపై స్పందించిన సానియా.. ‘సిగ్గంటే ఏమిటో నాకు తెలియదు’ అని కూల్‌గా బదులిచ్చింది.

ఇక మరో డేట్ ఏమిటంటే.. పలువురు బాలీవుడ్ హీరోయిన్లు తెలుగు హీరోలతో కలిసి నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తనకు ఎన్టీఆర్, అల్లు అర్జున్‌తో కలిసి నటించాలని ఉందని దీపికా పదుకొణె తెలిపింది. ఎన్టీఆర్ యాక్టింగ్, వ్యక్తిత్వం అంటే తనకెంతో ఇష్టమని చెప్పింది.

Also Read: రవితేజతో ఎక్స్ పీరియన్స్ బాగుంది – అనసూయ
అలాగే బన్నీతో కలిసి యాక్ట్ చేయాలనుందని మరో హీరోయిన్ ఆలియా భట్ తెలిపింది. అల్లు అర్జున్‌తో కలిసి ఎప్పుడు సినిమా చేస్తున్నావని ఇంట్లో వాళ్లు అడుగుతున్నారని పేర్కొంది.

Also Read: మెగాస్టార్.. మెగా అభిమానులు కూడా మిమ్మల్ని ఇష్టపడరు !