హైదరాబాద్ అతలాకుతలం.! జనజీవనం అస్తవ్యస్తం

భారీ వర్షాలతో హైదరాబాద్‌ అతలాకుతలమైంది. నగరంలోని దాదాపు అన్ని ప్రాంతాలు జలమయమయ్యాయి. రెండు రోజులపాటు ఎడతెరిపి లేకుండా వర్షం పడడంతో జనజీవనం స్తంభించింది. నగరంలో నగర పరిధిలోని ఉప్పల్‌, ఎల్బీనగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, హైటెక్‌ సిటీ గచ్చిబౌళి నుంచి హెచ్‌సీయూ వెళ్లే దారిలో భారీ వర్షపు నీరు చేరింది. దీంతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రాలేదు. కొన్ని చోట్ల పాత ఇళ్లు కూలడంతో మొత్తంగా 12 మంది మృతి చెందారు. Also Read: తెలంగాణలో అంత్యక్రియలకు ముందు […]

Written By: NARESH, Updated On : October 15, 2020 10:05 am
Follow us on

భారీ వర్షాలతో హైదరాబాద్‌ అతలాకుతలమైంది. నగరంలోని దాదాపు అన్ని ప్రాంతాలు జలమయమయ్యాయి. రెండు రోజులపాటు ఎడతెరిపి లేకుండా వర్షం పడడంతో జనజీవనం స్తంభించింది. నగరంలో నగర పరిధిలోని ఉప్పల్‌, ఎల్బీనగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, హైటెక్‌ సిటీ గచ్చిబౌళి నుంచి హెచ్‌సీయూ వెళ్లే దారిలో భారీ వర్షపు నీరు చేరింది. దీంతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రాలేదు. కొన్ని చోట్ల పాత ఇళ్లు కూలడంతో మొత్తంగా 12 మంది మృతి చెందారు.

Also Read: తెలంగాణలో అంత్యక్రియలకు ముందు మూలిగిన యువతి.. చివరకు..?

భారీ వర్షాలపై ప్రభుత్వం ముందుగానే గ్రహించి ప్రజలకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇస్తూ అప్రమత్తం చేసింది. అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచించింది.పిల్లలు, వృద్ధులను జాగ్రత్తగా చూసుకోవాలని తెలిపింది. పాత భవనాల్లో ఉన్నవారు తక్షణమే ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని తెలిపాంది. ఏదైనా అవసరం కోసం రాష్ట్రవ్యాప్తంగా హెల్ప్‌లైన్లను ఏర్పాటు చేశామని, ఫోన్‌లో సంప్రదించాలని ప్రభుత్వ అధికారులు తెలిపారు.

నగరం సమీపంలోని హైదరాబాద్‌, బెంగుళూరు-జాతీయ రహదారి రోడ్డు కోతకు గురైంది. గగన్‌పహాడ్‌ సమీపంలోని అప్పా చెరువు కట్ట తెగి జాతీయ రహదారిపై వరదనీరు చేరడంతో రహదారి ధ్వంసమైంది. ఈ ఘటనలో రహదారిపై వెళ్తున్న 20కు పైగా లారీలు కొట్టుకుపోయాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు ముగ్గురి మృతదేహాలను బయటకు తీశారు. వీరు మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లకు చెందినవారుగా గుర్తించారు. మరికొందరిని రక్షించి సురక్షిత ప్రాంతానికి తరలించారు.

హైదరాబాద్‌ మొత్తం నదిలా మారడంతో ప్రభుత్వం రాకపోకలను నిలిపివేసింది. ఉప్పల్‌ నల్లచెరువు పొంగిపొర్లడంతో వరంగల్‌ జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. శంషాబాద్‌ రోడ్డుపైకి అప్పా చెరువుకు వరద పోటెత్తడంతో పీవీనర్సింగారావు ఎక్స్‌ప్రెస్‌ హైవే మార్గాన్ని మూసివేశారు. మలక్‌పేట ఆర్‌యూబీ, దిల్‌సుఖ్‌నగర్‌ ప్రాంతాల్లో నీరు భారీగా రావడంతో ప్రత్యామ్నాయ మార్గాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఔటర్‌రింగ్‌రోడ్డు లోపన 2 వేలకు పైగా కాలనీలు వరదలో చిక్కుకున్నారు.

Also Read: సీఎం కేసీఆర్‌ మరో కీలక ప్రకటన..!

వరదలో చిక్కుకున్న హైదరాబాద్‌ను ఆదుకునేందుకు ఎన్‌డీఆర్‌ఎఫ్‌, జీహెచ్‌ఎంసీ బృందం సహాయక చర్యలు చేపట్టింది. పలు ప్రాంతాల్లో బోటు సహాయంతో వరదలో చిక్కుకున్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. హిమాయత్‌నగర్‌ ప్రాజెక్టు 15 టేల్లు తెరుచుకోవడంతో నగరపరిధిలోని చెరువుల నీరంతా మూసీ పరివాహక ప్రాంతాలకు చేరింది. ప్రస్తుతం వర్షం తగ్గింది. అయితే లోతట్టు ప్రాంతాలు ఇంకా నీటిలోనే ఉండడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.