
సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నారాయణఖేడ్ మండలంలో ఓ మహిళ దారుహత్యకు గురైంది. మండలంలోని అనంతసాగర్‌లో అణుశమ్మ అనే మహిళ తల నరికిన గుర్తు తెలియని వ్యక్తులు ఆమె తలను అక్కడే వదిలేసి వెళ్లారు. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇంత దారుణంగా హత్య జరగడంపై పలు కోణాల్లో విచారిస్తున్నారు. వివాహేతర సంబంధమా..? లేక ఇదర కారణాలు ఉంటాయా..? అని పలువురిని అడిగి తెలుసుకుంటున్నారు.