https://oktelugu.com/

హైదరాబాద్‌ కేంద్రంగా బీజేపీ కుట్ర.. కేటీఆర్‌‌ సంచలన వ్యాఖ్యలు

ఒక్క ఉప ఎన్నిక.. ఎన్నో రాజకీయాలు.. మరెన్నో మలుపులు.. ఎన్నో విమర్శలు.. మరెన్నో ప్రతి విమర్శలు.. ఎన్నో కుట్రలు.. మరెన్నో కుతంత్రాలు. గెలవడం కోసం ఎంతకైనా తెగించడం.. ఇదీ ప్రస్తుతం తెలంగాణలోని దుబ్బాక ఉప ఎన్నికలో జరుగుతున్న తీరు. ఇప్పటికే ఈ ఎన్నికల్లో అధికార టీఆర్‌‌ఎస్‌, బీజేపీలు ఇష్టం వచ్చినట్లుగా ఆరోపణలు చేసుకుంటున్నాయి. మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్ పోలింగ్‌కు మరో రెండు రోజుల గడువే ఉండడంతో మరింత కాక పుడుతున్నాయి అక్కడి […]

Written By:
  • NARESH
  • , Updated On : November 1, 2020 / 06:03 PM IST
    Follow us on


    ఒక్క ఉప ఎన్నిక.. ఎన్నో రాజకీయాలు.. మరెన్నో మలుపులు.. ఎన్నో విమర్శలు.. మరెన్నో ప్రతి విమర్శలు.. ఎన్నో కుట్రలు.. మరెన్నో కుతంత్రాలు. గెలవడం కోసం ఎంతకైనా తెగించడం.. ఇదీ ప్రస్తుతం తెలంగాణలోని దుబ్బాక ఉప ఎన్నికలో జరుగుతున్న తీరు. ఇప్పటికే ఈ ఎన్నికల్లో అధికార టీఆర్‌‌ఎస్‌, బీజేపీలు ఇష్టం వచ్చినట్లుగా ఆరోపణలు చేసుకుంటున్నాయి.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

    పోలింగ్‌కు మరో రెండు రోజుల గడువే ఉండడంతో మరింత కాక పుడుతున్నాయి అక్కడి రాజకీయాలు. హైదరాబాద్‌ వేదికగా కూడా నేతలు బలనిరూపణకు దిగుతున్నారు. బీజేపీ కుట్రలు చేస్తోందంటూ మంత్రి కేటీఆర్‌‌ మరోసారి ఫైర్‌‌ అయ్యారు. హైదరాబాద్‌ అడ్డాగా భారీ కుట్రకు ప్లాన్‌ చేసిందని ఆరోపిస్తున్నారు.

    Also Read: బీజేపీ ని లెక్కలతో కొట్టిన కేటీఆర్!

    ఈరోజు బీజేపీ ఆఫీస్ ముందు పార్టీ కార్యకర్తతో హైడ్రామా చేసిందని.. దీనికి కొనసాగింపుగా రేపు హైదరాబాద్‌లో బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనకు సిద్ధం అవుతోందని అన్నారు. రేపు లాఠీఛార్జి, లేదంటే ఫైరింగ్ జరిగేలా బీజేపీ ప్లాన్ చేస్తోందన్నారు. దుబ్బాకలో బీజేపీ ఎన్నో ఎత్తుగడలు, కుట్రలు చేసిందని ఆరోపించారు. మొదట డబ్బుల ప్రయోగం చేయగా ఇప్పటికే చాలా సార్లు డబ్బులు పట్టుబడ్డాయన్నారు.

    Also Read: జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు రెడీ!

    డబ్బుల డ్రామా ఫెయిల్ కావడంతో ఇక బీజేపీ వాళ్లపై దాడులు చేసినట్లుగా డ్రామాలకు తెర తీశారని.. బీజేపీ వాళ్ళ ఇండ్లలో సోదాలు జరిగిన నాడే, టీఆర్‌‌ఎస్ వాళ్ల ఇళ్లలోనూ జరిగాయని చెప్పుకొచ్చారు. దీంతో ఆ దాడుల డ్రామా కూడా విఫలమైందన్నారు. బీజేపీ సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తూ.. ఇష్టారాజ్యంగా టీఆర్‌‌ఎస్‌ పై దుష్ప్రచారం చేస్తోందని.. ఇక ఎల్లుండి ఎన్నిక ఉండగా చివరి కుట్రకు బీజేపీ పన్నాగం పన్నిందన్నారు. ఈ విషయాలన్ని బీజేపీలోని ఓ లీడర్ ద్వారానే తమకు లీకయినట్లు కేటీఆర్ వాపోయారు.