గతంలో ప్రతి శుక్రవారం రెండు మూడు సినిమా విడుదలతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమ కళకళలాడేది. వీకెండ్ వచ్చిందంటే థియేటర్లన్నీ కళకళలాడిపోయేవి. హిట్, ఫ్లాప్ సంబంధం లేకుండా ఏడాది వందల కోట్ల బిజినెస్ జరిగేది. నటీనటులు, దర్శకులు తీరిక లేకుండా కష్టపడేవారు. సంవత్సరానికి కనీసం పది పన్నెండు పెద్ద సినిమాలు వచ్చేవి. కానీ కోవిడ్ మహమ్మారి బెడదతో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. ఆరు నెలలపాటు షూటింగ్లు, థియేటర్లు మూతబడ్డాయి. ఫలితంగా సినీ, థియేటర రంగాన్ని నమ్ముకున్న వేలమంది కార్మికులకు పనిలేకుండా పోయింది.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్
ఎలాగోలా కష్టపడి ఆ ఆరు నెలల గడ్డు కాలాన్ని తప్పించుకుని ఇప్పుడిప్పుడే షూటింగ్లు మొదలవుతున్నాయి. అడపాదడపా కోవిద్ కేసులు వస్తున్నా చిత్ర బృందాలు తెగించి చిత్రీకరణ చేస్తున్నాయి. స్టార్ హీరోలు కూడ మెల్లగా బయటికొస్తున్నారు. త్వరలోనే థియేటర్లు తెరిచే ఆలోచనలో ఉన్నాయి యాజమాన్యాలు. కానీ రాబోయే రోజుల్లో మళ్ళీ కష్టాలు తప్పవనే వార్తలు వినిపిస్తున్నాయి. కరోనా సెకండ్ వేవ్ త్వరలోనే ఇండియాను తాకనుందని నిపుణులు, పరిశోధకులు చెబుతున్నారు. ఇంకా వ్యాక్సిన్ రాలేదు కాబట్టి మళ్ళీ లాక్ డౌనే ఏకైక పరిష్కారమని చెబుతున్నారు.
Also Read: సింగిల్ సిట్టింగ్లో పవన్ చేత ఓకే చెప్పించుకున్న దర్శకుడు
ఇప్పటికే కొన్ని దేశాల్లో సెకండ్ వేవ్ లాక్ డౌన్ మొదలైపోయింది. ఇప్పుడిప్పుడే దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. అవి గనుక మళ్ళీ పెరిగితే ఇక్కడ కూడ సెకండ్ వేవ్ మొదలైనట్టే. అప్పుడు గతంలో కంటే లాక్ డౌన్ మరింత కఠినంగా అమలవుతుంది. అదే జరిగితే ఇంకొన్ని నెలలు సినీ పరిశ్రమ మూతబడక తప్పదు. ఇదే నిర్మాతలను వేధిస్తోంది. ఇప్పుడిప్పుడే అప్పులు తెచ్చి షూటింగ్లు మొదలుపెడుతున్నామని, గత ఆరు నెలల్లోనే వడ్డీల బెడతతో దెబ్బతిన్నామని, ఇప్పుడు గనుక మళ్ళీ లాక్ డౌన్ పడితే ఇకపై కోలుకుంటామనే నమ్మకం కూడ లేదని వాపోతున్నారు.