https://oktelugu.com/

ట్రాఫిక్ లేని నగరంగా హైదరాబాద్.. సాధ్యమేనా?

హైదరాబాద్ మహానగరం. రోజురోజుకు విస్తరిస్తోంది. ట్రాఫిక్ సమస్య పెరిగిపోతోంది. ఎటు చూసిన జనం రద్దీతో నిత్యం బిజీగా ఉంటోంది. దీంతో ట్రాఫిక్ సమస్య తీర్చేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా రోడ్లపై జనాన్ని క్రమబద్దీకరించేందుకు ఫ్లై ఓవర్ బ్రిడ్జిలను నిర్మిస్తోంది. ఇప్పటికే సిటీలోని పలు ప్రాంతాలకు మోట్రో నడుపుతూ ట్రాఫిక్ నియంత్రణపై పట్టు సాధించారు. ఇంకా జనసమ్మర్థాన్ని తగ్గించేందుకు పలు మార్గాలు వెతుకుతున్నారు. ఈ నేపథ్యంలో ఫ్లై ఓవర్ బ్రిడ్జిల సంఖ్య కూడా పెరుగుతున్నాయి. దీంతో ట్రాఫిక్ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : July 6, 2021 2:02 pm
    Follow us on

    Balanagar flyoverహైదరాబాద్ మహానగరం. రోజురోజుకు విస్తరిస్తోంది. ట్రాఫిక్ సమస్య పెరిగిపోతోంది. ఎటు చూసిన జనం రద్దీతో నిత్యం బిజీగా ఉంటోంది. దీంతో ట్రాఫిక్ సమస్య తీర్చేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా రోడ్లపై జనాన్ని క్రమబద్దీకరించేందుకు ఫ్లై ఓవర్ బ్రిడ్జిలను నిర్మిస్తోంది. ఇప్పటికే సిటీలోని పలు ప్రాంతాలకు మోట్రో నడుపుతూ ట్రాఫిక్ నియంత్రణపై పట్టు సాధించారు. ఇంకా జనసమ్మర్థాన్ని తగ్గించేందుకు పలు మార్గాలు వెతుకుతున్నారు. ఈ నేపథ్యంలో ఫ్లై ఓవర్ బ్రిడ్జిల సంఖ్య కూడా పెరుగుతున్నాయి. దీంతో ట్రాఫిక్ సమస్య తీర్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది.

    హైదరాబాద్ లోని బాలానగర్ చౌరస్తా అత్యంత రద్దీగల ప్రాంతం. నగరం మధ్య ఉన్న ఇక్కడి నుంచే ఎక్కవ మంది ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు. దీంతో నిత్యం రద్దీ పెరుగుతోంది. దీన్ని గుర్తించిన ప్రభుత్వం ఇక్కడ ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని భావించారు. రాష్ర్ట ప్రభుత్వం ఎస్ఆర్డీపీ నిధులతో హెచ్ఎండీఏ పనులు ప్రారంభించి సుమారు నాలుగు సంవత్సరాల సమయంలో పూర్తి చేశారు. రూ.387 కోట్ల వ్యయంతో బ్రిడ్జిని ఆరు లేన్లలో పూర్తి చేశారు.

    బ్రిడ్జి ప్రారంభం అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ నగరంలో మొత్తం రూ.30 వేల కోట్లతో ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ ల నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. ఇందులో కూకల్ పల్లి నియోజకవర్గంలో వేయి కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరిగాయని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ర్టం ఏర్పాటు తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ ట్రాఫిక్ సమస్యను తీర్చేందుకు నడుం బిగించిందని స్పష్టం చేశారు. ఈ ఫ్లై ఓవర్ కు బాబూ జగ్జీవన్ రాం పేరు పెడుతున్నట్లు పేర్కొన్నారు.

    నగరంలో ప్యాట్నీ నుంచి తూంకుంట వరకు, మరోవైపు సుచిత్ర చౌరస్తా వరకు ఫ్లై ఓవర్ ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కేంద్ర రక్షణ శాఖ అనుమతులు ఇవ్వకపోవడంతో వాటి నిర్మాణాలు ఆగాయని చెప్పారు. కేంద్రం నుంచి అనుమతులు రాగానే పనులు ప్రారంభిస్తామని అన్నారు. కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు కృష్ణారావు, వివేకానంద్ గౌడ్, ఎమ్మెల్సీ నవీన్ రావు తదితరులు పాల్గొన్నారు.