https://oktelugu.com/

Kishan Reddy: 40ఏళ్లలో చూడలే.. హుజూరాబాద్ ప్రజలు చరిత్ర తిరగరాశారు: కిషన్ రెడ్డి

Kishan Reddy: దేశంలోనే హుజూరాబాద్ ఉప ఎన్నిక అత్యంత ఖరీదైనదని.. గత 40 ఏళ్లలో ఎన్నడూ చూడలేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్ ఎన్నికల్లో బి జె పి అత్యధిక మెజారిటీ తో విజయం సాధించిన నేపథ్యంలో లో కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ ‘‘హుజురాబాద్ ఎన్నికల్లో ఈటల రాజేందర్ 24వేల ఓట్ల ఆధిక్యంతో […]

Written By:
  • NARESH
  • , Updated On : November 2, 2021 / 10:36 PM IST

    kishan reddy

    Follow us on

    Kishan Reddy: దేశంలోనే హుజూరాబాద్ ఉప ఎన్నిక అత్యంత ఖరీదైనదని.. గత 40 ఏళ్లలో ఎన్నడూ చూడలేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్ ఎన్నికల్లో బి జె పి అత్యధిక మెజారిటీ తో విజయం సాధించిన నేపథ్యంలో లో కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు.

    Kishan-Reddy

    కిషన్ రెడ్డి మాట్లాడుతూ ‘‘హుజురాబాద్ ఎన్నికల్లో ఈటల రాజేందర్ 24వేల ఓట్ల ఆధిక్యంతో టిఆర్ఎస్ పై విజయం సాధించారు. ఈ ఎన్నికలు ముఖ్యమైనవి, విలువైనవి. ఈ ఎన్నికల గెలుపు హుజురాబాద్ ప్రజాలందరింది, వారికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు ’’ అని అన్నారు.

    భారతీయ జనతా పార్టీ విజయం హుజురాబాద్ ప్రజలకు చెందుతుందని కిషన్ రెడ్డి తెలిపారు. అన్ని రకాల ప్రలోభాలకు గురిచేసిన టి ఆర్ ఎస్ కి గుణపాఠం ఈటల రాజేందర్ గారిని గెలిపించి హుజురాబాద్ ప్రజలు బి జె పి యొక్క సత్తా ను నిరూపించి తెలంగాణ రాష్ట్రం లో హుజురాబాద్ ఎన్నికల పై సరికొత్త చరిత్ర సృష్టించారు.
    గత 40 ఏళ్ళ రాజకీయాల్లో ఇటువంటి ఎన్నికలు ఎక్కడ చూడలేదు

    హుజురాబాద్ ప్రజలకు డబ్బులు ఎరగా వేసినా , బెదిరింపులకు గురి చేసినా,ఈటల రాజేందర్ గారిని గెలిపించుకుంటాం అని ప్రజలు అన్నారని, ఒక సర్వే ప్రకారం 60 శాతం మహిళలు బి జె పి కె తమ ఓటు ను వేస్తామని, వారి అభిప్రాయం వ్యక్తం చేశారని కిషన్ రెడ్డి అన్నారు. టిఆర్ఎస్ పార్టీ రైతులు, బడుగు బలహీన వర్గాలు, వివిధ సామాజిక వర్గాలకు వివిధ పధకాలు ప్రకటించి వారిని ప్రలోభాలకు గురి చేసిన, హుజురాబాద్ ఎన్నికల్లో గెలుపు కోసం ఎపుడు లెన్నన్ని ప్రాజెక్టులను ఎన్నికల సమయం లో ప్రవేశపెట్టారు.

    అంబేద్కర్ కల్పించిన ఓటు హక్కు కి సరైన నిర్వచనాన్ని, సరైన నాయకుడిని ఎన్నుకొని హుజురాబాద్ ప్రజలు ఓటు యొక్క విలువని నిరూపించారని కిషన్ రెడ్డి అన్నారు. హుజురాబాద్ ఎన్నికల లో ప్రజలు మంచి నాయకుడిని , నైతిక విలువలు కలిగిన బి జె పి ని ఎన్నుకొని కుటుంబ పాలన కు చరమగీతం పలికారు. చివరిగా భారతీయ జనతా పార్టీ హుజురాబాద్ ప్రజలకు ఎంతో ఋణపడి ఉంటుందని కేంద్ర మంత్రి అన్నారు.