ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి స్వర్ణం.. అది కూడా అథ్లెటిక్స్‌లో!

2008 బీజింగ్ ఒలింపిక్స్లో అభినవ్ బింద్రా తొలిసారి వ్యక్తిగత స్వర్ణపతకం సాధించిన తర్వాత ఇప్పటివరకు భారతదేశం తరఫున ఒక్క క్రీడాకారుడు కూడా స్వర్ణం సాధించలేదు. ఇక అథ్లెటిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్ విషయానికి వస్తే మన వారు కనీసం క్వాలిఫయింగ్ కి కూడా వెళ్ళరు. ఆ తరువాత ఫైనల్ చేరితే గొప్ప. ఫైనల్స్ లో వెనుక స్థానాల నుండి పట్టికలో మన వారు ఎక్కడున్నారో చూసుకోవాల్సిన పరిస్థితి ఇన్నాళ్ళూ. అలాంటిది ఇండియన్ ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ […]

Written By: Navya, Updated On : August 7, 2021 6:03 pm
Follow us on

2008 బీజింగ్ ఒలింపిక్స్లో అభినవ్ బింద్రా తొలిసారి వ్యక్తిగత స్వర్ణపతకం సాధించిన తర్వాత ఇప్పటివరకు భారతదేశం తరఫున ఒక్క క్రీడాకారుడు కూడా స్వర్ణం సాధించలేదు. ఇక అథ్లెటిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్ విషయానికి వస్తే మన వారు కనీసం క్వాలిఫయింగ్ కి కూడా వెళ్ళరు. ఆ తరువాత ఫైనల్ చేరితే గొప్ప. ఫైనల్స్ లో వెనుక స్థానాల నుండి పట్టికలో మన వారు ఎక్కడున్నారో చూసుకోవాల్సిన పరిస్థితి ఇన్నాళ్ళూ.

అలాంటిది ఇండియన్ ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ నీరజ్ చోప్రా మాత్రం భారతదేశానికి అథ్లెటిక్స్ లో తొలి స్వర్ణ పతకం అందించాడు. మెన్స్ జావలిన్ త్రో ఈవెంట్ లో జావెలిన్ ని 87.58 మీటర్లు దూరం విసిరి నీరజ్ స్వర్ణపతకం సాధించాడు. చెక్ రిపబ్లిక్ కి చెందిన వడ్లేజ్ 86.67 మీటర్లు విసిరి రజితం సాధించగా… ఆ దేశానికి చెందిన వెసెలీ 85.44 మీటర్లు విసిరి కాంస్యం సాధించాడు.

నీరజ్ చోప్రా వేసిన విసిరిన 87.58 అతని కెరీర్ బెస్ట్ కూడా కాదు. 2021లో 88.07 మీటర్లు విసిరి జాతీయ రికార్డు సాధించిన నిరజ్ అంతకన్నా తక్కువ దూరం విసిరి ఒలింపిక్స్ రికార్డు సాధించాడు. ఇప్పటివరకూ ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెటిక్స్ లో భారత్ తరఫున ఎవరూ కనీసం కాంస్యం కూడా సాధించకలేపోతే నీరజ్ ఏకంగా స్వర్ణం సాధించడం విశేషం. దీంతో భారత్… లండన్ ఒలింపిక్స్లో తను సాధించిన ఆరు పతకాల రికార్డును చెరిపివేసింది. నీరజ్ ఇప్పుడు స్వర్ణం సాధించడంతో ఇప్పటివరకు భారత క్రీడాకారులు అంతా కలిసి ఏడు పతకాలు కొల్లగొట్టారు. లండన్ రికార్డుని తుడిచిపెట్టారు.