హుజూరాబాద్: బీజేపీకి బిగ్ షాక్ ఇచ్చిన మాజీ మంత్రి

హుజూరాబాద్ ఉప ఎన్నికకు ముందు బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీలో కొనసాగుతున్న మాజీ మంత్రి పెద్ద రెడ్డి బీజేపీకి రాజీనామా చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన ఈయన ఈటల రాజేందర్ ను చేర్చుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. తన మాట పెడచెవిన పెట్టినందుకు ఇప్పుడు బీజేపీకి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో కొనసాగేందుకు మనసు అంగీకరించడం లేదని అందులో వివరించారు. మారిన రాజకీయాల దృష్ట్యా పార్టీలో కొనసాగలేనని లేఖలో స్పష్టం చేశారు. మాజీ మంత్రి […]

Written By: NARESH, Updated On : July 27, 2021 10:27 am
Follow us on

హుజూరాబాద్ ఉప ఎన్నికకు ముందు బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీలో కొనసాగుతున్న మాజీ మంత్రి పెద్ద రెడ్డి బీజేపీకి రాజీనామా చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన ఈయన ఈటల రాజేందర్ ను చేర్చుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. తన మాట పెడచెవిన పెట్టినందుకు ఇప్పుడు బీజేపీకి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో కొనసాగేందుకు మనసు అంగీకరించడం లేదని అందులో వివరించారు. మారిన రాజకీయాల దృష్ట్యా పార్టీలో కొనసాగలేనని లేఖలో స్పష్టం చేశారు.

మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను బీజేపీలో చేర్చుకోవడాన్ని మొదటి నుంచి పెద్దరెడ్డి వ్యతిరేకిస్తున్నారు. అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు. ఈటల రాకతో తనకు భవిష్యత్తులోనూ బీజేపీ తరుఫున హుజూరాబాద్ నుంచి పోటీచేసే అవకాశం రాకపోవచ్చని పెద్ది రెడ్డి భావిస్తున్నారు. కమలం పార్టీకి గుడ్ బై చెబుతారనే ప్రచారం జరిగింది.

ఇన్నాళ్లు బీజేపీ నేతలు పెద్దిరెడ్డిని బుజ్జగించి పార్టీలోనే కొనసాగేలా ప్రయత్నం చేశారు. అయితే పెద్దిరెడ్డి మాత్రం తనకు పోటీగా ఈటలను తీసుకురావడాన్ని మాత్రం ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలో తాజాగా బీజేపీకి గుడ్ బై చెప్పారు.

హుజూరాబాద్ నియోజకవర్గంలో గతంలో పెద్దిరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా కూడా చేశారు. టీడీపీ నుంచి బీజేపీలో చేరారు. ఇప్పుడు బీజేపీకి రాజీనామా చేయడం ఆ పార్టీకి మైనస్ గా మారే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది.