Homeజాతీయ వార్తలుBengaluru: సలసల కాగే నూనె పోసి.. భార్య, కూతురిపై భర్త అమానుషం..

Bengaluru: సలసల కాగే నూనె పోసి.. భార్య, కూతురిపై భర్త అమానుషం..

Bengaluru: ఇటీవల కాలంలో విడాకులు కేసులు బాగా పెరిగిపోతున్నాయి. ఇందుకు ప్రధానమైన కారణం భార్యా భార్తల మధ్య నమ్మకం ఉండటం లేదని తెలుస్తోంది. ఇకపోతే భార్యా భర్తల మధ్య ఒక్కసారి అనుమానం వచ్చినట్లయితే అది ఒకరిపై మరొకరికి అపనమ్మకంగా మారిపోతుంది. అలా వారి కాపురంలో కలతలు ఏర్పడుతాయి కూడా. చివరికి ఊహించనంత నష్టం జరుగుతుంది. ఈ కోవకు చెందిన ఘటన ఒకటి తాజాగా జరిగింది. వివరాల్లోకెళితే..

Bengaluru
Bengaluru

కర్నాటక స్టేట్‌లోని బెంగళూరుకు దగ్గరలోని కోరమంగళ ప్రాంతానికి సమీపంలోని ఎల్‌ఆర్ నగర్‌కు చెందిన ఆంటోనియమ్మ(35)- థామస్ భార్యాభర్తలు. థామస్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తుండగా, భార్య గృహిణి. వీరికి 13 ఏళ్ల వయసున్న కూతురు ఉంది. ఇలా చక్కగా సాగుతున్న వీరి కాపురాన్ని అనుమానం చెడగొట్టేసింది. తన భార్య ఎవరితోనో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానం భర్తకు వచ్చింది. ఆ అనుమానంతోనే భార్యను భర్త వేధించడం స్టార్ట్ చేశాడు.

Also Read: కేసీఆర్ ను టార్గెట్ చేస్తున్న జగన్ టీం

ఈ క్రమంలోనే థామస్ మద్యపానానికి బానిస అయ్యాడు. ప్రతీ రోజు ఫూటుగా మద్యం తాగి వచ్చి భార్యను చిత్ర హింసలు పెట్టడం స్టార్ట్ చేశాడు. కూతురిని కనీస మాత్రంగానైనా దగ్గరకు తీసుకోకుండా ఇద్దరిని ఇబ్బందులు పెట్టడం షురూ చేశాడు. అమ్మను కొట్టొద్దని కూతురు తండ్రిని బతిమాలిడినప్పటికీ అవేవీ పట్టించుకోకుండా హింసలు పెట్టాడు. ఆటో డ్రైవింగ్ బంద్ చేసి ఇలా చిత్ర హింసలు చేయడమే పనిగా పెట్టుకున్నాడు థామస్. కూతురిని చూసి కూడా తండ్రి థామస్ ప్రవర్తనలో మార్పు రాలేదు. కాగా, థామస్ తో నే కలిసి మెలిసి ఉండాలని తన భార్య ఎంత కొట్టినప్పటికీ అలానే ఉండిపోయింది. కూతురి కోసం తన భర్తతో కలిసి ఉండాలని భార్య భావించింది. కానీ, తండ్రి ఈ విషయాలను అస్సలు పట్టించుకోలేదు.

అలా థామస్… తన భార్యపైన అనుమానం ఇంకా పెంచేసుకుని తాజాగా భార్యపైన అమానుషమైన పని చేశాడు. తన భార్యపైన, కూతురిపైన సల సల కాగుతున్న నూనె పోసి దారుణంగా ప్రవర్తించాడు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. స్థానికంగా ఈ విషయం చర్చనీయాంశమవుతున్నది. 13 ఏళ్ల కూతురిపైన తండ్రి ఇంతలా ప్రవర్తించడం దారుణమని అంటున్నారు. థామస్ తన భార్యపైన పెంచుకున్న అనుమానం ఇలా పెనుభూతంలా మారి తన కాపురాన్ని కూల్చిందని చెప్తున్నారు.

Also Read: పాలన అంటే కేజ్రీవాల్‌దే.. అప్పు లేని రాష్ట్రంగా ఢిల్లీ..!

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

1 COMMENT

  1. […] Tollywood Trends: టుడే వైరల్ అవుతున్న క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే… మాస్ మహారాజా రవితేజ హీరోగా వస్తున్న ‘ఖిలాడీ’ మూవీ నుంచి ఐదో సింగిల్ నేడు రిలీజ్ కానుంది. సాయంత్రం 5.04 గంటలకు ‘క్యాచ్ మీ’ అంటూ సాగే సాంగ్‌ విడుదల చేస్తామని చిత్రయూనిట్ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను ట్విటర్‌లో పోస్ట్ చేసింది. రమేశ్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈనెల 11న రిలీజ్ కానుంది. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular