బెడ్ రూంలో ప్రియుడిని భర్త ఫ్రెండ్స్ కిడ్నాప్.. ట్విస్ట్ ఇదే

అతడో దినపత్రికల ఏజెంట్. బాగా సంపాదించాడు. జల్సాలకు అలవాటు పడ్డాడు. అందమైన వారిని ఆకర్షించి తన మోజు తీర్చుకుని వదిలేస్తాడు. ఈ క్రమంలో ఓ లేడీని తగులుకున్నాడు. ఆమెతో సరదాలు తీర్చుకున్నాడు. ఆమె కూడా అతడిని రెచ్చగొట్టి మరీ తన వాంఛలు నెరవేర్చుకుంది. ఇద్దరు కొంతకాలం బాగానే గడిపారు. కానీ చివరికి ఆమె భర్తతో అతడికి దేహశుద్ధి చేయించింది. దీంతో అతడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇందులో ఆసక్తికర విషయాలు […]

Written By: Raghava Rao Gara, Updated On : August 4, 2021 6:48 pm
Follow us on

అతడో దినపత్రికల ఏజెంట్. బాగా సంపాదించాడు. జల్సాలకు అలవాటు పడ్డాడు. అందమైన వారిని ఆకర్షించి తన మోజు తీర్చుకుని వదిలేస్తాడు. ఈ క్రమంలో ఓ లేడీని తగులుకున్నాడు. ఆమెతో సరదాలు తీర్చుకున్నాడు. ఆమె కూడా అతడిని రెచ్చగొట్టి మరీ తన వాంఛలు నెరవేర్చుకుంది. ఇద్దరు కొంతకాలం బాగానే గడిపారు. కానీ చివరికి ఆమె భర్తతో అతడికి దేహశుద్ధి చేయించింది. దీంతో అతడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇందులో ఆసక్తికర విషయాలు వెలుుగ చూస్తున్నాయి.

చెన్నై సిటీలోని అవడి ప్రాంతంలోని శాస్త్రినాగర్ 7వ వీధిలో సెంథిల్ కుమార్ (39) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అతడు తెలుగు, తమిళ, ఆంగ్ల దినపత్రికల పేపర్ ఏజెంట్ గా పని చేస్తున్నాడు. ఇంకా పలు సైడ్ వ్యాపారాలు కూడా చేస్తుంటాడు. డబ్బులు బాగా సంపాదించాడు. దీంతో అతడికి ఉన్న ఉంగరాలు, బ్రాస్ లెట్లు, మెడలో బంగారు గొలుసులు వేసుకుని కారులో షికారు చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో ఐదు నెలల క్రితం చెన్నైలోని ఎగ్మోర్ లోని ఓ నైట్ క్లబ్ కు వెళ్లాడు. ఆ సమయంలో అతడికి అర్చన (24) అనే మహిళతో పరిచయం ఏర్పడింది.

ఇద్దరు పరస్పరం ఫోన్ నంబర్లు తీసుకున్నారు. కొన్నాళ్లు ఫోన్లలోనే సంభాషణలు చేసుకున్నారు. అయితే కత్తిలా ఉండే అర్చనపై అతడికి మనసు పడింది. ఇంకేముంది ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది. అర్చనకు ముందే వివాహం జరిగినా ఇద్దరు మంచిగా ఎంజాయ్ చేసేవారు. అతడిని రెచ్చగొట్టే మాటలతో అర్చన ఉడికించేది. ఈ క్రమంలో జులై 26న తమ ఇంటికి రావాల్సిందిగా సూచించింది. తన భర్త లేడని చెప్పింది. దీంతో అతడు అర్చన ఇంటికి చేరుకుని మంచి రొమాన్స్ లో ఉన్న సమయంలో అర్చన భర్త అతడి స్నేహితులు వచ్చి సెంథిల్ కుమార్ కు దేహశుద్ధి చేశారు అతడి వద్ద ఉన్న బంగారు ఉంగరాలు, రెండు చైన్లు, బ్రాస్ లెట్ లాక్కున్నారు. అతడి మొబైల్ ద్వారా గూగుల్ పేతో రూ.13 వేలు డబ్బులు ట్రాన్స్ ఫర్ చేసుకున్నారు. తరువాత మళ్లీ చితకబాదారు.

సెంథిల్ కుమార్ కళ్లకు గంతలు కట్టి అతడి కారులోనే కిడ్నాప్ చేసి మధురై బైపాస్ రోడ్డుకు తీసుకుని వెళ్లారు. అక్కడ అతడికి ఇంకోసారి తన భార్యతో కనిపిస్తే చంపేస్తామని బెదిరించి వెళ్లిపోయారు. దీంతో అతడు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. దీంతో వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై గోపినాథ్ చెప్పారు. అర్చన ఇంటికి వెళ్లిన పేపర్ బాయ్ ను నిలువుదోపిడీ చేసిన అజిత్, శరవణన్ లను అరెస్టు చేశారు. అర్చన, ఆమెభర్త కోసం పోలీసులు గాలిస్తున్నారు.