Homeఎంటర్టైన్మెంట్టీజర్ టాక్ : ఆకట్టుకున్న 'ఇందు' రొమాన్స్ !

టీజర్ టాక్ : ఆకట్టుకున్న ‘ఇందు’ రొమాన్స్ !

Varun Sandesh Induvadana‘ఇందువదన’ అనే టైటిల్ తో ఫేడ్ అవుట్ హీరో ‘వరుణ్ సందేశ్’ ఓ సినిమా చేస్తున్నాడు అనగానే ముందు ఎవరు పట్టించుకోలేదు ఈ సినిమాని. కానీ ఈ సినిమా పోస్టర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడంతో ఈ సినిమా పై ఆసక్తి పెరిగింది. కాగా తాజాగా ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. క్లాసిక్ ఫీల్ తో సాగే లవ్ డ్రామాగా సినిమా టీజర్ సాగింది.

టీజర్ లో లవ్, రొమాన్స్ బాగా ఎలివేట్ అయ్యాయి. అలాగే ఇదొక పీరియాడిక్ నేపథ్యంలో సాగే సినిమా అని.. అలాగే హర్రర్ తో వచ్చే సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్ కూడా టీజర్ లో బాగా ఆకట్టుకున్నాయి. ఇక వరుణ్ సందేశ్ డిఫెరెంట్ గెటప్ బాగుంది. ముఖ్యంగా అటవీ నేపథ్యంలో సాగే ఎమోషనల్ లవ్ స్టోరీగా ఈ సినిమా అంచనాలను రెట్టింపు చేసుకుంది.
టీజర్ లో వరుణ్ సందేశ్ తో పాటు హీరోయిన్ ఫెర్నాజ్ శెట్టి కూడా చాలా బాగా ఆకట్టుకుంది. వారిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా కుదిరింది. ఇక టీజర్ చివర్లో ఇచ్చిన ఊహించని ట్విస్ట్, హర్రర్ టచ్ తో కామెడీ ఎండింగ్ మొత్తానికి టీజర్ లో మ్యాటర్ ఉందనిపించింది. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. ఎంఎస్ఆర్ ఈ చిత్రానికి దర్శకుడు.

కొత్త దర్శకుడు అయినా ‘ఎంఎస్ఆర్’ సినిమాని చాలా బాగా హ్యాండిల్ చేశాడు. అతని టేకింగ్ అండ్ అతని విజువల్ సెన్స్ చాలా బాగున్నాయి. త్వరలోనే ఈ చిత్రం రిలీజ్ కు రెడీ అవుతోంది. అన్నట్టు ఈ సినిమాకు శివ కాకాని సంగీతం సమకూరుస్తున్నారు. శ్రీ బాలాజీ పిక్చర్స్ బ్యానర్‌ పై ఎంఎస్ఆర్ దర్శకత్వంలో మాధవి ఆదుర్తి ఈ ‘ఇందువదన’ను యూత్ ను టార్గెట్ చేస్తూ నిర్మిస్తోంది.

YouTube video player

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Exit mobile version