త్వరపడండి: రూపాయికే పెట్రోల్!

రాజులు రాజ్యాలు పోయినా ఆ రాజసం మాత్రం ఇంకా కంటిన్యూ అవుతోంది. మహారాష్ట్రలో తిరుగులేకుండా ప్రభుత్వాన్ని నడుపుతున్న శివసేన భావి వారుసుడి పుట్టినరోజు సందర్భంగా మోడీ సర్కార్ కు కాస్త జలక్ ఇస్తూ.. ప్రజలకు ఊరటనిస్తూ శివసేన శ్రేణులు ఆశ్చర్యకర నిర్ణయం తీసుకున్నాయి. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే కుమారుడు, మంత్రి ఆదిత్యా ఠాక్రే పుట్టినరోజు సందర్భంగా ఆదివారం రూపాయికే లీటర్ పెట్రోల్ కార్యక్రమం చేపట్టింది. శివసేనకు చెందిన డోంబివలీ యువసేన ఈ వినూత్న నిరసన /అభిమానాన్ని […]

Written By: NARESH, Updated On : June 14, 2021 12:14 pm
Follow us on

రాజులు రాజ్యాలు పోయినా ఆ రాజసం మాత్రం ఇంకా కంటిన్యూ అవుతోంది. మహారాష్ట్రలో తిరుగులేకుండా ప్రభుత్వాన్ని నడుపుతున్న శివసేన భావి వారుసుడి పుట్టినరోజు సందర్భంగా మోడీ సర్కార్ కు కాస్త జలక్ ఇస్తూ.. ప్రజలకు ఊరటనిస్తూ శివసేన శ్రేణులు ఆశ్చర్యకర నిర్ణయం తీసుకున్నాయి.

మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే కుమారుడు, మంత్రి ఆదిత్యా ఠాక్రే పుట్టినరోజు సందర్భంగా ఆదివారం రూపాయికే లీటర్ పెట్రోల్ కార్యక్రమం చేపట్టింది. శివసేనకు చెందిన డోంబివలీ యువసేన ఈ వినూత్న నిరసన /అభిమానాన్ని చాటుకుంది.

ఠాణేలోని ఓ పెట్రోల్ బంకులో మంత్రి ఆధిత్యాఠాక్రే పుట్టినరోజు సందర్భంగా ఓ బంకులో రూపాయికే లీటర్ పెట్రోల్ అనగానే జనాలు ఎగబడ్డారు. బారులు తీరారు. బంకు ముందు కిలోమీటర్ల మేర క్యూలైన్లు కనిపించాయి.

ఇక ఠాణేలోనే కాదు.. మహారాష్ట్రలోనే అంబర్ నాత్ వింకో నకాలోని ఓ పెట్రోల్ బంకులో లీటర్ పెట్రోల్ రూ.50కే లీటర్ పెట్రోల్ ను అందించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట మధ్య వచ్చిన వారికి ఈ సదుపాయం కల్పించారు.

దేశంలో పెట్రోల్ ధరలు పెరుగుతున్న దృష్ట్యా కేంద్రంలోని మోడీ సర్కార్ కు జలక్ ఇవ్వడంతోపాటు ఆదిత్యాఠాక్రే బర్త్ డేను గుర్తుంచుకునేలా శివసేన ఈ ప్లాన్ చేసింది.