టీఆర్ఎస్ లో మరో మంత్రిపై వేటు?

టీఆర్ఎస్ లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పై వేటు పడింది. ఇప్పుడు మరో మంత్రి పై కత్తి వేలాడతుందని ప్రముఖ ఆంగ్ల పత్రిక కథనాలు రాసింది. దీంతో సదరు మంత్రిని తప్పించి అదే జిల్లాకు చెందిన మరొకరికి మంత్రి పదవి అప్పగించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. ఏదిఏమైనా టీఆర్ఎస్ లో సమూల మార్పులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. నల్గొండ జిల్లాకు చెందిన మంత్రి జగదీష్ రెడ్డి మొదటి నుంచి కేసీఆర్ కు […]

Written By: Srinivas, Updated On : June 8, 2021 5:16 pm
Follow us on

టీఆర్ఎస్ లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పై వేటు పడింది. ఇప్పుడు మరో మంత్రి పై కత్తి వేలాడతుందని ప్రముఖ ఆంగ్ల పత్రిక కథనాలు రాసింది. దీంతో సదరు మంత్రిని తప్పించి అదే జిల్లాకు చెందిన మరొకరికి మంత్రి పదవి అప్పగించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. ఏదిఏమైనా టీఆర్ఎస్ లో సమూల మార్పులు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

నల్గొండ జిల్లాకు చెందిన మంత్రి జగదీష్ రెడ్డి మొదటి నుంచి కేసీఆర్ కు అనుచరుడిగా ఉంటున్నారు. ఆయనకు ప్రభుత్వం ఏర్పడగానే మంత్రిపదవి దక్కింది.రెండో విడత ప్రభత్వంలోను ఆయనకు బెర్త్ ఖాయం అయింది. దీంతో కేసీఆర్ కు ఆయనకు బాగా సన్నిహిత్యం ఏర్పడింది. కొద్ది రోజుల క్రితం హంపీలో జగదీష్ రెడ్డి కుమారుడి జన్మదిన వేడుకలు నిర్వహించారు. వేడుకలకు జగదీష్ రెడ్డితో పాటు మరో నలుగురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అక్కడ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై చర్చ జరిగింది. కేసీఆర్ పై ఓ పాట పాడారు. అయితే జగదీష్ రెడ్డి మౌనంగా ఉండిపోయారు. దీంతో ఈ వ్యవహారం కేసీఆర్ దగ్గరకు చేరింది.

కేసీఆర్ మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం పెట్టుకున్నట్లు తెలుస్తోంది. జగదీష్ రెడ్డిని తప్పించి అదే జిల్లాకు చెందిన పల్లా రాజేశ్వర్ రెడ్డికి అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆంగ్ల పత్రిక కథనంపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఒక ట్వీట్ చేశారు. అందులో కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే మంత్రివర్గ విస్తరణలో జగదీష్ రెడ్డిపై వేటు తప్పదనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

గులాబీ పార్టీలోకి వలసలు తిరిగి మొదలయ్యాయి. అందులో భాగంగానే టీడీపీ అధ్యక్షుడు రమణ టీఆర్ఎస్ లో చేరతారని ప్రచారం జోరుగా సాగుతోంది. ఎవరు హద్దులు దాటినా వేటు తప్పదనే సంకేతాలు బాస్ నుంచి వస్తున్నాయి. ఎంత మంది పోయినా వచ్చే మంది లిస్టు బాగానే ఉంటుందని చెబుతున్నారు. కేబినెట్ లో మంత్రివర్గ విస్తరణ అంశంపైనే ఆసక్తికర చర్చలు కొనసాగుతున్నాయి.