విద్యార్థులకు చుక్కలు చూపించిన పోలీసులు!

జగ్గయ్యపేట సమీపంలోని గరికపాడు చెక్ పోస్టు దగ్గర పోలీసులు ఏపీ విద్యార్థులకు చుక్కలు చూపించారు. 21 రోజుల లాక్ డౌన్ నేపథ్యంలో జంటనగరాలలో ఇరుక్కుపోయిన వారిని, వారి వారి గ్రామాలకు పట్టణాలకు వెళ్లేందుకు నిన్న ఒక్కరోజు అనుమతి లభించడంతో విద్యార్థులు వందల సంఖ్యలో బయలుదేరారు. అయితే ఆంధ్రప్రదేశ్ లోకి విద్యార్థుల ఎంట్రీపై జగ్గయ్యపేట సమీపంలోని గరికపాడు చెక్ పోస్టు దగ్గర అర్ధరాత్రి హైడ్రామా నెలకొంది. హైదరాబాద్ లో హాస్టళ్లు, మెస్సులతో అన్నింటినీ మూసివేశారు. దీంతో నగరంలో ఏపీ […]

Written By: Neelambaram, Updated On : March 26, 2020 1:27 pm
Follow us on

జగ్గయ్యపేట సమీపంలోని గరికపాడు చెక్ పోస్టు దగ్గర పోలీసులు ఏపీ విద్యార్థులకు చుక్కలు చూపించారు. 21 రోజుల లాక్ డౌన్ నేపథ్యంలో జంటనగరాలలో ఇరుక్కుపోయిన వారిని, వారి వారి గ్రామాలకు పట్టణాలకు వెళ్లేందుకు నిన్న ఒక్కరోజు అనుమతి లభించడంతో విద్యార్థులు వందల సంఖ్యలో బయలుదేరారు. అయితే ఆంధ్రప్రదేశ్ లోకి విద్యార్థుల ఎంట్రీపై జగ్గయ్యపేట సమీపంలోని గరికపాడు చెక్ పోస్టు దగ్గర అర్ధరాత్రి హైడ్రామా నెలకొంది. హైదరాబాద్ లో హాస్టళ్లు, మెస్సులతో అన్నింటినీ మూసివేశారు. దీంతో నగరంలో ఏపీ విద్యార్థులు, యువతతోపాటు ఇతరులు ఏపీకు పయనం అయ్యారు. జగ్గయ్యపేట దగ్గర వారిని ఏపీలోకి రాకుండా పోలీసులు అడ్డుకున్నారు.

జంటనగరాల నుండి బయలుదేరే ముందే విద్యార్థులు పోలీసులను ఆశ్రయించారు. చెక్ పోస్టులు, టోల్ గేట్లలో ఆపకుండా వారికి నిరభ్యంతర పత్రాలను జారీ చేశారు. వాటిని పట్టుకొని వెళ్లిన విద్యార్థులను ఏపీ బార్డర్ జగ్గయ్యపేట సమీపంలోని గరికపాడు చెక్ పోస్టు వద్ద అందరినీ ఆపేశారు. రాత్రి వరకు వారిని ఏపీలోకి అనుమతించలేదు. దీంతో విద్యార్థులంతా పడిగాపులు గాశారు.

ఉదయం నుంచి తమ సమస్యపై స్పందించకపోవడంతో విద్యార్థులు..అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సమస్య ఏపీ మంత్రి బొత్స సత్యానారయణ దృష్టికి వెళ్లింది. వెంటనే బొత్స..తెలంగాణ మంత్రి కేటీఆర్ తో మాట్లాడారు. కేటీఆర్ తో చర్చించిన విషయాలను బొత్స…జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ఏపీ సీఎం జగన్ దృష్టికి సమస్య రావడంతో యుద్ధ ప్రాతిపదికన స్పందించారు. వెంటనే తెలంగాణ సీఎం కేసీఆర్ తో మాట్లాడారు. అనంతరం జగ్గయ్యపేట చేరుకున్న ఏపీ వారికి హెల్త్ ప్రోలో కాల్ పాటించి ఏపీలోకి అనుమతించాలని నిర్ణయించారు.

ఆంధ్రా, తెలంగాణ బార్డర్ లో చిక్కుకుపోయిన విద్యార్థులు, ఇతర ప్రయాణికుల సమస్య ఓ కొలిక్కి వచ్చింది. కొంతమంది క్వారంటైన్లకు వెళ్లిపోగా మరికొంతమంది హైదరాబాద్ కు తరిగివస్తున్నారు. దీంతో నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు జరిగిన హైడ్రామాకు తెర పడినట్లైంది. 7 గంటలకు పైగా గరికపాడు వద్ద విద్యార్థులు పడిగాపులు కాశారు. క్వారంటైన్ కు అంగీకరించిన వారికి మాత్రమే ఏపీలోకి అనుమతించారు.