జనసేన పార్టీ అధినేత మెగా బ్రదర్ పవన్ కళ్యాణ్ మరోసారి తన ఉదారత చాటుకున్నాడు. జాతికి విపత్తు వచ్చినపుడు ఎపుడూ ముందుండే ఈ మంచి మనిషి కరోనా బాధితులకు అండగా ఉండాలని తనకు తోచిన రీతిలో సాయం చేయ బోతున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాలలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపధ్యం లో పవన్ కళ్యాణ్ ముందుకొచ్చి ఆర్ధిక సాయం ప్రకటించాడు. తెలంగాణ , ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షల చొప్పున కోటి రూపాయలు విరాళం ప్రకటించాడు. తక్షణమే వాటిని ప్రభుత్వానికి అందజేసే దిశగా తనవంతు కృషి చేస్తున్నాడు.
జనసేన నేత పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ భారీ సాయం విషయం తెలుసుకొన్న అభిమానులు, సామాన్య జనం ఆయన్ని అభినందిస్తున్నారు. ఇక జనసైనికులు అయితే మా నాయకుడు చేసిన పనికి గర్వంగా ఉంది అని చెబుతున్నారు. గతంలో కూడా హుద్ హుద్ తూఫాన్ వంటి ప్రకృతి విపత్తులు వచ్చినపుడు కూడా ఇలాగే అందరికంటే ముందు పవన్ కళ్యాణ్ నిలిచాడని గుర్తు చేసుకొన్నారు.