ఉచిత విద్యుత్‌ పేరిట భారీ దోపిడీ.. లెక్కలన్నీ తీస్తం : బండి

కేంద్రం తీసుకొస్తున్న విద్యుత్‌ సవరణ చట్టాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌‌ ఆది నుంచీ విమర్శిస్తూనే ఉన్నారు. ఇటీవల అసెంబ్లీ సాక్షిగా మరోసారి విమర్శలు చేశారు. ఆ చట్టం అమల్లోకి వస్తే రాష్ట్రాలకు హక్కులు ఏమీ ఉండవని.. తాము ఇస్తున్న ఉచిత విద్యుత్‌ను కూడా వదులుకోవాల్సి వస్తుందంటూ చెప్పుకొచ్చారు.దీనిపై తాజాగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర చీఫ్‌ బండి సంజయ్‌ ఫైర్‌‌ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్‌ సవరణ చట్టంపై అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్‌‌ అబద్ధాలు చెబుతున్నారని […]

Written By: NARESH, Updated On : September 17, 2020 10:52 am
Follow us on


కేంద్రం తీసుకొస్తున్న విద్యుత్‌ సవరణ చట్టాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌‌ ఆది నుంచీ విమర్శిస్తూనే ఉన్నారు. ఇటీవల అసెంబ్లీ సాక్షిగా మరోసారి విమర్శలు చేశారు. ఆ చట్టం అమల్లోకి వస్తే రాష్ట్రాలకు హక్కులు ఏమీ ఉండవని.. తాము ఇస్తున్న ఉచిత విద్యుత్‌ను కూడా వదులుకోవాల్సి వస్తుందంటూ చెప్పుకొచ్చారు.దీనిపై తాజాగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర చీఫ్‌ బండి సంజయ్‌ ఫైర్‌‌ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్‌ సవరణ చట్టంపై అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్‌‌ అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు.

Also Read: అల్లు అర్జున్ పై పోలీసులకు ఫిర్యాదు

ముసాయిదాను అడ్డుపెట్టుకొని రాజకీయం చేశారని, ఉద్యోగులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు.సీఎం స్థాయిలో ఉండి ఇలాంటి అబద్ధాలు చెప్పడం సిగ్గుచేటని సంజయ్‌ ధ్వజమెత్తారు. కొత్త విద్యుత్తు చట్టంపై ఏపీ సీఎం జగన్‌కు లేని ఇబ్బంది కేసీఆర్‌కు ఎలా ఉంటుందో చెప్పాలన్నారు. దీనిపై అవగాహన లేకపోతే జగన్‌ను మరోసారి భోజనానికి పిలిచి చెప్పించుకోవాలని సూచించారు. కేంద్రం పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టక ముందే దానిని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం ఎలా చేశారో, కొత్త చట్టంతో ఉద్యోగాలు ఎలా పోతాయో చెప్పాలని అన్నారు.

ఉచిత విద్యుత్‌ పేరిట రాష్ట్రంలోనూ భారీ దోపిడీ జరుగుతోందని, కొత్త చట్టం వస్తేనే ఆ దోపిడీకి అడ్డుకట్ట పడుతుందనే కేసీఆర్ ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. టీఆర్‌‌ఎస్‌ ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన హామీలపై నిలదీస్తామని, ఈఆర్‌‌సీ ఏర్పాటుకు ముందు జరిగిన విద్యుత్‌ ఒప్పందాలపైనా విచారణ జరిపిస్తామని చెప్పారు. పాతబస్తీలో జరుగుతున్న విద్యుత్‌ చౌర్యంపై, రూ.లక్షల్లో ఉన్న బకాయిలపై సీఎం ఎందుకు స్పందించడం లేదని సంజయ్‌ ప్రశ్నించారు.

Also Read: కెసిఆర్ గారు, తెలంగాణా విమోచనదినం వద్దా?

ప్రధాని నరేంద్రమోడీ లేని భారత దేశాన్ని ఊహించుకోలేమని, దేశంలో ప్రస్తుతం అలాంటి పరిస్థితి నెలకొందని సంజయ్‌ అన్నారు. దేశ రక్షణ కోసం సంచలన నిర్ణయాలు రాబోతున్నాయన్నారు. ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్న సంజయ్‌ వర్చువల్‌ మీడియా ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మోడీ జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 70 కేంద్రాల్లో హోమం నిర్వహించిన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు బాషాతోపాటు జిల్లాల నాయకులను సంజయ్‌ అభినందించారు.