https://oktelugu.com/

TRS Pleanury: టీఆర్ఎస్ ప్లీనరీకి భారీ ఏర్పాట్లు.. అదిరిపోతుందట.?

TRS Pleanury: టీఆర్ఎస్ పార్టీ పండుగకు వేళైంది. హైదరాబాద్ లోని హైటెక్స్ లో టిఆర్ఎస్ పార్టీ ప్లీనరీ ఏర్పాట్లు భారీగా సాగుతున్నాయి. ఈ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు మాట్లాడారు. దశాబ్దాల తెలంగాణ కలను టిఆర్ఎస్ సాకారం చేసిందన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన ‘బోధించు సమీకరించు పోరాడు’ అన్న మాటల స్ఫూర్తితో ఉద్యమాలకు కొనసాగించామన్నారు. 14 ఏళ్ల పాటు తెలంగాణ ప్రజలను జాగృతం చేసి జాతీయ రాజకీయాలను శాసించే శక్తి […]

Written By: , Updated On : October 23, 2021 / 12:17 PM IST
trs-plenary-hyderabad-ktr

trs-plenary-hyderabad-ktr

Follow us on

TRS Pleanury: టీఆర్ఎస్ పార్టీ పండుగకు వేళైంది. హైదరాబాద్ లోని హైటెక్స్ లో టిఆర్ఎస్ పార్టీ ప్లీనరీ ఏర్పాట్లు భారీగా సాగుతున్నాయి. ఈ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు మాట్లాడారు. దశాబ్దాల తెలంగాణ కలను టిఆర్ఎస్ సాకారం చేసిందన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన ‘బోధించు సమీకరించు పోరాడు’ అన్న మాటల స్ఫూర్తితో ఉద్యమాలకు కొనసాగించామన్నారు. 14 ఏళ్ల పాటు తెలంగాణ ప్రజలను జాగృతం చేసి జాతీయ రాజకీయాలను శాసించే శక్తి గా తెలంగాణను తీర్చిదిద్దామన్నారు. పద్నాలుగేళ్ల ఉద్యమ ప్రస్థానంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్న…. తెలంగాణ పట్ల నిబద్ధతతో ఉద్యమిచామన్నారు. స్వరాష్ట్రాన్ని సాధించిన తరువాత అద్భుతమైన పరిపాలనతో పరిపాలన సంస్కరణల తో దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నామన్నారు.

trs-plenary-hyderabad-ktr

trs-plenary-hyderabad-ktr

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు పాలనకు దేశంలోని ఇతర రాష్ట్రాలతో పాటు పక్క రాష్ట్రంలో ఉన్న ప్రజాప్రతినిధులు సైతం తెలంగాణతో కలిసి పోవాలని డిమాండ్ చేస్తున్నారంటే… తెలంగాణ పాలన ఎంత అద్భుతంగా సాగుతుందో అర్థం చేసుకోవచ్చని కేటీఆర్ తెలిపారు. ఇంతటి అద్భుతమైన పరిపాలన సాగుతున్న నేపథ్యాన్ని పురస్కరించుకొని… 20 ఏళ్ల ద్విదశబ్ది సంబరాల నేపథ్యంలో హైదరాబాద్ లోని హైటెక్స్లో ప్లీనరీని పార్టీ నిర్వహిస్తోందన్నారు.

ఇప్పటికే వారం పది రోజులుగా మా పార్టీ సీనియర్ నాయకులు పార్టీ ప్లీనరీ ఏర్పాట్లు చేస్తున్నారు… ఇంత తక్కువ సమయంలో అద్భుతమైన ఏర్పాటు చేసిన పార్టీ నాయకులకు హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలను కేటీఆర్ తెలిపారు. ప్లీనరీకి సుమారు ఆరు వేలకు పైగా పార్టీ ప్రతినిధులు వస్తారని.. వీరందర్నీ పార్టీ రంగు గులాబి దుస్తులు ధరించి రావాలని కోరుతున్నానని సూచించారు.వీరందరికీ ఈరోజు సాయంత్రం నాటికి ఆహ్వాన పాసులు అందిస్తామన్నారు.

టీఆర్ఎస్ ప్లీనరీ పది గంటలకి ప్రారంభం అవుతుందన్నారు. నియోజకవర్గాల వారీగా.. జిల్లాల వారీగా రిజిస్ట్రేషన్లను పూర్తి చేసుకొని 10.45 గంటల వరకు ప్లీనరీ ప్రాంగణంలో ఆసీనులు కావాలన్నారు. 11 గంటలకు సభ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. 7 తీర్మానాలు పార్టీ ప్లీనరీ సమావేశంలో ప్రతిపాదిస్తామన్నారు. ఒంటి గంటకు భోజన బ్రేక్ ఉంటుందన్నారు. ఆ తర్వాత పార్టీ ప్లీనరీ తదుపరి సేషన్ ప్రారంభమవుతుందన్నారు.

తెలంగాణలోని సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రతినిధులు.. ఉదయమే తమ ప్రయాణాన్ని ప్రారంభించి సాధ్యమైనంత త్వరగా హైదరాబాద్ చేరుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా 50 ఎకరాల్లో పార్కింగ్ ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్లీనరీకి వచ్చే ఆహ్వానించిన ప్రతినిధులతో పాటు మంత్రులు ప్రజాప్రతినిధులకు వచ్చే సహాయకులు మరియు ప్లీనరీ ఏర్పాట్లు కోసం పనిచేసే పోలీస్, జిహెచ్ఎంసి వంటి ఇతర ప్రభుత్వ సిబ్బంది సైతం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది రాకుండా అన్ని రకాల ఏర్పాట్లను పార్టీ పూర్తి చేశామన్నారు. పార్టీ ప్లీనరీ ఏర్పాట్లకు సంబంధించి ఏర్పాటు చేసిన కమిటీలో ఉండి… ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న కష్టపడుతున్న ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి పార్టీ సీనియర్ నాయకులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు..

కాంగ్రెస్ బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా ఈటల రాజేందర్ హుజురాబాద్ లో పోటీ చేస్తున్నారని.. ఈ మాటను వారు కాదని చెప్తే..అందుకు సంబంధించిన సాక్ష్యాలను నేను బయట పెడతానని కేటీఆర్ సంచలన ప్రకటన చేశారు. గతంలో ఏ విధంగా అయితే కరీంనగర్ నిజామాబాద్ నాగార్జునసాగర్ ఎన్నికల్లో చీకటి ఒప్పందం తో పోటీ చేశాయో… అదేవిధంగా ఈరోజు హుజూరాబాద్ టిఆర్ఎస్ పార్టీ నిలువరించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.. కాంగ్రెస్ పార్టీ నాయకులు… మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి బిజెపికి ఓటు వేయమని ఎలా మాట్లాడుతారన్నారు. రేవంత్ రెడ్డి- ఈటెల రాజేందర్ లోపాయికారిగా ఎలా కలుస్తారన్నారు.

మాణిక్యం ఠాకూర్ 50 కోట్ల రూపాయలకు పిసిసి పదవిని అమ్ముకున్నారని సొంత పార్టీ నేతలే చేసిన విమర్శలపై ఇప్పటివరకు స్పందించలేదని… ఇప్పటిదాకా దానిపైన మాట్లాడలేదన్నారు. ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న వ్యక్తులకు కాంగ్రెస్ పార్టీ అగ్ర తాంబూలం ఇస్తుందని… కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన సీనియర్ నాయకులు పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ చెప్పారన్నారు. గాంధీభవన్ లో గాడ్సేలును దూరారన్నారు.

ఎన్నికల కమిషన్ సైతం తన రాజ్యాంగబద్ధమైన పరిధిని దాటి వ్యవహరిస్తున్నట్లు అనిపిస్తుందన్నారు. ఇప్పటికే ప్రారంభమైన దళిత బంధు పథకంను ఆపడం ఎంతవరకు సమంజసమో ఆలోచించుకోవాలన్నారు. ఇప్పుడు పక్క జిల్లాలకు ఎన్నికల కోడ్ అంటున్న ఎలక్షన్ కమిషన్ భవిష్యత్తులో పక్క రాష్ట్రాలకు సైతం విస్తరిస్తూ ఉందేమో అనిపిస్తుందని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు.