spot_img
Homeఅంతర్జాతీయంPawan Kalyan Janasena Party: జనసేనలో ఊపు.. మార్చ్ 14న ఆవిర్భావ సభకు భారీ...

Pawan Kalyan Janasena Party: జనసేనలో ఊపు.. మార్చ్ 14న ఆవిర్భావ సభకు భారీ ఏర్పాట్లు. ప్రత్యేకతలివీ

Pawan Kalyan Janasena Party: ప్ర‌స్తుతం ఏపీలో జ‌న‌సేన హ‌వా మొద‌లైన‌ట్టు కనిపిస్తోంది. ఇందుకు కార‌ణం మార్చి 14న ఆవిర్భావ స‌భ‌ను భారీ ఎత్తున నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే మీడియా మొత్తం అటు వైపుగా ప్ర‌యాణిస్తోంది. కాగా ఈ స‌భ కోసం ఏకంగా 12 క‌మిటీల‌ను నియ‌మించారు ప‌వ‌న్ కల్యాణ్‌. ఈ క‌మిటీలు అన్నీ కూడా స‌బ‌ను స‌క్సెస్ చేయ‌డంలో త‌మ పాత్ర‌ను నిర్వ‌హిస్తాయి.

Pawan Kalyan Janasena Party
Pawan Kalyan Janasena Party

కాగా ఈ క‌మిటీల్లో దాదాపు అంద‌రూ సీనియ‌ర్‌, కీల‌క నేత‌ల‌కు ప్రాధాన్యం క‌ల్పించారు జ‌న‌సేనాని. వీరంద‌రూ కూడా పార్టీకి ప్ర‌జ‌ల‌ను తీసుకు రావ‌డంతో పాటు స‌భ ఏర్పాట్ల‌ను ద‌గ్గ‌రుండి చూసుకుంటారు. కాగా ఈ స‌భ‌కు రాష్ట్రం న‌లుమూల‌ల నుంచి దాదాపు మూడు ల‌క్ష‌ల మంది హాజ‌ర‌వుతున్నట్టు తెలుస్తోంది.ఇక ఈ క‌మిటీల్లో జిల్లాల సమన్వయ కమిటీ. ఆహ్వాన క‌మిటీ, స‌భా ప్రాంగ‌ణ క‌మిటీ, భ‌ద్ర‌తా నిర్వ‌హ‌ణ క‌మిటీ, సాంస్కృతిక క‌మిటీ, భ‌ద్ర‌తా క‌మిటీ, క్యాట‌రింగ్ క‌మిటీ, ప‌బ్లిసిటీ క‌మిటీ లాంటివి ఉన్నాయి.

Also Read:  జనసేన ఆవిర్భావ సభపై నాదెండ్ల మనోహర్ సీరియస్ కామెంట్స్

ఈ క‌మిటీల్లో పంతం నానాజీ, విజ‌య కుమార్‌, ఉద‌య్ శ్రీనివాస్‌, సూర్య ప్ర‌కాశ్‌, ముత్తా శశిధర్, నేమూరి శంకర్ గౌడ్ లాంటి కీల‌క నేత‌లు ఉన్నారు. చేగొండి సూర్యప్రకాష్, సయ్యద్ జిలానీ లాంటి వారికి ఆహ్వాన క‌మిటీ బాధ్య‌త‌లు అప్ప‌గించారు ప‌వ‌న్‌. ఇలా ఒక్కో క‌మిటీలో కీల‌క నేత‌ల‌ను చేర్చి వారికి అన్ని ర‌కాల సూచ‌న‌లు అప్ప‌గించారు జ‌న‌సేనాని.

Pawan Kalyan Janasena Party
Janasena Chief Pawan Kalyan

అయితే ఈ క‌మిటీల్లో అన్ని వ‌ర్గాల వారికి ప్రాధాన్యత క‌ల్పించారు. ఈ వ‌ర్గం ఆ వ‌ర్గం అనే తేడాలు చూపించ‌కుండా.. అంద‌రికీ వారి అర్హ‌త‌ల‌ను బ‌ట్టి కీల‌క బాధ్య‌త‌లు ఇచ్చారు ప‌వ‌న్ క‌ల్యాణ్‌. అయితే మార్చి 14న నిర్వ‌హిస్తున్న స‌భ గ‌న‌క స‌క్సెస్ అయితే మాత్రం అది పార్టీకి మైలేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. త‌ద్వారా రానున్న రోజుల్లో పార్టీలోకి చేరిక‌లు జ‌రిగే అవ‌కాశం కూడా ఉంది అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. మ‌రి ప‌వ‌న్ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌డుతున్న ఈ కార్య‌క్ర‌మం ఏ మేర‌కు సక్సెస్ అవుతుందో వేచి చూడాలి.

Also Read: గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై అంటే కేసీఆర్ కు ఎందుకు కోపం?

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

Related News

Most Popular

INS Mahendragiri

INS Malvan : సైన్యం చేతికి మరో యుద్ధ నౌక… శత్రు సబ్‌మెరైన్లకు ఇక చుక్కలే!

INS Malvan భారత సైన్యం చేతికి మరో యుద్ధ నౌక చేరింది. ఇటీవలే విశాపట్నంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఒక నౌకను నేవీకి అప్పగించారు. తాజాగా భారత నేవీ తన సబ్‌మెరైన్‌ వ్యతిరేక...

Telangana ACB : కిలోల కొద్ది బంగారం.. అంతకుమించి నోట్ల కట్టలు.. ఈ అధికారి అవినీతిలో అనకొండ

Telangana ACB : రెండు కిలోల బంగారం.. 52 లక్షల నగదు.. మూడు కార్లు.. 30 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు.. 20 అత్యంత ఖరీదైన విదేశీ మద్యం సీసాలు.. అంతేకాదు ఆయన...
Harish Rao

Harish Rao : హరీష్ రావును ఎందుకు తొక్కేస్తున్నారు

Harish Rao : భారత రాష్ట్ర సమితిలో ఒకప్పుడు హరీష్ రావు నెంబర్ 2 గా ఉండేవారు. ఎప్పుడైతే కేటీఆర్ అమెరికా నుంచి వచ్చి.. గులాబీ పార్టీ కండువా కప్పుకున్నారో.. అప్పుడే పరిస్థితి...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద...

The Odyssey : క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన లేటెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఓవర్సీస్ మార్కెట్స్ లోనే కాదు , ఈ...
Akhil Akkineni

Akhil Akkineni : ‘లెనిన్’ 12 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ‘మా ఇంటి బంగారం’ ని అందుకోవడం...

Akhil Akkineni : అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా 12 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. మొదటి మూడ్ రోజుల్లోనే బ్రేక్...
Oktelugu Epaper