KCR National Party- AP: ఏపీలో రాజకీయ పార్టీలకు కొదువ లేదు. ప్రస్తుతం మాత్రం ఉనికిలో ఉన్నవి కొన్నే. అందులో ప్రభావిత రాజకీయాలు చేసేవాటినివేలుపెట్టి లెక్కించవచ్చు. తెలంగాణతో పోల్చుకుంటే మాత్రం మరీ తక్కువ. ప్రెజెంట్ వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాలు మాత్రమే యాక్టివ్ రాజకీయాలు చేస్తున్నాయి. అయితే ప్రధానంగా ఎన్నికల బరిలో నిలిచివేవి మాత్రం వైసీపీ, టీడీపీ, జనసేన. వీటితో పాటు ఇంతోకొంత బీజేపీ. రాష్ట్ర విభజన పుణ్యమా అని కాంగ్రెస్ పార్టీకి చావు దెబ్బ తగిలింది. విభజన జరిగి దాదాపు తొమ్మిదేళ్లు కావస్తున్నా కాంగ్రెస్ నిలబడలేదు. అయితే ఇటువంటి సమయంలో కేసీఆర్ జాతీయ పార్టీ పురుడుపోసుకోనుంది. దీంతో ఆ పార్టీ మనుగడ ఏపీలో ఎలా ఉండబోతున్నది అన్న దానిపై చర్చలు ప్రారంభమయ్యాయి. ఏపీలో అసలు కేసీఆర్ కొత్త పార్టీకి చాన్స్ ఉందా? ఉంటే ఎలా? ఏ పార్టీతో జతకట్టే అవకాశముంది? ఏ అజెండాతో పార్టీని విస్తరించే అవకాశముంది? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

విజయదశమి నాడు కేసీఆర్ కొత్త పార్టీని ప్రకటించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే ఆయన ఏపీ, మహారాష్ట్ర, కర్నాటకపై ఫోకస్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో కర్నాటక, మహారాష్ట్రలో చచ్చో చెడో పార్టీ ఉనికి చాటే ప్రయత్నం చేయోచ్చు కానీ.. ఏపీ విషయంలో మాత్రం కేసీఆర్ కు అంత ఈజీ కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఒకటి రాష్ట్ర విభజనకు కారకుడు కేసీఆర్ అని ఏపీ ప్రజలు భావిస్తున్నారు. రెండు సీమాంధ్రులు ద్రోహులు, దొంగలుగా అభివర్ణించడాన్ని గుర్తుచేస్తున్నారు. మూడు ఏపీ ప్రస్తుత పరిస్థితికి కేసీఆరే కారణమని అనుమానిస్తున్నారు. ఈ మూడు కారణాలు వల్ల ఏపీలో కేసీఆర్ కొత్త పార్టీ చొచ్చుకెళ్లే అవకాశమే లేదని విశ్లేషకులు చెబుతున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో యాక్డివ్ గా ఉన్న వైసీపీ, టీడీపీ. జనసేనలు కేంద్రంలోని బీజేపీతో స్నేహపూర్వకంగా మెలుగుతున్నాయి. ఇందులో జనసేన మిత్రపక్షంగా కొనసాగుతోంది. వైసీపీ రాజకీయంగా బీజేపీకి సహకారం అందిస్తుంది. తిరిగి తీసుకుంటోంది. ఇక టీడీపీ అయితే వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవాలని భావిస్తోంది. ఈ మూడు పార్టీలు బీజేపీ అనుకూల వైఖరితోనే ముందుకు సాగుతున్నాయి. అయితే ఇప్పటివరకూ మిత్రులుగా కొనసాగిన కేసీఆర్, జగన్ ల మధ్య వైరుధ్య పరిస్థితులు తలెత్తే అవకాశముంది. బీజేపీ అంటే ఇష్టం లేకున్నా తనపై ఉన్న కేసుల దృష్ట్యా తెగతెంపులు చేసుకోలేని పరిస్థితి. అటు బాహటంగా కేసీఆర్ తో స్నేహం కూడా చేయలేకపోతున్న స్థితిలో జగన్ ఉన్నారు.ఇక చంద్రబాబు గురించి చెప్పనక్కర్లేదు. ఆయన ఎట్టిపరిస్థితుల్లో కేసీఆర్ తో వెళ్లారు. అంత సీన్ కేసీఆర్ కు లేదని కూడా భావిస్తున్నారు. తనకు అచ్చి వొచ్చే బీజేపీ చేయి అందుకోవడానికే చంద్రబాబు ఇష్టపడుతున్నారు. అటు జనసేన ఈసారి కొత్తతరహా ప్రయోగాలకు అవకాశమిచ్చే పరిస్థితిలో లేదు. రాష్ట్రంలో ఓటు షేర్అధికంగా ఉండే టీడీపీ వైపే మొగ్గుచూపే అవకాశాలున్నాయి.

అయితే కేసీఆర్ కొత్త పార్టీకి వామపక్షాలు ఒక్కటే అనుకూలంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే మునుగోడు ఉప ఎన్నికల్లో వామపక్షాలు టీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో వామపక్షాలు, టీఆర్ఎస్ మధ్య సానుకూల వాతావరణం ఏర్పడింది. దీంతో వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో వామపక్షాలతో టీఆర్ఎస్ కలిసి నడిచే అవకాశముంది. ఇప్పటికే ఖమ్మం వంటి జిల్లాలో సైతం వామపక్షాలు ఓటమి చవిచూశాయి. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ సాయంతో కొన్ని సీట్లయినా తెచ్చుకోవచ్చన్న ఆలోచనతో ఉన్నాయి. అదే జరిగితే ఏపీలో కూడా వామపక్షాల తోకను పట్టుకొని గోదారిని ఈదాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వామపక్షాలు ఒక్కటే కేసీఆర్ కొత్త పార్టీతో కలిసే అవకాశముంది.
Also Read:Telangana- National Parties: వైయస్సార్ టిపి మినహా తెలంగాణలో అన్ని జాతీయ పార్టీలే
[…] […]