Sudigali Sudheer -Rashmi: బుల్లితెర యాంకర్లలో రష్మీ గౌతమ్ ఒకరు. వచ్చిరాని తెలుగుతోనే తెలుగు వ్యాఖ్యాతగా నిలుస్తోంది. పలు టీవీ షోల్లో యాంకర్ గా తన హవా కొనసాగిస్తోంది. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీకి హోస్ట్ గా వ్యవహరిస్తోంది. దీంతో రష్మీని ఆడేసుకుంటున్నారు. సుధీర్ తో ప్రేమాయణం టాక్ రావడంతో ఆమె కెరీరే దెబ్బతిన్నది. అటు సినిమా పరిశ్రమలోకి వెళ్లలేక ఇక్కడ పట్టు సాధించలేక చతికిలపడిపోతోంది. దీంతో రష్మీ కెరీర్ ప్రశ్నార్థకంగా మారుతోంది. మొదట సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి గుంటూరు టాకీస్ లో హీరోయిన్ చాన్స్ కొట్టేసినా అది ఆశించిన మేర హిట్ కాకపోవడంతో ఇక బుల్లితెరనే నమ్ముకుంది.

ఈనేపథ్యంలో రష్మీ అటు వెండితెరలో ఇమడలేక ఇటు బుల్లితెరలో ఆశించిన మేర పేరు రావడం లేదు. టాప్ యాంకర్ గా పేరు తెచ్చుకోవడం లేదు. దీంతో ఆమె కెరీర్ మనుగడ ముందుకు సాగడంపై అనేక సందేహాలు వస్తున్నాయి. అసలు రష్మీకి సుధీర్ తో ప్రేమాయణం ఉందనే సాకుతోనే చాలా మంది ఆమెకు అవకాశాలు ఇవ్వడం లేదని చెబుతున్నారు. రష్మీ సుధీర్ ను నమ్ముకుని తన భవిష్యత్ నే నాశనం చేసకుందని రష్మీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Balakrishna Meeting in Vijayawada: విజయవాడలో బాలక్రిష్ణ భారీ బహిరంగ సభ.. ఎందుకు పెడుతున్నాడబ్బ?
చిట్టిపొట్టి డ్రెస్సులతో అదరగొడుతోంది. ప్రేక్షకుల గుండెల్లో దడ పుట్టిస్తోంది. దీంతో యాంకర్ గా పుంజుకోవాలని చూస్తున్నా సుధీర్ తో ఉన్న లవ్ ట్రాక్ వార్తల నేపథ్యంలో ఆమె నెంబర్ వన్ వ్యాఖ్యాతగా నిలవడం లేదు. శ్రీముఖి ఇప్పటికే లక్షలాది అభిమానులను సంపాదించుకుంది. శ్రీదేవి డ్రామా కంపెనీకి యాంకర్ గా మొదట శ్రీముఖిని అనుకున్నారట. కానీ సుధీర్ సూచనతో ఆ అవకాశం రష్మీకి దక్కింది. రష్మీ కూడా మొదట నిరాకరించినా సుధీర్ ఒత్తిడి చేయడంతో ఒప్పుకుందట. దీంతో ఒప్పుకున్నా ఫలితం మాత్రం లేకుండా పోతోంది.

అన్ని విషయాల్లో నువ్వు సుధీర్ తో జతకట్టావనే సెటైర్లతో రష్మీకి తలకాయ ఎక్కడ పెట్టుకోవాలో తెలియడం లేదు. సుధీర్ తో ప్రేమాయణం ఉట్టిదే అయినా అందులో మసాలా వేసి నెటిజన్లు దాన్ని ప్రచారం చేశారు. దీంతో ప్రస్తుతం రష్మీకి అటు వెండితెర, ఇటు బుల్లితెరలు కూడా సరైన స్థానం ఇవ్వడం లేదనే తెలుస్తోంది. ఇక రష్మీ ముందున్న సవాలు ఏమిటి? శ్రీదేవి డ్రామా కంపెనీలో కొనసాగడమా? లేక సినిమా అవకాశాల కోసం ప్రయత్నించడమా అనేది తానే నిర్ణయించుకోవాలని అభిమానులు సూచిస్తున్నారు. సుధీర్ మాటలు విని రష్మీ ఎందుకు పనికి రాకుండా పోతుందనే వాదనలు సైతం వస్తున్నాయి.
[…] […]