
Brihadeshwara Temple : ఆ గుడిని చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎక్కడా సిమెంట్.. ప్లాస్టర్ ఆఫ్ పారీస్ అతుకు కనిపించదు. అద్భుతమైన శిల్పకళతో అలరారుతూ ఉంటుంది. దీనికి వెయ్యి ఏళ్ల చరిత్ర ఉంది. ఆరు భూకంపాలను తట్టుకుని నిలబడింది. అంతేకాదు దక్షిణభారతదేశంలోనే అత్యంత పురాతమైన శివాలయంగా పేరు పొందింది. ఇంతకీ ఆ గుడి ఏమిటి? ఎక్కడుంది? దాని చరిత్ర ఏమిటి? ఇంకెందుకు ఆలస్యం.. చదవండిక..
తమిళనాడు రాష్ట్రంలోని తంజావురు జిల్లాలోని కావేరి నది ఒడ్డును బృహదీశ్వర ఆలయం ఉంది. దీని నిర్మాణ శైలి ప్రకారం ఇది భారతదేశంలో తొలి గ్రానైట్ ఆలయంగా వినతికెక్కింది. క్రీస్తు శకం 1010లో చోళు మహారాజు రాజరాజ చోళుడు ఈ ఆలయాన్ని నిర్మించారని చరిత్ర చెబుతోంది. ఈ ఆలయాన్ని 1,30,000 టన్నుల గ్రానైట్ రాయితో నిర్మించారు. ఈ గ్రానైట్‌ను సుమారు 60 కిలోమీటర్ల దూరం నుంచి 3,000 ఏనుగుల మీద రవాణా చేశారు. దక్షిణభారత దేశంలో అత్యంత పురాతన శివాలయం ఇది. ఈ ఆలయ గోపురం 66 మీటర్ల ఎత్తు ఉంటుంది. దాని బరువు 80 టన్నులు. ఈ గోపురం నీడ ఎప్పుడూ నేల మీద పడదు. మధ్యాహ్న సమయంలో కూడా నీడ కన్పించదు. ఆలయ గోడలపై భరత నాట్య భంగిమలో 108 శిల్పాలు, 250 శివలింగాలు ఉన్నాయి. యునెస్కో పర్యాటక గుర్తింపు కూడా పొందింది.
ఈ గుడికి ఎటువంటి పునాది లేదంటే అతిశయోక్తి కాదు. గుడిని ఇంటర్‌లాక్ విధానంలో నిర్మించారు. పైగా అంటే ఒక శిలను మరొక శిలతో అనుసంధానించారు. అందువల్ల సిమెంట్, ప్లాస్టర్ ఆఫ్ పారీస్ అతుకులు కన్పించవు. ఈ గుడిలో గోపురం 216 అడుగులు ఉంటుంది. పైగా ఇది సున్నా డిగ్రీ వంపును కలిగి ఉంటుంది. ఆ కాలంలో ఇంత ఎత్తయిన గోపురం నిర్మించారంటే మాటలు కాదు. ఇక ఈ విధానంలో బిగ్ బెన్, పీసా వాల్ టవర్స్ నిర్మించారు. కానీ అవి వంగి ఉంటాయి.
మందిరం పై భాగంలో ఉన్న కుంభం 80 టన్నుల బరువు ఉంటుంది. ఈ 80 టన్నుల బరువున్న శిలను 200 అడుగుల టవర్ పైకి ఎలా చేర్చారు అనేది ఇప్పటికీ ఆశ్చర్యకరమే. దీని కోసం లెవిటేషన్ టెక్నాలజీ ఉపయోగించారని నిపుణులు చెబుతున్నారు. ఆరు కిలోమీటర్ల పొడవైన రాంప్‌లో రాతి ముక్కను ఉంచి దానిని ఏనుగులతో లాగించారని చరిత్ర చెబుతోంది.
ఈ మందిరం కింద అనేక భూగర్భ మార్గాలున్నాయి. వీటిలో చాలా వరకు మూసివేతకు గురయ్యాయి. వీటిని చోళులు తమ అంతర్గత భద్రత కోసం వాడేవారని తెలుస్తోంది. పైగా శత్రువులు దండెత్తినప్పుడు వీటిని తమ రక్షణ కోసం ఉపయోగించుకునేవారని చరిత్ర గ్రంథాలు చెబుతున్నాయి. ఈ ఆలయంలో అనేక ఆశ్చర్యకర నిర్మాణాలు ఉండటంతో చరిత్రకారులు అధ్యయనాలు చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ ఇది కొరుకుడు పడటం లేదు. పైగా రాజరాజచోళుడి దూరదృష్టికి ఈ ఆలయ నిర్మాణం మెచ్చుతునక అని కొనియాడుతుంటారు. ఇంతటి గొప్ప ఆలయం కనుకే యునెస్కో దీనిని ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చింది. ఈ ఆలయాన్ని సందర్శించేందుకు ఏటా వేలాది మంది పర్యాటకులు వస్తుంటారు. కావేరి నది ఒడ్డున ఉండటం ఈ ఆలయానికి మరింత ఆకర్షణ.
