
Money Shot : బ్లూ ఫిలిమ్స్… ఇప్పుడంటే అందరి చేతిలో నెట్ ఉంది. అపరిమితమైన డాటా ఉంది. ఏదైనా చూసుకోవచ్చు.. ఎంతసేపైనా చూడొచ్చు. ప్రభుత్వం నిషేధం విధించినా డార్క్ వెబ్ లోకి వెళ్లి విశ్వంఖలత్వాన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా కళ్లింతలు చేసుకుని చూడొచ్చు. కానీ ఒకప్పుడు పరిస్థితి ఇలా లేదు. చాలా సీక్రెట్ గా చూడాలి. చూస్తున్నంత సేపు భయం భయంగా ఉండాలి. అలాంటి రోజుల్లోనే ఒక పో** సైట్ ఏర్పాటు చేయడం అంటే మామూలు విషయం కాదు. అలా ప్రపంచానికి పరిచయమైంది, విపరీతమైన ఇంటర్నెట్ ట్రాఫిక్ ను క్రియేట్ చేసింది పో** హబ్. ఇప్పుడంటే లక్షలాది సైట్లు ఉన్నాయి కానీ.. ఒకప్పుడు పో** హబ్ మాత్రమే హవా కొనసాగించేది.
పో** హబ్.. ఈ సైట్ పేరు వినగానే అందరికీ అడల్ట్ మూవీస్, వీడియోల వైపు దృష్టి వెళ్తుంది. అమెరికాలో పుట్టిన పో** హబ్ అనేది వరల్డ్ వైడ్ పాపులర్ అడల్ట్ సైట్ గా ఎదిగింది. కానీ ఆ సైట్ ఒక్కసారిగా వివాదాస్పద ఆరోపణలను ఎదుర్కొన్నది. వందల కోట్ల డాలర్ల వ్యాపారాన్ని కోల్పోయింది.. ఒక వెలుగు వెలిగిన ఈ సైట్ ఎందుకు ఒకేసారి కిందకు పడిపోయింది.. దీనిపై నెట్ ప్లిక్స్ లో “మనీ షాట్ : దీ పో** హబ్ స్టోరీ” అనే సినిమా స్ట్రీమ్ అవుతోంది.. ఈ సినిమాలో అడల్ట్ కంటెంట్ ఉంటుంది అనుకుంటే పొరపాటే. ఇది కేవలం పో** హబ్ పతనానికి గల కారణాలను విశ్లేషించింది. నీలి చిత్రాల వెనుక అసలు మర్మాన్ని బయటపెట్టింది. కాకపోతే ఇది ఒక డాక్యుమెంటరీ ఫిలిం లాగా ఉంటుంది. దీనిని సుజానే హిల్లింగర్ అనే దర్శకుడు తీశాడు.
ఇక ఈ సినిమా విషయానికొస్తే పో** హబ్ ఎదుర్కొన్న వివాదాలను దర్శకుడు పరిచయం చేస్తూ పోతాడు. ఇందులో కొన్ని కొత్త విషయాలను టచ్ చేస్తాడు. పో** హబ్ ఎదుగుదల, మైనర్ సె** వీడియోలు పోస్ట్ చేయడం, రే* లాంటి వీడియోలను పెట్టి ఎలాంటి వ్యతిరేకతను చవి చూసిందో ప్రేక్షకులకు అర్థమయ్యేలాగా దర్శకుడు చెప్పగలిగాడు. పో** హబ్ సైట్ సక్సెస్, ఫెయిల్యూర్స్ కి కారణాలు కూడా చూపగలిగాడు.. ఈ సైట్ సక్సెస్ అయినప్పుడు దీని నిర్వాహకులు ఇంటర్నెట్ ట్రాఫిక్ పెంచుకునేందుకు ఆల్గా రిథమ్ లు,ఇన్ ఫ్లూయే న్సర్ లు, ఎస్ఈవో లను ఫాలో అయ్యారని దర్శకుడు చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఒకసారి క్రేజ్ వచ్చిన తర్వాత అడల్ట్ వీడియోస్ పోస్ట్ చేసుకునేందుకు వేదికగా ఉన్న పో** హబ్.. తర్వాత సొంతంగా స్టూడియోలు పెట్టి సినిమాలు తీయడం ప్రారంభించింది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ పో** హబ్ అసలు సమస్య ఇక్కడే మొదలైంది. పో** హబ్ సె** ట్రాఫికింగ్, రివెంజ్ పో** స్పై క్యామ్ వీడియోస్ లాంటి క్రిమినల్ కంటెంట్ పోస్ట్ చేస్తుందని 2020లో న్యూయార్క్ టైమ్స్ క్లేయిమ్ చేసింది. ఆ కవర్ స్టోరీ ని ఇందులో హైలెట్ చేశారు. అంతేకాదు ఈ సైట్ మూసేయాలని, దాని ఎగ్జిక్యూటివ్ లు జవాబుదారులుగా ఉంచాలని ట్రాఫికింగ్ హబ్ పిటిషన్ వేసిన ట్విస్ట్ బాగుంది. యాంటీ పో**గ్రఫీ , యాంటీ ట్రాఫికింగ్ హబ్ వ్యవస్థాపకురాలు లైలా నిఖిల్ వైట్, రచయిత నికోలాస్ క్రిస్టోఫ్ తమ కథనాలతో పో** హబ్ పై వ్యతిరేకతను పెంచారని ఈ సినిమాలో చూపించారు.. డాక్యుమెంటరీ సినిమా అయినప్పటికీ ప్రేక్షకులకు సినిమా ఫీల్ ఇచ్చేందుకు ఇలా ట్రై చేశారేమో.. పైగా ఈ సైట్ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు, అడల్ట్ నటీనటులు కూడా ఇబ్బంది పడ్డారని చెప్పారు. కానీ అప్పటికే మిగతా సైట్లు రావడంతో వారు అందులో నటించారు. ఈ విషయాన్ని దర్శకుడు మర్చిపోయినట్టు ఉన్నాడు.
ఈ సినిమాలో మరో హైలెట్ ఏంటంటే పో** హబ్ గురించి మాత్రమే కాకుండా జనరల్ గా పో** ఇండస్ట్రీలో ఏర్పడే సమస్యలను చాలా సహజంగా చూపించారు.. పో** హబ్ మూసివేత ఇష్యూ అయినప్పుడు, మాస్టర్ కార్డ్, వీసా లాంటి చెల్లింపు కంపెనీలు సైట్ నుంచి వైదొలిగాయని ఇందులో చూపించారు.. కానీ భారీ సె** ట్రాఫిక్ స్కాం ను ఇంటర్నెట్ ఇన్ జనరల్ సమస్యగా కాకుండా, పో** హబ్ సమస్యగా చూపించడం పెద్ద మైనస్ పాయింట్.. ఇక ఈ సినిమాలో రియల్ పో** స్టార్స్ జెన్ ఆడోరా, అసా అకిరా,సిరి డాల్ కనిపించారు. వారి అనుభవాలను షేర్ చేసుకున్నారు. మొత్తానికి డైరెక్టర్ హిల్లింగర్ కొన్ని పాయింట్లు బాగానే టచ్ చేసినప్పటికీ.. కీలకమైన వాటిని వదిలేసాడు. ఈ సినిమా ఇంగ్లీషులోనే కాకుండా హిందీలోనూ స్ట్రీమింగ్ అవుతోంది.