కరోనాతో ప్రజలకు సేవ చేసేదెలా?

కరోనాతో 2020లో కొన్నినెలల పాటు ఏ కార్యక్రమాలు చేపట్టలేకపోయారు.2021 లో సైతం అవే పరిస్థితులు దాపురించాయి. కరోనాతో నెలల సమయం వృథాగా పోతోంది. ఏ పనిచేయాలన్నా అడ్డంకిగా ఉంటోంది. అధికార పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు,ఎంపీల నుంచి నిర్వేదం వ్య్తక్తం అవుతోంది. అన్ని ఉన్నా జనం మధ్యకు వెళ్లలేని పరిస్థితి.ప్రణాళికు అమలు చేయడానికి కూడా వీలు లేకుండాపోతోందని వైసీపీ నేతలు పేర్కొంటున్నారు. గతేడాది మార్చిో లాక్ డౌన్ మొదలైంది. జూన్ వరకు కొనసాగింది. జూన్ నుంచి కేసుల సంఖ్య […]

Written By: Srinivas, Updated On : June 6, 2021 5:38 pm
Follow us on

కరోనాతో 2020లో కొన్నినెలల పాటు ఏ కార్యక్రమాలు చేపట్టలేకపోయారు.2021 లో సైతం అవే పరిస్థితులు దాపురించాయి. కరోనాతో నెలల సమయం వృథాగా పోతోంది. ఏ పనిచేయాలన్నా అడ్డంకిగా ఉంటోంది. అధికార పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు,ఎంపీల నుంచి నిర్వేదం వ్య్తక్తం అవుతోంది. అన్ని ఉన్నా జనం మధ్యకు వెళ్లలేని పరిస్థితి.ప్రణాళికు అమలు చేయడానికి కూడా వీలు లేకుండాపోతోందని వైసీపీ నేతలు పేర్కొంటున్నారు.

గతేడాది మార్చిో లాక్ డౌన్ మొదలైంది. జూన్ వరకు కొనసాగింది. జూన్ నుంచి కేసుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. సెప్టెంబర్,అక్టోబర్ నెలల వరకు పరిమితు మధ్య కార్యక్రమాలు చేపట్టాల్సి వచ్చింది.నవంబర్, డిసెంబర్ ఈ ఏడాది జనవరి నుంచి రాజకీయ కార్యకలాపాలు ఊపందుకోగా అంతలోనే సెకండ్ వేవ్ దూసుకొచ్చింది.

మరో రెండు నెలలు గడిచిపోయాయి. ఇంకా నెల రోజుల పాటు పరిమితులు ఉండడంతో మూడో వేవ్ ప్రభావం మొదలు కానుందంటున్నారు.ఇలాంటి పరిస్థితుల్లో నేతలు పని చేయాలని భావించినా కుదరడం లేదు. కరోనా వల్ల ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నట్లు చెబుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పల్లెలకు వెళ్లినా ప్రజల వద్దకు వెళ్లినా పెద్దగా పట్టించుకోరు. ముఖ్యమంత్రి జగన్ చేపడుతున్నసంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరడానికి ప్రజల్లోకి వెళ్లాల్సిందే. కానీ కరోనా ఆ పని చేయనీయకుండా చేసింది.

అధికారంలో ఉన్నప్పుడు ఇళ్లకు పరిమితం కావడం,పరిమితుల మధ్య కార్యక్రమాలు నిర్వహించాల్సి రావడం వల్ల వారిలో నిర్వేదం వ్యక్తం అవుతోంది. మంత్రుల హోదాలో ఉన్న వారి పరిస్థితి ఇదే. రెండున్నరేళ్ల పదవీకాలం ముగుస్తాయని మంత్రుకు జగన్ ముందే చెప్పారు. ఈ వ్యవధిలో చాలా నెలల పాటు కరోనా పరిస్థితులు ఉండడంతో వారు మరింతగా ఫీలవుతున్నట్లుగా ఉన్నారు.