https://oktelugu.com/

పెళ్ళికి ముందు పదేళ్లు ఆయనతోనే ప్రేమలో ఉన్నా – అనసూయ

హాట్ నెస్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ ఎప్పుడు హాట్ హాట్ గా కనిపించే అనసూయ భరద్వాజ్‌ పెళ్లికి ముందే దాదాపు పది సంవత్సరాల పాటు శశాంక్ భరద్వాజ్‌తో ప్రేమలో మునిగితేలిందట. పైగా శశాంక్ కోసం తన ఫ్యామిలీని ఎదురించి ఇంటి నుండి బయటకు వచ్చింది. అనసూయ రాకపోతే ఆశ్చర్యపోవాలి గానీ, వస్తే వింత ఏముంది అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నా.. అనసూయ మాత్రం తమది నిజమైన ప్రేమ అంటుంది. తన ఫ్యామిలీ నుండి వచ్చేశాక, […]

Written By:
  • admin
  • , Updated On : June 6, 2021 / 05:50 PM IST
    Follow us on

    హాట్ నెస్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ ఎప్పుడు హాట్ హాట్ గా కనిపించే అనసూయ భరద్వాజ్‌ పెళ్లికి ముందే దాదాపు పది సంవత్సరాల పాటు శశాంక్ భరద్వాజ్‌తో ప్రేమలో మునిగితేలిందట. పైగా శశాంక్ కోసం తన ఫ్యామిలీని ఎదురించి ఇంటి నుండి బయటకు వచ్చింది. అనసూయ రాకపోతే ఆశ్చర్యపోవాలి గానీ, వస్తే వింత ఏముంది అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నా.. అనసూయ మాత్రం తమది నిజమైన ప్రేమ అంటుంది.

    తన ఫ్యామిలీ నుండి వచ్చేశాక, అనసూయ ఉన్నత విద్యకు సంబంధించిన ఖర్చులన్నీ తన భర్త శశాంకే పెట్టుకున్నాడట. అలాగే తనను ఎంతో ప్రేమగా చూసుకున్నాడని, శశాంక్ ఎప్పుడూ తన సుఖాన్నే కోరుకుంటాడని అనసూయ స్వయంగా సగర్వంగా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సిగ్గుపడుతూ ముసిముసి నవ్వులతో వెల్లడించింది.

    అలాగే తన ప్రేమ తర్వాత పెళ్లి గురించి చెబుతూ.. శశాంక్‌ భరద్వాజ్‌ తో తానూ పదేళ్ల ప్రేమాయణం తర్వాత జూన్ 5వ తేదీన పెళ్లి చేసుకున్నానని చెప్పుకొచ్చింది. మొత్తానికి అనసూయ తన 11వ వివాహ వార్షికోత్సవం రోజున, ఇలా తన ప్రేమలోని మధుర జ్ణాపకాలను ప్రేక్షకులతో పంచుకుంది. ఈ సందర్భంగా ఓ పోస్ట్ పెడుతూ ‘మా క్రేజీ, స్టుపిడ్ ప్రేమకు ఇరవై ఏళ్లు నిండాయి. ఇక మా పెళ్లి బంధానికి 11 సంవత్సరాలు నిండాయి’ అని తాజాగా ఎమోషనల్‌ గా ఓ మెసేజ్ పెట్టింది.

    అలాగే అనసూయ తన భర్తతో తన అనుబంధం గురించి భావోద్వేగంతో చెబుతూ మేము ఒకరినొకరం బాధపెట్టుకొంటాం, కొన్ని ఇడియాటిక్ విషయాల పై ఒట్టు వేసుకొంటాం. అలాగే ఇక మా మధ్య బంధం ఉండదనేంతగా ఫైట్ చేసుకొంటాము. మళ్ళీ అంతలోనే అన్ని గొడవలు మరిచిపోయి ఎంతో ప్రేమగా, ఆప్యాయతగా ఉంటాం. ఎంతో ఇష్టాన్ని వ్యక్తికరించుకుంటాం అంటూ చాల విషయాలు చెప్పుకొచ్చింది అనసూయ.

    ఇక ఈ రోజు మా పెళ్లి రోజు, అయినా నేందుకు మా ఇద్దరి ఫోటో పెట్టడం లేదంటే.. ఈ రోజు మా ఆయన నేను గొడవ పడ్డాం. అందుకే, ఆయనను ఈ రోజు దూరంగా ఉంచాను. అందుకే ఇద్దరం కలిసి ఉన్న ఫోటో పెట్టడం లేదు అంటూ అనసూయ చెప్పుకొచ్చింది.