https://oktelugu.com/

రైతులకు శుభవార్త.. ఈ స్కీమ్ లో చేరితే నెలకు రూ. 3000 మీ సొంతం!

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ రైతు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కొత్త పథకాలను అమలు చేస్తూ రైతులకు మరింత ప్రయోజనం కల్పించాలని భావిస్తోంది. ఇప్పటికే మోదీ సర్కార్ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతులకు మూడు విడతల్లో 6,000 రూపాయలు జమ చేస్తున్న విషయం విదితమే. రైతుల కోసం కేంద్రం ఈ స్కీమ్ తో పాటు మరో అద్భుతమైన స్కీమ్ ను అమలు చేస్తోంది. ప్రధాన్ మంత్రి కిసాన్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 14, 2020 10:39 am
    Follow us on

    కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ రైతు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కొత్త పథకాలను అమలు చేస్తూ రైతులకు మరింత ప్రయోజనం కల్పించాలని భావిస్తోంది. ఇప్పటికే మోదీ సర్కార్ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతులకు మూడు విడతల్లో 6,000 రూపాయలు జమ చేస్తున్న విషయం విదితమే. రైతుల కోసం కేంద్రం ఈ స్కీమ్ తో పాటు మరో అద్భుతమైన స్కీమ్ ను అమలు చేస్తోంది.

    ప్రధాన్ మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన పేరుతో రైతులకు ఆర్థిక మద్ధతు అందించాలని కేంద్రం భావిస్తోంది. ఈ స్కీమ్ ద్వారా రైతులు ముందు నుంచి డబ్బులు చెల్లిస్తూ వస్తే నెలకు 3,000 రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి అర్హత సాధించిన రైతులు ప్రధాన్ మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన స్కీమ్ లో సులభంగా చేరవచ్చు. ఈ స్కీమ్ లో చేరిన వాళ్లు ప్రతి నెలా డబ్బులు చెల్లించకుండా బ్యాంక్ అకౌంట్ లో నగదు నిల్వ ఉంచితే సరిపోతుంది.

    ఈ స్కీమ్ కు అర్హులైన రైతుల ఖాతాలలో ఆటోమేటిక్ గా డబ్బులు డెబిట్ అవుతాయి. నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల చొప్పున చెల్లిస్తూ 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న రైతులు ఈ స్కీమ్ లో చేరవచ్చు. ఈ స్కీమ్ లో చేరే నాటికి రైతు యొక్క వయస్సును బట్టి చెల్లించాల్సిన డబ్బులలో మార్పులు ఉంటాయి. ఒక రకంగా ఇది పెన్షన్ స్కీమ్ అని చెప్పుకోవాలి.

    18 సంవత్సరాల వయస్సులో ఈ స్కీమ్ లో చేరితే 55 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. అయితే ఈ స్కీమ్ లో చేరడానికి కొన్ని నియమనిబంధనలు ఉన్నాయి. ఈఎస్‌ఐ, ఈపీఎఫ్‌వో స్కీమ్స్ ద్వారా ప్రయోజనాలు పొందే రైతులు ఈ స్కీమ్ కు అర్హులు కారు. 5 ఎకరాల లోపు పొలం ఉన్న రైతులు మాత్రమే ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనాలను పొందవచ్చు.