Also Read: బీజేపీ షాక్ తో వెనక్కు తగ్గిన జగన్ సర్కార్..?
రాష్ట్రపతి నియామకం నుంచి.. ఇటీవల వ్యవసాయ బిల్లు వరకు కూడా వైసీపీ కేంద్రానికి అనుకూలంగా ఓట్లు వేస్తూ వచ్చింది. వ్యవసాయ మీటర్ల వ్యవహారం తనకు, తన ఓటు బ్యాంకుకు విఘాతం కలిగిస్తుందని తెలిసి కూడా మోడీ నిర్ణయానికి జగన్ ఓకే చెప్పారు. దీంతో మోడీకి జగన్ చాలా దగ్గరయ్యారనేది అర్థమవుతోంది. జగన్‌ను వాడుకుని మోడీ ఒడ్డెక్కారు. అయితే, ఇప్పుడు జగన్‌కు మోడీ ఏమేరకు హెల్ప్ చేస్తారు ? ఏమేరకు ఆయనకు జై కొడతారు ? అనేది కీలకంగా మారింది.
ఇప్పుడు జగన్ వ్యవహారాలన్నీ కేంద్రంతోనే ముడిపడి ఉన్నాయి. రాష్ట్రంలో జగన్ ఏవిధంగా ముందుకు సాగాలన్నా మోడీ ఆశీస్సులు కావల్సిందే. ప్రత్యేక హోదా విషయాన్ని పక్కన పెట్టినా.. కనీసం.. మూడు రాజధానుల విషయానికి జైకొట్టాల్సిన అవసరం, శాసన మండలి రద్దుపై నిర్ణయం తీసుకోవడం, వెనుకబడిన జిల్లాలకు నిధులు.. పోలవరం ప్రాజెక్టు పూర్తికి సహకరించడం, జిల్లాల ఏర్పాటు, విభజన హామీలు, అంతకుమించి.. జగన్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం.. వంటివాటిని కూడా పరిష్కరించాల్సిన బాధ్యత మోడీపై ఉంది.
Also Read: మధ్యప్రదేశ్ రైతుల ఖాతాల్లోకి రూ.4 వేలు బదిలీ..
అందుకే జగన్ కూడా కేంద్రం తీసుకొస్తున్న ప్రతీ బిల్లుకు మద్దతు తెలుపుతున్నట్లు తెలుస్తోంది. మరి మున్ముందు జగన్‌కు మోడీ ఏ మేరకు సపోర్ట్‌గా నిలుస్తారు..? ఎలా సహకరిస్తారు..? అనేది రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది.