India Economy: ఎందరో మహానీయులు చేసిన కష్టానికి ఫలితంగా భారత్‌కు 1947లో స్వాతంత్ర్యం (Independence day) వచ్చింది. ఎన్నో ఏళ్ల పాటు ఇండియన్స్ (Indians) బానిస బతుకులు బతికారు. చిత్ర హింసలు చేస్తూ.. మన దగ్గర ఉన్న సొమ్మును బ్రిటీష్ (British) వారు దోచుకున్నారు. మసాలా, పత్తి ఇలా దేశంలో ఎన్నో విలువైన వాటిని వారు అక్కడికి ఎగుమతి చేసుకుని డబ్బులు సంపాదించేవారు. అయితే నేడు అమెరికా ప్రపంచంలోనే (World) అగ్రగామి ఆర్థిక వ్యవస్థగా ఉంది. వీటి తర్వాతి స్థానాల్లో చైనా, జపాన్, జర్మనీ ఉన్నాయి. ఇప్పుడు భారతదేశం ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా (Largest economy) వేగంగా అభివృద్ధి చెందుతోంది. అయితే బ్రిటీష్ వారు ఇండియాని దోచుకోకపోతే మన ఆర్థిక వ్యవస్థ ప్లేస్ మారే ఉండేది. బ్రిటీష్ వారు ఎన్నో ఏళ్లు మనల్ని దోచుకుంటేనే.. ఐదవ ఆర్థిక వ్యవస్థ ప్లేస్‌లో ఉన్నాం. అలాంటిది దోచుకోకపోతే ఏ ప్లేస్‌లో ఉండేవాళ్లమో మీరే ఆలోచించుకోండి. అసలు బ్రిటీష్ వారు ఇండియాను దోచుకోకపోతే మన దగ్గర ఉండాల్సిన డబ్బు ఎంతో ఈ స్టోరీలో చూద్దాం.
బ్రిటీష్ వారు భారతదేశం నుంచి అధిక మొత్తంలో దోచుకున్నారు. వీరు మన దేశం నుంచి సంపదను దోచుకోకపోతే నేడు భారత్ ప్రపంచంలో అగ్రగామి దేశంగా ఉండేది. వారు దోచుకోకపోతే భారత్ జీడీపీ 65 ట్రిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ఉండేది. కానీ బ్రిటీష్ వారు పెద్ద మొత్తంలో భారత్‌ను దోచుకోవడం వల్ల ఐదవ స్థానంలో ఉన్నట్లు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. బ్రిటీష్ వారు ఇండియాను దాదాపుగా 135 ఏళ్ల పాటు 65 లక్షల కోట్ల డాలర్ల కంటే ఎక్కువగా దోచుకున్నాడు. నాట్ మేకర్స్ నివేదిక ప్రకారం 1765 నుంచి 1900 మధ్య బ్రిటిష్ వారు భారతదేశం నుంచి 65 లక్షల కోట్ల విలువైన వస్తువులను దోచుకున్నారు. ఇది మొత్తం యునైటెడ్ స్టేట్స్ జీడీపీ కంటే రెండింతలు. అంతే కాకుండా బ్రిటన్ జీడీపీకి 17 రెట్లు అవుతుంది. బ్రిటీష్ పాలన కంటే ముందే భారతదేశానికి ప్రపంచంతో వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. ఈస్టిండియా కంపెనీ కాలంలో భారతదేశం నుంచి ఉచితంగా వస్తువులు ఎగుమతి అయ్యేవి. కానీ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనకు ముందు, దిగుమతి చేసుకునే దేశాలు భారతీయ తయారీ దారులకు బంగారం చెల్లించేవి. కానీ బ్రిటిష్ వారు మనల్ని పాలించం మొదలు పెట్టిన తర్వాత విదేశీ కొనుగోలుదారులు నేరుగా బ్రిటీష్ వారికి బంగారం, బ్రిటిష్ కరెన్సీ, పౌండ్ రూపంలో పన్నులు చెల్లించడం ప్రారంభించారు. ఈ డబ్బుతోనే బ్రిటన్ వ్యాపారాలను యూరప్ దేశాల్లో పెట్టుబడి పెట్టారని చెబుతుంటారు. బ్రిటీష్ వారు దోచుకున్న సంపదను భారత్ మొత్తం తిరిగి పొందితే.. మొత్తం విదేశీ రుణాన్ని తిరిగి చెల్లించవచ్చు. గతేడాదికి భారతదేశం విదేశీ రుణం సుమారు 710 బిలియన్ల డాలర్లు. అంటే భారతదేశం 2030 నాటికి 7 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని చేరుకోవాలంటే.. మౌలిక సదుపాయాలలో 2.2 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టాలి. అదే బ్రిటీష్ వారు మన సంపదను దోచుకోకపోయి ఉంటే.. నేడు ఇండియా అగ్ర దేశంగా ఉండేది.