Health Tips : పొట్టను చాలా కాలంగా శుభ్రం చేయకపోతే అది మలబద్ధకం లేదా ఉబ్బరం సమస్యకు కారణం కావచ్చు. ప్రస్తుతం చెడు జీవన శైలి, ఆహారపు అలవాట్ల వల్ల కడుపు సంబంధిత సమస్యలు ఎక్కువగా వేధిస్తున్నాయి. చాలా సార్లు ప్రజలు తమ పొట్టను శుభ్రం చేయడానికి ఎక్కువ మందులు లేదా పౌడర్‌లను తీసుకోవడం కామన్ గా గమనిస్తున్నాము. కానీ ఎక్కువ మందులు తీసుకోవడం వల్ల దుష్ప్రభావాలు కూడా ఉంటాయి అంటున్నారు నిపుణులు.
పొట్టలో గ్యాస్ లేదా అజీర్ణం అనేది చాలా సాధారణమైన మస్య గా వస్తుంది. అయితే పొట్టను శుభ్రంగా ఉంచుకోవడానికి సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం అని పోషకాహార నిపుణుడు నమామి అగర్వాల్ తెలిపారు. మన ఆహారంలో ఉండే సరైన విషయాలు కడుపు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయట. అయితే ఈ సమస్య నుంచి తప్పించుకోవడానికి కాస్త ఫైబర్ అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. కడుపు ఆరోగ్యానికి ఫైబర్ చాలా ముఖ్యమైనది. ఇది పేగులను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. మీకు మలబద్ధకం సమస్య ఉంటే, ఫైబర్ అధికంగా ఉండే పండ్లు మరియు కూరగాయలను తినండి.
యాపిల్ లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది పొట్టను శుభ్రపరుస్తుంది. ఇక కివిలో పెక్టిన్ ఉంటుంది. ఇది కూడా జీర్ణక్రియకు సహాయపడుతుంది. బచ్చలికూర, ఇతర ఆకు కూరల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. తృణధాన్యాలు కూడా తినండి.
వోట్మీల్, బ్రౌన్ రైస్, క్వినోవా వంటి తృణధాన్యాలు కూడా మలబద్ధకం నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడతాయి. ఈ ధాన్యాలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఇవి పేగు ఆరోగ్యాన్ని కూడా కాపాడుతాయి. వోట్మీల్‌లో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది కడుపుని శుభ్రపరుస్తుంది. ప్రోబయోటిక్స్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం కూడా అలవాటు చేసుకోవాలి.
పెరుగు, మజ్జిగ వంటి ప్రోబయోటిక్స్ కలిగిన ఆహారాలు జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడతాయి. అవి పేగులను శుభ్రంగా ఉంచడంలో సహాయపడే మంచి బ్యాక్టీరియాను కలిగి ఉంటాయి. పెరుగును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కడుపు శుభ్రంగా ఉంటుంది. జీర్ణక్రియ ప్రక్రియ ఆరోగ్యంగా ఉంటుంది.
ఇక గ్యాస్ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి కొన్ని వ్యాయామాలు కూడా చేయవచ్చు. వీటి వల్ల కూడా ఉపశమనం లభిస్తుంది. హలాసనం, ఉత్తానపదం, అర్ధాలాసనం, పవన్ముక్తాసనం వంటి ఆసనాలు వేయాలి. ఆసనాలన్నీ రోజూ ఆచరించడం వల్ల కడుపుకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. ఈ సాధారణ వ్యాయామాలు చేయడం వల్ల జీర్ణవ్యవస్థ బలపడుతుంది. ప్రజలు మలబద్ధకం, అజీర్ణం మరియు ఆకలి లేకపోవడం నుండి ఉపశమనం పొందుతారు. ఈ ఆసనం చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. దీని వల్ల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.