https://oktelugu.com/

Telangana: బాప్ రే.. తెలంగాణ రాష్ట్రంపై ఇన్ని అప్పులా? తెలిస్తే షాక్ అవుతారు

Telangana: తెలంగాణ ఓ వైపు ధనిక రాష్ర్టంగా చెబుతున్నా అప్పులు కూడా అదే రేంజ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు లోక్ సభలో కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించిన వివరాలు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది. నవంబర్ 30 నాటికి రూ. 2,37,747 కోట్లు అప్పుగా ఉందని తేల్చింది. స్వదేశీ అప్పులు రూ. 2,34,912 కోట్లు కాగా విదేశీ అప్పులు రూ. 2835 కోట్లుగా నిర్ధారించారు. దీంతో తెలంగాణ ధనిక రాష్ర్టమని చెప్పుకునే కేసీఆర్ ఏం […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 21, 2021 / 07:28 PM IST
    Follow us on

    Telangana: తెలంగాణ ఓ వైపు ధనిక రాష్ర్టంగా చెబుతున్నా అప్పులు కూడా అదే రేంజ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు లోక్ సభలో కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించిన వివరాలు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది. నవంబర్ 30 నాటికి రూ. 2,37,747 కోట్లు అప్పుగా ఉందని తేల్చింది. స్వదేశీ అప్పులు రూ. 2,34,912 కోట్లు కాగా విదేశీ అప్పులు రూ. 2835 కోట్లుగా నిర్ధారించారు. దీంతో తెలంగాణ ధనిక రాష్ర్టమని చెప్పుకునే కేసీఆర్ ఏం సమాధానం చెబుతారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.

    Telangana

    ఓ పక్క ధనిక రాష్ర్టమని సర్వేలు చెబుతున్నాయి. కాగ్ చెబుతోందని బుకాయిస్తున్నా ఇదేంటని ప్రతిపక్షాలు గోల పెడుతున్నాయి. ప్రభుత్వం మొత్తం రుణాన్ని సాగునీటి ప్రాజెక్టుల్లో పెట్టి సంక్షేమ పథకాల ఊసే లేకుండా చేసిందని తెలుస్తోంది. ఏదో మొక్కుబడిగా కల్యాణ లక్ష్మి లాంటి పథకాలు చేపడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నట్లు చెబుతున్నారు.

    ధనిక రాష్ర్టం అప్పుల్లో ఎందుకుంటుంది మిగులు బడ్జెట్ తో ఉండాలి కదా అని ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ చేస్తున్న జిమ్మిక్కుల్లో ఇదో రకం అని తెలుస్తోంది. కేంద్రం ఇస్తున్న పథకాలను కూడా తన పథకాలుగా చెప్పుకుంటూ పబ్బం గడుపుకోవడం కేసీఆర్ కు చెల్లుతుంది. రాష్ర్టం అప్పుల్లో అగ్రగామిగా నిలుస్తోంది. గత ప్రభుత్వాలు కేవలం యాభై వేల కోట్లు అప్పుగా తెచ్చుకుంటే ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చి తమది ధనిక రాష్ర్టంగా చెప్పుకోవడం విడ్డూరమే.

    Also Read: Amit Shah: కేసీఆర్ ట్రాప్ గురించి అమిత్ షాకు బాగానే తెలుసే?

    ఈ నేపథ్యంలో అప్పులకు ఏం సమాధానం చెబుతారు. వాటిని ఎవరు తీరుస్తారు? ఎలా తీరుస్తారు? అనే ప్రశ్నలు వస్తున్నాయి. దీంతో కేసీఆర్ స్టేట్ ను అధోగతి పాలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు తమదే నిజమైన ప్రభుత్వంగా గొప్పలు చెప్పుకుంటూ పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా పరిస్థితి మారటం చూస్తున్నాం.

    Also Read: Telangana: ధాన్యం కొనుగోళ్లు: తప్పు తెలంగాణదే అన్నట్టు?

    Tags