Babu Mohan: హాస్య నటుడు, మాజీ ఎమ్మెల్యే బాబుమోహన్ స్థానికతపై చిక్కు ముడి వీడింది. కొద్ది రోజులుగా ఆయన నేటివిటీపై పలు ఊహాగానాలు వస్తున్నాయి. అయితే ఆయన మాత్రం తన స్థానికతపై పెదవి విప్పలేదు. దీంతో పలుమార్లు భిన్న వాదనాలు వినిపిస్తున్నాయి. ఆయనది ఖమ్మం జిల్లా అని కొందరంటే మరొకొందరేమో మానుకోట అని చెబుతున్నారు. దీంతో బాబూమోహన్ స్థానికతపై చిక్కుముడి వీడలేదు. ఈ క్రమంలో ఆయన రాజకీయాల్లో కూడా ప్రాతినిధ్యం వహించి టీడీపీలో మంత్రిగా కూడా పని చేశారు.

సినిమాల్లో బాబూమోహన్ తనదైన శైలిలో హాస్యం పండించి ప్రేక్షకులను మెప్పించారు. కోట శ్రీనివాసరావు బాబూమోహన్ కాంబినేషన్ లో వచ్చిన ప్రతి సినిమా విజయవంతమైంది. అంటే వారి జోడీ అంతలా ప్రాధాన్యం సంతరించుకుంది. హాస్యంలో తనదైన మేనరిజంతో అందరిని ఆకట్టుకున్నారు. హాస్యనటుల్లో మేటిగా పేరుతెచ్చుకోవడం మామూలు విషయం కాదు.
బాబూమోహన్ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ఎన్టీఆర్ హయాంలో 1999లో అందోలు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా కూడా పనిచేశారు. కానీ ముమ్మడివరం నుంచి ఉప ఎన్నికల్లో కూడా విజయం సాధించారు. అందోలు నుంచే 2004, 2009లో కాంగ్రెస్ అభ్యర్థి దామోదరం రాజనర్సింహ చేతిలో ఓటమి పాలయ్యారు.
Also Read: Writer Movie: సమాజాన్ని రిఫ్లెక్ట్ చేసే కథలే నేను తీస్తా- పా.రంజిత్
గత కొంత కాలంగా బాబూమోహన్ స్థానికతపై అందరిలో సందేహాలు ఉన్నాయి. ఇటీవల మహబూబాబాద్ జిల్లాలో బీజేపీ శిక్షణ తరగతులకు హాజరైన ఆయన తన స్థానికతపై పెదవి విప్పారు. తన సొంత ఊరు మహబూబాబాద్ అని కుండ బద్దలు కొట్టారు. దీంతో ఇన్నాళ్లుగా నాన్చుతూ వచ్చిన రహస్యం బట్టబయలు అయింది. మానుకోట జిల్లా నర్సింహులపేట మండలం బొజ్జన్నపేటగా చెప్పారు.