బీహార్ ఎన్నికల బరిలో ఎంతమంది నేర చరితులో తెలుసా?

చట్టసభల్లో నేరచరితులు ఉండరాదన్నది సుప్రీం కోర్టు అభిప్రాయం. ఈ విషయంలో పిటీషన్లు దాఖలయ్యాయి. విచారణలు జరుగుతున్నాయి. అధికారం అడ్డుపెట్టుకొని అక్రమాలు చేసిన నేతలున్నారు. జైలుకు వెళ్లిన వారు ఎందరో ఉన్నారు. ‘పవర్‌‌’ ఉంటే పట్టించుకునే వారు ఉండరు. ఇంకా దిగజారి పదవుల మాటున దోపిడీలు, దాడులు, హత్యలు, హత్యాయత్నాలు.. ఇంకా ఎన్నో దారుణాలు. పొలిటీషియన్లు గూండాలుగా మారి కేసుల పాలవుతున్నారు. వారే ప్రజలను ఏలుతున్నారు. దేశంతో పలువురు తాజా, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీల మీద 4,442 కేసులు […]

Written By: NARESH, Updated On : July 27, 2021 3:52 pm
Follow us on

చట్టసభల్లో నేరచరితులు ఉండరాదన్నది సుప్రీం కోర్టు అభిప్రాయం. ఈ విషయంలో పిటీషన్లు దాఖలయ్యాయి. విచారణలు జరుగుతున్నాయి. అధికారం అడ్డుపెట్టుకొని అక్రమాలు చేసిన నేతలున్నారు. జైలుకు వెళ్లిన వారు ఎందరో ఉన్నారు. ‘పవర్‌‌’ ఉంటే పట్టించుకునే వారు ఉండరు. ఇంకా దిగజారి పదవుల మాటున దోపిడీలు, దాడులు, హత్యలు, హత్యాయత్నాలు.. ఇంకా ఎన్నో దారుణాలు. పొలిటీషియన్లు గూండాలుగా మారి కేసుల పాలవుతున్నారు. వారే ప్రజలను ఏలుతున్నారు. దేశంతో పలువురు తాజా, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీల మీద 4,442 కేసులు పెండింగ్‌లో ఉన్నాయంటే రాజకీయంలో నేరచరిత్ర ఎలా పెరుగుతోందో అర్థం చేసుకోవచ్చు .

Also Read: రాహుల్ కు తిరుగులేని ప్రచార అస్త్రాలిచ్చిన మోదీ..!

బీహార్ ఎన్నికల వేళ నేరచరితులు భారీగానే బరిలో ఉండడం అందరినీ షాక్ కు గురిచేస్తోంది. నేర చరితులు ఎన్నికల్లో పోటీచేయకుండా సుప్రీం కోర్టులో పిటీషన్లు దాఖలయ్యాయి. విచారణలు జరుగుతున్నాయి. ఇది ఎప్పుడు అమలవుతుందనేది వేచిచూడాలి. సుప్రీం కోర్టు ఆదేశించినా.. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తాయన్న దాఖలాలు లేవు. ఎందుకంటే సగం మంది నేతలపై కేసులున్నాయి. దీంతో ఇది అమలు కావడం కష్టమేనంటున్నారు. అది అమలైతే ఏపీ సీఎం జగన్ కు కూడా కష్టమే మరి.

తాజాగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ నేరచరితుల హవా కొనసాగుతోంది.. బిహార్ తొలి విడత అసెంబ్లీ ఎన్నికలు బుధవారం జరుగనున్నాయి. తొలి విడతలో ఓటింగ్ జరుగుతున్న నియోజకవర్గాల్లో పోటీచేస్తున్న అభ్యర్థుల్లో 31శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉండడం గమనార్హం.

Also Read: ప్రజలకు అధికారం దిశగా జమ్మూ-కాశ్మీర్ ప్రభుత్వ చర్యలు

బీహార్ ఎన్నికల్లో పోటీచేస్తున్న మొత్తం 1064మంది అభ్యర్థుల్లో 328మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నాయని అఫిడవిట్ లో పేర్కొన్నారు. వారిలో ముగ్గురిపై రేప్ కేసులు.. 26మందిపై స్త్రీహింస కేసులు, 83మందిపై హత్య కేసులు, అటెంప్ట్ టు మర్డర్ కేసులు నమోదయ్యాయి.

ఇలా నేరచరితులే మన పాలకులు అయిపోతున్నారు. వారినే ఎన్నుకుంటూ ఓరకంగా ప్రజలు కూడా తప్పు చేస్తున్నారనే చెప్పొచ్చు.