చంద్రబాబు అప్పుడు పట్టించుకోలేదట..!

అధికారంలో ఉన్న వైఎస్సార్‌ పార్టీ చేస్తున్న కొన్ని కార్యక్రమాలపై టీడీపీ నేతలు తీవ్రంగా మథనపడుతున్నారు. ముఖ్యంగా నామినేటెట్‌ పోస్టుల భర్తీలో జగన్‌ చాకచక్యంగా నిర్ణయాలు తీసుకుంటూ పార్టీలోని అందరికీ పదవులు వచ్చేలా ప్లాన్‌ చేస్తున్నాడు. దీంతో వైసీపీ క్యాడర్‌ జోష్‌లో ఉఉండగా టీడీపీ క్యాడర్‌ తీవ్ర నిరాశలో ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు అధికారంలో ఉండగా నామినేటేడ్‌ పోస్టుల భర్తీలో ఇంత కూడా చొరవ తీసుకోలేదనే చర్చ జోరుగా సాగుతోంది. అప్పుడు చంద్రబాబు అందరికీ సమన్యాయం చేసి […]

Written By: NARESH, Updated On : October 26, 2020 12:48 pm
Follow us on

అధికారంలో ఉన్న వైఎస్సార్‌ పార్టీ చేస్తున్న కొన్ని కార్యక్రమాలపై టీడీపీ నేతలు తీవ్రంగా మథనపడుతున్నారు. ముఖ్యంగా నామినేటెట్‌ పోస్టుల భర్తీలో జగన్‌ చాకచక్యంగా నిర్ణయాలు తీసుకుంటూ పార్టీలోని అందరికీ పదవులు వచ్చేలా ప్లాన్‌ చేస్తున్నాడు. దీంతో వైసీపీ క్యాడర్‌ జోష్‌లో ఉఉండగా టీడీపీ క్యాడర్‌ తీవ్ర నిరాశలో ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు అధికారంలో ఉండగా నామినేటేడ్‌ పోస్టుల భర్తీలో ఇంత కూడా చొరవ తీసుకోలేదనే చర్చ జోరుగా సాగుతోంది. అప్పుడు చంద్రబాబు అందరికీ సమన్యాయం చేసి ఉంటే పార్టీ ఇంతలా ఢీలా పడే పరిస్థితి ఉండేది కాదని చర్చించుకుంటున్నారు.

Also Read: సీఎం జగన్.. ఎన్నికలు ఇప్పుడైతేనే బెటర్‌..!

ఇటీవల జగన్‌ ప్రభుత్వం బీసీ కార్పొరేషన్లకు చైర్మన్లు, డైరెక్టర్లను ఇతర పదవులను భర్తీ చేసింది. దీంతో వైసీపీలో ఇంతకాలం వేచి చూసిన వారికి న్యాయం జరిగినట్లయింది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు సీఎం కసరత్తు చేస్తున్నారు. మొత్తంగా వైసీపీలోని ప్రతి ఒక్కరికి ఏదో ఒక పదవి వచ్చేలా జగన్‌ ప్రణాళిక రూపొందిస్తున్నారు. టీడీపీ అధికారంలో బీసీ కార్పొరేషన్ల ఊసే లేదు. ఇప్పుడు వైసీపీ మాత్రం 56 కార్పొరేషన్ల చైర్మన్లను నియమించడంతో బీసీ కులాల వారికి ఆకట్టుకున్నట్లయింది.

2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం గురించి ఆలోచించడమే గానీ పార్టీని పట్టించుకోలేదని టీడీపీ నాయకులు లోలోపన మథనపడుతున్నారు. కొంతమంది టీడీపీని వీడి వైసీపీలోకి వెళ్లిన వారికీ ఉన్నతమైన పదువులు వచ్చాయి. టీడీపీని పట్టుకొని ఉన్నవారికి కనీసం నామినేటేడ్‌ పోస్టు కూడా దక్కలేదని కొందరు ఆవేదన చెందుతున్నారు. మరోవైపు అధికారంలో ఉన్నప్పుడు బాబు ఇతర పార్టీల వారిని చేర్చుకొని వారికి మాత్రమే పదవులు కట్టబెట్టారని, వారికి ఆకర్షించడానికి పదవులు ఇచ్చి ఉన్నవారిని పట్టించుకోలేదంటున్నారు.

Also Read: బీహార్ ఎన్నికల బరిలో ఎంతమంది నేర చరితులో తెలుసా?

మరోవైపు టీడీపీ హయాంలో బీసీలను అణగదొక్కారని, ఇప్పుడ జగన్‌ మాత్రం అన్ని వర్గాల వారిని ఆకర్షిస్తున్నారంటూ ప్రస్తుత సీఎంపై టీడీపీ నాయకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. చంద్రబాబు అప్పుడు కేవలం అగ్రవర్ణాలకు మాత్రమే పదవులు కట్టబెట్టారని, అందుకే బీసీ నేతలంతా పార్టీని వీడారన్నారు. దీంతో టీడీపీ దీనవస్థలోకి చేరిందని అంటున్నారు. ఇక టీడీపీలోని బీసీ నేతలంతా పరోక్షంగా బీసీ కార్పొరేషన్‌ ఏర్పాటును స్వాగతిస్తునామని అనడం గమనార్హం.