https://oktelugu.com/

రాశీ ఖన్నా బాధను కాస్త పట్టించుకోండి బాబూ

‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన బొద్దుగుమ్మ రాశీ ఖన్నా. మొదటి సినిమాలో ఆమెను చూసి అరె.. ఈ అమ్మాయి పద్దతిగా భలే ఉందే అనుకున్నారు కుర్రకారు. ఆ తరవాత ‘జిల్’ సినిమాలో గ్లామర్ ట్రీట్ ఇచ్చి తనలోనూ కమర్షియల్ యాంగిల్ ఉందని ప్రూవ్ చేసుకుంది. అక్కడి నుండి ఆమెకు ఆఫర్లు క్యూ కట్టాయి. ఎప్పుడైనా ఆఫర్లతో పాటు హిట్లు కూడ ఉంటేనే ఎవరైనా లైమ్ లైట్లో ఉంటారు. రాశీ ఖన్నాను ఆ వరుస హిట్లే […]

Written By:
  • Neelambaram
  • , Updated On : October 26, 2020 / 11:17 AM IST
    Follow us on

    ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన బొద్దుగుమ్మ రాశీ ఖన్నా. మొదటి సినిమాలో ఆమెను చూసి అరె.. ఈ అమ్మాయి పద్దతిగా భలే ఉందే అనుకున్నారు కుర్రకారు. ఆ తరవాత ‘జిల్’ సినిమాలో గ్లామర్ ట్రీట్ ఇచ్చి తనలోనూ కమర్షియల్ యాంగిల్ ఉందని ప్రూవ్ చేసుకుంది. అక్కడి నుండి ఆమెకు ఆఫర్లు క్యూ కట్టాయి. ఎప్పుడైనా ఆఫర్లతో పాటు హిట్లు కూడ ఉంటేనే ఎవరైనా లైమ్ లైట్లో ఉంటారు. రాశీ ఖన్నాను ఆ వరుస హిట్లే కరువయ్యాయి. వరుసగా ‘బెంగాల్ టైగర్, హైపర్, శివమ్’ లాంటి ఫ్లాప్స్ ఎదురయ్యాయి.

    Also Read: త్రివిక్రమ్‌కు కొత్త తిప్పలు తెచ్చిపెట్టిన రాజమౌళి

    మధ్యలో ‘సుప్రీమ్, జైలవకుశ’ సినిమాలతో మెప్పించి ట్రాక్లో పడింది అనుకునే సమయానికి ‘విలన్, ఆక్సిజన్, టచ్ చేసి చూడు’ అంటూ పరాజయాలు పలకరించి ఆమెను డీలాపడేలా చేశాయి. అప్పటికీ ‘తొలిప్రేమ’ విజయంతో పుంజుకున్నా ‘శ్రీనివాస్ కళ్యాణం ‘ దెబ్బకొట్టింది. 2019లో ‘వెంకీ మామ, ప్రతిరోజూ పండగే’ విజయాలతో బౌన్స్ బ్యాక్ అయినా ‘వరల్డ్ ఫెమస్ లవర్’ ఇచ్చిన షాక్ ఆమెకు గట్టిగా తగిలింది. ఆ పరాజయంతో అవకాశాలు బాగా తగ్గాయి. పైపెచ్చు లాక్ డౌన్ రావడంతో ఆమెను గుర్తుపెట్టుకున్నవారు కరువయ్యారు.

    Also Read: నాని, సాయి పల్లవి.. ఏం లేదు.. అంతా కూల్

    దీంతో ఇక లాభం లేదనుకున్న రాశీ ఖన్నా అందరు హీరోయిన్ల తరహాలోనే ఫోటోషూట్లతో హడావుడి చేయడం స్టార్ట్ చేసింది. కొత్తకొత్తగా ఫోటోషూట్లు చేసి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో, పీఆర్ బృందాలతో ఇండస్ట్రీలోకి, ప్రేక్షకుల్లోకి వదులుతోంది. ఒకవైపు గ్లామర్ వలకబోస్తూ ఫోటోలు దిగుతూనే ఇంకోవైపు పల్లెటూరి చీరకట్టులో పద్దతిగా కనిపిస్తూ ఆకట్టుకుంటోంది. ఇటీవల ఆమె చేసిన రెండు మూడు ఫోటోషూట్లు బాగా వైరల్ అయ్యాయి. మొత్తానికి రాశీ ఖన్నా ఫోటోషూట్లతో తనను తాను గట్టిగానే గుర్తుచేస్తోంది. మరి ఈ ప్రయత్నంతో అయినా ఆమెకు తెలుగులో అవకాశాలు రావడం మొదలవుతాయేమో చూడాలి.