ఒక సంవత్సరం తర్వాత కరోనా ఎలా మారుతుందంటే?

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారికి అంతం ఎప్పుడు? అసలు అంతం అవుతుందా? మొదటి వేవ్ పోయింది.. తట్టుకున్నాం.. రెండో వేవ్ లో తట్టుకోలేక మరణించాం.. ఇప్పుడు మూడో వేవ్ వస్తోంది.ఎంతటి ఘోరాలను చేస్తుందోనన్న భయం వెంటాడుతోంది. థర్డ్ వేవ్ భయాలు కమ్ముకుంటున్న వేళ కరోనాపై పరిశోధకులు ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నారు. ఖచ్చితంగా దేశంలో మూడో వేవ్ (థర్డ్ వేవ్) ఉండే అవకాశం ఉందని ఏషియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ(ఏఐజీ) ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ […]

Written By: NARESH, Updated On : July 2, 2021 11:25 am
Follow us on

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారికి అంతం ఎప్పుడు? అసలు అంతం అవుతుందా? మొదటి వేవ్ పోయింది.. తట్టుకున్నాం.. రెండో వేవ్ లో తట్టుకోలేక మరణించాం.. ఇప్పుడు మూడో వేవ్ వస్తోంది.ఎంతటి ఘోరాలను చేస్తుందోనన్న భయం వెంటాడుతోంది. థర్డ్ వేవ్ భయాలు కమ్ముకుంటున్న వేళ కరోనాపై పరిశోధకులు ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నారు.

ఖచ్చితంగా దేశంలో మూడో వేవ్ (థర్డ్ వేవ్) ఉండే అవకాశం ఉందని ఏషియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ(ఏఐజీ) ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. సెప్టెంబరులోనే అది వచ్చే అవకాశం ఉందని తెలిపారు. వైరస్ లో తీవ్రమైన ఉత్పరివర్తనాలు జరిగితే తప్ప ఇక్కడ దాని ప్రభావం తక్కువేనన్నారు. థర్డ్ వేవ్ పిల్లలపై తీవ్రంగా ఉంటుందనేది అపోహనే అన్నారు.

నిజానికి తొలి రెండు వేవ్ లలోనూ పిల్లలకు ఇన్ఫెక్షన్ సోకింది. కానీ అంత తీవ్ర ప్రభావం చూపలేదు. వారికి యాంటీబాడీలు వృద్ధి చెందాయి. ఇప్పుడు థర్డ్ వేవ్ ను అరికట్టాలంటే వేగవంతమైన టీకాల పంపిణీతోపాటు కోవిడ్ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారానే సాధ్యమవుతుంది.

సెకండ్ వేవ్ కు కారణమైన డెల్టా వైరస్ తీవ్రత అధికమని.. అది ఒకరి నుంచి 8 మందికి సోకే అంత స్పీడుతో ఉందని నిపుణులు తేల్చారు. ఇంట్లోకి ఒకరికి వస్తే అందరికీ వ్యాపిస్తుందన్నారు. అయితే ఇప్పుడు డెల్టా ప్లస్ కూడా వస్తోంది. ఆ కేసుల తీవ్రత అనేది త్వరలోనే తేలనుంది.

ఇక కరోనా అనేది అందరూ టీకాలు వేసుకున్నాక.. అదొక సాధారణ జలుబు, దగ్గు, జ్వరంలా మారిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఇదో మామూలు వ్యాధిలా అవుతుందని అప్పటికీ అందరికీ ఉపశమనం కలుగుతుందని చెబుతున్నారు.