Independence Day 2023: స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఈ పార్టీ నేత చొరవతో సీఎంలు జెండా ఎగురవేస్తున్నారు.. ఆయన ఎవరో తెలుసా?

ప్రతీ స్వాతంత్ర్య దినోత్సవం రోజున దేశానికి సంబంధించిన జెండాను ఎర్రకోటపై ప్రధానమంత్రి ఎగువేస్తారు. ఆయా రాష్ట్రాల్లో సీఎంలు ఎగురవేసి ఆ ఏడాది జరిగిన అభివృద్ధి గురించి మాట్లాడుతారు.

Written By: Chai Muchhata, Updated On : August 15, 2023 9:55 am

Independence Day 2023

Follow us on

Independence Day 2023: భారతదేశానికి స్వాతంత్ర్యం 1947 ఆగస్టు 14న అర్ధరాత్రి వచ్చింది. అందువల్ల ప్రతీ ఆగస్టు 15న సంబరాలు చేసుకుంటాం. ఈ వేడుక సందర్భంగా దేశ గొప్పతనం గురించి మాట్లాడుకుంటాం. దేశానికి స్వేచ్ఛా, స్వాతంత్ర్యం సిద్ధించాయనడానికి ప్రతీకంగా మూడు రంగుల జెండాను ఎగురవేస్తాం. అయితే స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి రాష్ట్రాల్లో గవర్నర్లు మాత్రమే జెండా ఎగురవేశారు. కానీ ఓ ముఖ్యమంత్రి తమకు కూడా జెండా ఎగురవేయడానికి అవకాశం ఇవ్వాలని కోరారు. దీంతో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ వెంటనే ఒప్పుకున్నారు. అప్పటి నుంచి ఆయా రాష్ట్రాల్లో సీఎంలు జెండా ఎగురవేస్తున్నారు. ఇంతకీ ఎవరాయన? ఎప్పటి నుంచి ముఖ్యమంత్రులు జెండా ఎగురవేస్తున్నారు?

ప్రతీ స్వాతంత్ర్య దినోత్సవం రోజున దేశానికి సంబంధించిన జెండాను ఎర్రకోటపై ప్రధానమంత్రి ఎగువేస్తారు. ఆయా రాష్ట్రాల్లో సీఎంలు ఎగురవేసి ఆ ఏడాది జరిగిన అభివృద్ధి గురించి మాట్లాడుతారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రతీ ఏడాది పరేడ్ గ్రౌండ్ లో స్వాతంత్ర్య వేడుకలు నిర్వహించేవారు. కానీ తెలంగాణ వచ్చిన తరువాత గోల్కొండ కోటలో స్వాతంత్ర్య వేడుకలు నిర్వహిస్తున్నారు. అయితే సీఎంలకు ఈ అవకాశం ఎవరిద్వారా వచ్చిందంటే?

1974 లో ఇందిరాగాంధీ ప్రభుత్వం కొనసాగుతోంది. ఆ సమయంలో తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం నడుస్తోంది. కాంగ్రెస్ కు డీఎంకే మద్దతు అన్న విషయం తెలిసిందే. ఆ పార్టీ వ్యవస్థాపకుడు కరుణానిధి నుంచి ఈ పొత్తు కొనసాగుతోంది. ఒక దశలో దేశంలో కాంగ్రెస్ నిలబడేందుకు డీఎంకే నుంచి భారీగా ఎంపీ సీట్లను నిత్యం అందిస్తుంటారు. అయితే 1974లో ఇందిరాగాంధీ ప్రభుత్వంలో డీఎంకే కీలకంగా ఉండేది. ఈ చనువుతో కరుణానిథి తమకు జెండా ఎగురవేయడానికి తమకు అవకాశం ఇవ్వాలని ఇందిరాగాంధీని కోరారు. కరుణానిథి అడిగిన వెంటనే ఇందిరాగాంధీ ఒప్పేసుకున్నారు. అప్పటి నుంచి ప్రతీ ఏడాది ఆగస్టు 15న ముఖ్యమంత్రులు జెండాను ఎగురవేస్తున్నారు.

ఇక రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు జెండా ఎగురవేస్తారు. సాయంత్రం రాష్ట్ర రాజధానిలో గవర్నర్ తో కలిసి ఎట్ హోం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తేనేటి విందు ఇస్తారు. ఇందులో అధికార, ప్రతిపక్ష రాజకీయ నాయకులంతా పాల్గొంటారు. జిల్లాల్లో కలెక్టర్ ఈ విందు ఇస్తారు. ఇలా స్వాతంత్ర్య దినోత్సవం రోజున జెండాను ఎగురవేసే భాగ్యం కల్పించింది కరుణానిధి అన్నమాట.